Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నిలంబూర్ » వాతావరణం

నిలంబూర్ వాతావరణం

ఉత్తమ సమయం విస్తారమైన వర్షాలు, తీవ్రమైన వేడి నిలంబూర్ లోని వర్షాకాలం, వేసవి కాలాల లక్షణాలు. ఈ రెండు కాలాలు వృక్షాలను, జలపాతాలను సందర్శించడానికి అనువైన కాలాలు కాదు. శీతాకాలం నిలంబూర్ సందర్శనకు అనువైనదిగా సిఫార్సు చేయబడింది. మరొక గొప్ప సమయం కొత్తగా ఆరంభమైన పచ్చదనంతో ఆశీర్వదించబడిన ప్రదేశాలు ఉండే వర్షాకాలం తర్వాతి కాలం.

వేసవి

వేసవి నిలంబూర్ లో వేసవి తీవ్రంగా ఉండి వేడి వాతావరణాన్ని కల్గి ఉంటుంది. మార్చ్ నుండి నిలంబూర్ నందు వేసవి వేడి మొదలౌతుంది. మే చివరి వరకు ఈ పట్టణం లో తీవ్ర వేసవి ఉంటుంది. ఈ కాలం లో ఉష్ణోగ్రత లు 22°సెంటి గ్రేడ్ల నుండి 35° సెంటి గ్రేడ్ వరకు వ్యాపించి ఉంటాయి. ఈ టేక్ పట్టణాన్ని సందర్శించడానికి వేసవి కాలం సిఫార్సు చేయదగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం పశ్చిమ కనుమల సామీప్యత నిలంబూర్ లో వర్షాకాలాన్ని చాల వరకు ప్రభావితం చేస్తుంది. ఈ పట్టణంలో వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. జూన్ నెలలో ప్రారంభమైన వర్షాలు సెప్టెంబర్ నెల వరకు ఉంటాయి. ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్, నవంబర్ నెలలలో కూడా వర్షాలు ఇస్తాయి. భారీ వర్షాలు సందర్శనకు అడ్డంకిగా మారే పరిస్థితి ఉన్నందున వర్షాకాలం సందర్శనకు ఉత్తమ సమయం కాదు.

చలికాలం

శీతాకాలం నిలంబూర్ లో శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా, స్వాగతించే వాతావరణ పరిస్థితులు ఉంటాయి. శీతాకాలంలో వాతావరణం చక్కగా, చల్లగా ఉంటుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 32° సెంటి గ్రేడులుగా ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు హటాత్తుగా 16° సెంటి గ్రేడులకు పడిపోతుంది. శీతాకాలం లో ఇక్కడికి వచ్చే వారు సరిపోయినన్ని ఉన్ని దుస్తులతో రావాలి.