Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నిజామాబాద్

నిజామాబాద్ - నిజాముల నగరం

16

నిజామాబాద్ పట్టణాన్ని ఇందూరు లేదా ఇంద్రపురి అని కూడా పిలుస్తారు. తెలంగాణ  లోని నిజామాబాద్ జిల్లాలో ఈ పట్టణం ఒక మునిసిపల్ కార్పొరేషన్ గా కలదు. నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయాలు నిజామాబాద్ లోనే కలవు. ఇది రాష్ట్రంలో అతి పెద్ద 10వ పట్టణం.

8వ శతాబ్దం లో ఈ పట్టణం ఇంద్ర వల్లభ పంత్య వర్ష ఇంద్ర సోమ అనే రాష్ట్రకూట వంశ రాజు పాలనలో ఉండేది. ఆ రాజు పేరుతో ఈ ప్రదేశాన్ని ఇంద్రపురి అనేవారు. అయితే, సికింద్రాబాద్ మరియు మన్మాడ్ ల మధ్య రైల్వే లైన్ వేయడంతో, ఒక కొత్త రైలు స్టేషన్ గా నిజామాబాద్ ఆవిర్భవించింది. ఈ స్టేషన్ నిజాం ఉల్ ముల్క్ అనే అప్పటి ఆ ప్రాంత పాలకుడి పేరు తో పెట్టారు. నిజామాబాద్ హైదరాబాద్ - ముంబై లైన్ లో ఒక ప్రసిద్ధ రైలు స్టేషన్ కావటం వలన ఆ పేరును నిజామాబాద్ గా మార్చారు.

నిజామాబాద్ నిజాం ఉల్ ముల్క్ పాలనలో చాలా కాలం ఒక స్వర్ణ యుగంగా ఉండేది. అతను ఒక గొప్ప కళా కారుడు. ఫలితంగా అనేక మతపర సంస్థలు అంటే మసీదులు మరియు హిందూ దేవాలయాలు నిర్మించాడు. నిజామాబాద్ జిల్లాలో అనేక పట్టణాలు, గ్రామాలు కలవు. వాటిలో ఆర్మూరు, బోధన, బాన్స్వాడ, కామారెడ్డి వంటివి పేరు పడిన ప్రదేశాలు. బోధన్ పట్టణంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కలదు. ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీ ఆసియా ఖండం లోనే పెద్డ్డది.

విభిన్న సంస్కృతుల సమ్మేళనం

నిజామాబాద్ దాని గొప్ప సాంస్కృతికతలకు చరిత్రకు ప్రసిద్ధి. పట్టణ జనాభాలో హిందువులు,క్రైస్తవులు , ముస్లిములు మరియు సిక్కులు కూడా కలరు. అన్ని మతాలవారు సఖ్యతగా వుంటారు. జండా మరియు నీలకంటేస్వర పండుగలు ఇక్కడ అమిత వైభవంగా జరుపుతారు. జండా పండుగ ఆగష్టు మరియు సెప్టెంబర్ లలో సుమారు 15 రోజుల పాటు నిర్వహిస్థారు. నీలకంటేశ్వర పండుగ, రెండురోజుల పాటు జనవరి లేదా ఫిబ్రవరిలలో చేస్తారు.

నిజామాబాద్ మరియు దాని ఆకర్షణలు

పర్యాటకపరంగా నిజామాబాద్ తెలంగాణ  పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో శ్రీ హనుమాన్ టెంపుల్, నీల కంటేశ్వర టెంపుల్, ఖిల్లా రామాలయం టెంపుల్, శ్రీ రఘునాథ టెంపుల్, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ మరియు సరస్వతి టెంపుల్ (బాసర వద్ద) వంటి ప్రముఖ దేవాలయాలు కలవు. ఈ టెంపుల్స్ మాత్రమే కాక, ఇతర చారిత్రక , పురావస్తు, వారసత్వ ప్రదేశాలు కూడా కలవు. ఇక్కడ దోమకొండ కోట కలదు. ఇది నేడు శిధిలాలలో ఉన్నప్పటికీ నిజామాబాద్ గత వైభవం తెలుసుకోడానికి తప్పక చూడాలి . పట్టణంలో మరొక కోట నిజామాబాద్ కోట. ఈ కోట కూడా వినోద, విహారాలకు, పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది. పట్టణంలో కల కెంటు మసీదుని అన్ని మతాలవారు దర్శిస్తారు.

చక్కని రవాణా సౌకర్యాలు కల పట్టణం

నిజామాబాద్ ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశం. దీనిని నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్య చూడాలి. వాతావరణం ఈ సమయం లో చాలా ఆహ్లాదంగా వుంటుంది. నిజామాబాద్ ఒక ఉష్ణమండల ప్రాంతం కావడం వలన, వేసవులు వేడిగా ఉంటాయి. ప్రత్యేకించి మే మరియు జూన్ నెలలు అధిక వేడి. వర్షాలు ఒక మోస్తరుగా పడతాయి. అదే సమయంలో గాలి లో తేమ అధికం అయి ఎంతో అసౌకర్యంగా వుంటుంది.

నిజామాబాద్ దేశం లోని ఇతర భాగాలకు రోడ్ మరియు రైలు మార్గాలలో కలుపబడి వుంది. రోడ్లు బాగా వుంటాయి. ప్రభుత్వ బస్సులు , ప్రైవేటు టాక్సీ లు లభ్యంగా వుంటాయి. టవున్ లో కల రైలు స్టేషన్ నేరుగా దేశంలోని వివిధ నగరాలకు అంటే, హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ మరియు చెన్నై లకు కలుపబడి వుంది. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ సుమారు 200 కి. మీ. ల దూరంలోని హైదరాబాద్ లో కలదు. విమానాశ్రయం నుండి నేరుగా టాక్సీ లలో నిజామాబాద్ చేరుకోవచ్చు.

 

నిజామాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నిజామాబాద్ వాతావరణం

నిజామాబాద్
27oC / 81oF
 • Patchy rain possible
 • Wind: SE 16 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం నిజామాబాద్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? నిజామాబాద్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు ప్రయాణం నిజామాబాద్ టవున్ కు మంచి రోడ్డు సదుపాయం కలదు. వివిధ ప్రదేశాల నుండి నిజామాబాద్ లోని మెయిన్ బస్సు స్టాండ్ కు ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు అధిక సంఖ్యలో వస్తూంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు ప్రయాణం ఇండియా లోని ప్రధాన పట్టణాలనుండి నిజామాబాద్ రైలు స్టేషన్ కు అనేక రైళ్ళు కలవు. భోపాల్, పూనే, నాగపూర్, ఈరోడే, నాగపూర్, ఔరంగాబాద్, మదురై, ముంబై ల నుండి రైళ్ళు కలవు. ఇక్కడకు వచ్చే రైళ్ళలో అజంతా ఎక్స్ ప్రెస్ ప్రధానమైనది. రైలు స్టేషన్ నుండి ఆటో రిక్షా లేదా బస్సులలో మీరు కోరుకున్న ప్రదేశం చేరవచ్చు.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన ప్రయాణం నిజామాబాద్ కు ఎయిర్ పోర్ట్ లేదు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి నిజామాబాద్ చేరాలి. ఎయిర్ పోర్ట్ నుండి నిజామాబాద్ సుమారు 200 కి. మీ. ల దూరం వుంటుంది. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీల లో చేరవచ్చు. చార్జీలు సుమారు రూ. 2000 నుండి 3000 వరకూ వుంటాయి.
  మార్గాలను శోధించండి

నిజామాబాద్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Feb,Fri
Return On
29 Feb,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
28 Feb,Fri
Check Out
29 Feb,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
28 Feb,Fri
Return On
29 Feb,Sat
 • Today
  Nizamabad
  27 OC
  81 OF
  UV Index: 7
  Patchy rain possible
 • Tomorrow
  Nizamabad
  27 OC
  80 OF
  UV Index: 7
  Patchy rain possible
 • Day After
  Nizamabad
  27 OC
  81 OF
  UV Index: 7
  Moderate rain at times

Near by City