Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నూర్పూర్ » వాతావరణం

నూర్పూర్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం:నూర్పూర్ పర్యటనకు సెప్టెంబర్, జూన్ నెలల మధ్య కాలం ఉత్తమమైనది. ఈ ప్రాంతపు కొండవాలులలో పర్వతారోహణకు వేసవులు అద్భుతమైనవి. జూలై, ఆగష్టు నెలలు ఇండోర్ చర్యలకు, ఆలయాలలో చక్కటి సమయాన్ని గడపడానికి ఉత్తమంగా పరిగణిస్తారు. దీనితో బాటుగా సెప్టెంబర్, నవంబర్ నెలల మధ్య కాలం ప్రదేశాల సందర్శనకు, పర్వతారోహణకు, ఆలయాలు చూడటానికి అనువైనది. మంచు కప్పిన పర్వతాలను చూడదలచిన పర్యాటకులు నూర్పూర్ ను డిసెంబర్, ఫిబ్రవరి నెలల మధ్యలో సందర్శించవచ్చు.

వేసవి

నూర్పూర్లో వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకర౦గా ఉంటుంది.వేసవి కాలం (మార్చ్ నుండి జూన్ వరకు) : నూర్పూర్ ప్రాంతంలో మార్చి నెల వేసవి ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో, ఈ ప్రాంత ఉష్ణోగ్రత 22 – 38 డిగ్రీల సెంటిగ్రేడ్ల మధ్య ఉంటుంది. ఈ కాలాన్ని ఇక్కడి పర్వతారోహణకు ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం ( జూలై నుండి సెప్టెంబర్ వరకు) : వర్షాకాలం జులై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో నూర్పూర్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. పర్యాటకులు వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించదలచుకుంటే తగిన వర్షపు దుస్తులు తీసుకుని వెళ్ళడం మంచిది.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు) : శీతాకాలం నూర్పూర్లో డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడ చాల చలిగా ఉండటమే కాక, ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటిగ్రేడ్ కనీస స్థాయికి పడిపోతుంది. ఈ ప్రాంతంలో భారీగా మంచుకురవడం వలన పర్యాటకులు సరిగ్గా కనబడకపోవడం, రోడ్డు దిగ్బంధాలను చవిచూడవచ్చు.