Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పహల్గాం » వాతావరణం

పహల్గాం వాతావరణం

పహల్గాం సందర్శనకు వేసవి అనుకూలం. శీతాకాలం లో అత్యధిక చలి, మంచు కారణంగా టూరిస్టులు అక్కడి అందాలను  ఆనందించలేరు.

వేసవి

పహల్గామ్ వాతావరణం వేసవి కాలంలో చాల ఆహ్లాదకరంగా ఉండి, సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశం చలికాలంలో విపరీతంగా చలి ఉంటుంది. మంచు ఎక్కువగా పడుతుంది. ఈ కాలంలో మంచుతో కూడిన ప్రకృతి సౌందర్య దృశ్యాలు కన్నులకు ఇంపుగా ఉంటాయి.వేసవికాలం వేసవికాలం (మార్చ్ నుండి జూన్) ఈ నెలల్లో పహల్గామ్ లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వలన, యాత్రికులు చాలామంది సందర్శించటానికి వొస్తారు. ఈ కాలంలో వేడి 12డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 22డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. వేసవికాలంలో చిరుజల్లులు కూడా పడుతుంటాయి.

వర్షాకాలం

వర్షఋతువు(జూలై నుండి అక్టోబర్) వర్షాకాలం ఇక్కడ జూలై నెలలో మొదలై అక్టోబర్ చివరివరకు ఉంటుంది. ఈ సమయంలో, పహల్గాం అత్యంత తేమగా ఉంటుంది. కావున, ఈ సమయం యాత్రికులకు అనుకూలం కాదు.

చలికాలం

శీతాకాలము(నవంబర్ నుండి ఫెబ్రవరి) ఇక్కడ నవంబర్ నుండి ఫెబ్రవరి వరకు చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చలి ఎక్కువగా ఉండి, ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. ఉష్ణోగ్రత 0 డిగ్రీ కన్నా తక్కువగా ఉంటుంది. యాత్రికులు ఈ సమయంలో కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని తనివిదీరా ఆస్వాదిన్చవొచ్చు.