Search
  • Follow NativePlanet
Share

పంచగని - అయిదు కొండల ప్రాంతం         

10

ప్రకృతి రమణియత తో శోభిల్లే జంట పర్యాటక కేంద్రాలు మహారాష్ట్ర లోని పంచగని, మహాబలేశ్వర్ లు. పంచగని బ్రిటీషు వారిచే కనుగొనబడిన వేసవి విడిది. ఇది  సముద్రమట్టానికి 1,350 మీటర్ల ఎత్తులో ఉంది. చరిత్ర అందిస్తున్న ఆధారాల ప్రకారం  జాన్ ఛెసన్ అనే  బ్రిటీష్ సూపరింటెండ్ ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడట. పంచగని అంటే అయిదు కొండల ప్రాంతం అని అర్ధం. పంచగని లోయల అందాలు దేశ విదేశ పర్యాటకులకు కనువిందు చేస్తూ వారిని ఆకర్షిస్తున్నాయి. చారిత్రకంగా ఆనాడు బ్రిటీషు వారికి ఇష్టమైన వేసవి విడిది ఇది. ఇప్పటికీ పంచగని లో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇక వర్ష ఋతువు ఈ ప్రాంతానికి సరికొత్త అందాలను తీసుకు వస్తుంది. ఇరుకైన కొండల మధ్య సన్నని జలపాతాలు మనోహరంగా ఉంటాయి.

పంచగని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ప్రాంతం.

మొదటి సారి పర్యాటకానికి బయలుదేరే వారికైనా, అనుకున్నదే తడవుగా బ్యాగ్ ప్యాక్ తో బయలుదేరే యాత్రికులకైనా ఇదో గొప్ప పర్యాటక కేంద్రం. అందమైన పకృతి లో కొండల మధ్య సూర్యాస్తమయం ఆస్వాదించాలన్నా, అలా కాసేపు బొటు లో షికారు చేద్దామనుకున్నా, స్ట్రా బెర్రీ పళ్ళూ కోసుకోవాలన్నా, లేదా మీరు సాహసోపేతమైనా ఆలోచనలున్నవారైతే పారాగ్లైడింగ్ చేయవచ్చు. ఇలా ప్రతి ఒక్కరినీ ఆహ్లాదపరిచే ఎన్నో ప్రత్యేకతలు కలిగిఉన్న ప్రదేశం పంచగని.

పశ్చిమ భారతదేశంలోని పారాగ్లైడింగ్కు అనువైన ప్రదేశాల్లో ప్రముఖమైన ప్రాంతం పంచగని. 4,500 అడుగుల ఎత్తులో సుందరమైన లోయలు, చల్లని పిల్ల గాలులు వంటి సహజ సౌందర్యం  మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఇక్కదనుంచి పారాగ్లైడింగ్ చేస్తుంటే ఆ కొండల సౌదర్యం కన్నుల విందుగా ఉంటుంది. పారాగ్లైడింగ్ లో అంతగా అనుభవం లేనివారైనా సుశిక్షుతులైన పైలట్ల సహాయం తో ఆకాశం నుండి పంచగని అందాలని వీక్షించే సదుపాయమూ ఇక్కడ ఉండి. ( టాండమ్ ) పంచగని ప్రకృతి ప్రేమికుల పాలిట ఓ వరం

చుట్టూ పచ్చటి ప్రకృతి ఉన్న ఈ ప్రాంతం లో ప్రయాణిస్తుంటే పచ్చందనమే పచ్చదనమే అని పాడుకోవాలనిపించక మానదు. ఈ ప్రాంతానికి చేరువలో ఉన్న వాయి గ్రామం లో కృష్ణానదిపై కట్టిన ధూం డ్యాం పరిసరాల్లో బోటింగ్ ప్రత్యేక ఆక్ర్షణ.సిడ్నీ పాయింట్, పార్సీ పాయింట్ వంటి చూడ చక్కని ప్రదేశాలతో పాటు పంచగని బస్ స్టాండ్ కి 2 కి.మీ దూరం లో ఉన్న శిఖరం చూసి తీరాల్సిందే! ఇక భిలార్ జలపాతం, ముఖ్యంగా వర్షాకాలం లో తన దూకుడు తో కనువిందు చేస్తుంది. సాహసమే నా ఊపిరి అంటు సాగేవారికోసం గుర్రపు స్వారీ, పారా సైలింగ్ వంటి ఆకర్షణలూ ఈ ప్రాంతం ప్రత్యేకతలు.

ప్రకృతి ని ప్రేమించేవారు, ఆ పచ్చటి ఒడి లో సేద తీరాలనుకునే వారు తప్పక చూడాల్సిన ప్రదేశం షేర్ బాగ్. అందంగా తీర్చిదిద్దబడిన పచ్చిక బయళ్ళు, పిల్లల పార్క్, కొంగలు, టర్కీ కొళ్ళు వంటి రకరకాల పక్షుల, కుందేళ్ళ ఆవాసాలు తప్పక చూడండి. మరిన్ని చారిత్రక ప్రదేశాలు, అలనాటి ఆనవాళ్ళుగా ఉన్న వివిధ దేవాలయాలు, కొండ గుహల తోపాటు రాక్షస వంటిల్లు గా పిలవబడే భీమ్ చౌలా, హారిసన్ వ్యాలీ ని సందర్శించడం మరువద్దు.రా రమ్మని ఆహ్వానించే ప్రదేశం, పంచగని

పంచగని లో  బ్రిటీష్ కాలం నాటి పలు కాటెజీ లు అద్దెకు లభిస్తాయి. నిత్యం రద్దీగా, రణగొణ ధ్వనులతో నిండిన కాలుష్యపు పరిసరాలనుంచి దూరంగా వచ్చి ఆహ్లాదకర వాతావరనాన్ని ఆస్వాదించాలనుకునే వారికిదో మంచి వారాంతపు పిక్నిక్ స్పాట్. ఇక్కడి బ్రిటీష్ కాలం నాటి కట్టడాలు, ముఖ్యంగా పార్సీ ఇళ్ళు చూసి తీరాల్సిందే!

పంచగని కాలుష్యపు కోరలకు దూరంగా ఉన్న పచ్చటి ప్రకృతితో అలరాడే ప్రదేశం. ఇక్కడి వాతావరణం మనస్సుని ఆహ్లాదపరచడమే కాక ఏమైనా అస్వస్థతకు గురైన వారికి స్వాంతన చేకూర్చి వారిని త్వరగా కోలుకునేలా చేస్తుంది. ట్యూబర్క్యులోసిస్ వంటి వ్యాధుల బారి పడినవారు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం లో త్వరగా కోలుకోవచ్చు.

పంచగని కి వెళ్ళే దారి ఎంతో అందంగా ఉంటుంది.ముంబై నుంచి బయలుదేరినట్టయితే 285 కి. మీ. దూరాన్ని ముంబై పూణె ఎక్స్ప్రెస్ వే లో పంచగని చేరుకోవచ్చు. ఒక వేళ గోవా రోడ్ లో వస్తే పొల్ హత్ పూర్ దగ్గిర లెఫ్ట్ టర్న్ తర్వాత కొండ దారి గుండా ప్రయాణిస్తూ పోతే మొదటగా మీరు మహా బలేశ్వర్ చేరుకుంటారు. పంచగని కి వెళ్ళేదారి కొండ దిగువగా సతారా వెళ్ళే దారిలో ఉంటుంది. మీరు ఒక పెద్ద బృందంగా కనుక వెళ్ళేట్లయితే పంచగని-మహాబలెశ్వర్ రోడ్ మీద అంజుమన్ ఎ ఇస్లాం స్కూల్ కి ఎదురుగా ఉండే బంగళా ల్లో ఒకదానిని బుక్ చేసుకుంటే బావుంటుంది.

పంచగని ని చూడాలనుకుంటే వర్ష ఋతువు తగ్గుముఖం పట్టాకా అంటే సెప్టెంబర్ నుంచీ మే వరకు అనువైన కాలం. చలికాలం లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉంటాయి. ఎండాకాలమూ చల్లగా ఉంటుంది. పంచగని ని సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు. వర్షాకాలం లో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కూడా చిత్తడి నేల, చుట్టూ పచ్చటి ప్రకృతి ని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తూనే ఉంటారు.

పంచగని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పంచగని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పంచగని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పంచగని

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ముంబై, పూణె ల నుంచి పంచగని కి ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూపర్ ఫాస్ట్, లక్జరీ, స్లీపర్ మొదలైన బస్సులను నడుపుతోంది. బస్సు టిక్కట్టు ధర బస్సును బట్టి సుమారు గా 300 రూపాయలు ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పంచగని కి దగ్గరలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ పూణె. ఇది 100 కి . మీ . దూరం లో ఉంది. దేశం లోని అన్ని ప్రధాన ప్రాంతాలకు పుణె నుంచి రైళ్ళ సౌకర్యం ఉంది. బెంగుళూరు, చెన్నయ్, హైదరాబాదు, ముంబై, వంటి పట్టణాలన్నిటి నుంచీ పూనె కు రైళ్ళు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం పంచగని కి సమీపం లో ఉన్న ఎయిర్ పోర్ట్ పూణె ఎయిర్ పోర్ట్. పూణె ఎయిర్ పోర్ట్ నుంచి ట్యాక్సీ లో పంచగని చేరుకోవాలంటే 110 కి. మీ. దూరం
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat