Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాన్గోంగ్ » వాతావరణం

పాన్గోంగ్ వాతావరణం

సందర్శించటానికి తగిన సమయం: ప్రయాణికులు మే మరియు సెప్టెంబర్ మధ్య వేసవి కాలంలో పాన్గోంగ్ సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. ఆ కాలంలో ఉష్ణోగ్రత సమతుల్యం గా ఉంటుంది. పాన్గోంగ్ కి ఈ సమయంలో వలస పక్షులు కూడా వొస్తాయి.ఈ కాలంలో పాన్గోంగ్ కి వసంత కాలం వోచ్చినట్లుగా చాల ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు చాల ఉల్లాసంగా ప్రక్రుతి సౌందర్యాన్ని ఆనందించ వొచ్చు.

వేసవి

పాన్గోంగ్ ను చూడటానికి వేసవికాలం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు సమంగా ఉండటంవలన పర్యాటకులు ఈ ప్రదేశాన్ని బాగా చూడగలుగుతారు.వేసవికాలం (మే నుండి సెప్టెంబర్): ఇక్కడ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చేరుతుంది.ఇక్కడ వేసవిలో అత్యల్ప ఉష్ణోగ్రత 5 డిగ్రీ సెంటిగ్రేడ్ గ నమోదు అయింది. ఈ స్థలం ప్రక్రుతి సౌందర్యాన్ని సందర్శించాలంటే ఈ కాలమే అనుకూలంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం(జూలై నుండి సెప్టెంబర్): పాన్గోంగ్ ఈ సమయంలో చిన్న చిన్న చిరుజల్లులతో ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ సగటున 15 సెం. మీ. వర్షపాతం కురుస్తుంది. పర్యాటకులు ఈ సమయంలో కూడా ఈ స్థలాన్ని సందర్శించవొచ్చు.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫెబ్రవరి): ఇక్కడ శీతాకాలం అక్టోబర్ నుండి ఫెబ్రవరి వరకు ఉంటుంది. పర్యాటకులకు పాన్గోంగ్ ను సందర్శించటానికి ఇది తగిన సమయం కాదు. ఎందుకంటే ఇక్కడ చలి చాల ఎక్కువగా ఉండి, ఈ సరస్సు గడ్డ కట్టి ఉంటుంది. ఇక్కడ దారులన్నిటిని మూసివేస్తారు. ఈ కాలం లో ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు అత్యల్ప ఉష్ణోగ్రత -14 డిగ్రీల సెంటిగ్రేడ్ గా నమోదు అవుతుంది.