సందర్శనకు మంచి సమయంపర్భాని సందర్శనకు సంవత్సరంలో చాలాభాగం అనుకూలంగానే ఉంటుంది. కనుక ఎల్లపుడూ పర్యాటకులు వస్తూనే ఉంటారు. వర్షాకాలం మరియు శీతాకాలం పర్యాటకులకు అనువైన సమయాలు.
వేసవి మార్చి నుండి మే వరకు పర్భాని లో కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగాను గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీగ్రేడు గాను మారతాయి. మే నెల చాలా వేడి కనుక ఈ సమయంలో పర్భాని సందర్శన సూచించదగినది కాదు.
వర్షాకాలం వర్షాలు ఈ ప్రాంతంలో అధికంగా పడతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలం. నైరుతి రుతుపవనాల కారణంగా ప్రత్యేకించి జూలై మరియు ఆగస్టు నెలలలో వర్షాలు అధికం. అక్టోబర్, నవంబర్ నెలలు కొద్దిపాటి జల్లులతో ఆహ్లాదంగా ఉంటాయి. ఈ సమయంలో పర్యటన ఆనందంగా ఉంటుంది.
శీతాకాలం పర్భానిలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనీసం 15 డిగ్రీలు గరిష్టం 30 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి. డిసెంబర్ నెలలో చలి అధికంగా ఉంటుంది.