వాయుమార్గం
పాటియాలాకు 60 కిలోమీటర్ల దూరంలో వున్న చండీఘర్ ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. విమానాశ్రయం నుంచి పాటియాలా చేరుకోవడానికి టాక్సీలు తేలిగ్గానే దొరుకుతాయి. ఇక్కడినుంచి డిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతాయి.