పాటియాలా సందర్శన కు ఉత్తమ సమయం పాటియాలా సందర్శనకు అక్టోబర్ నుంచి మార్చి వరకు మంచి సమయం. వాతావరణం చాలా ఆహ్లాదకరం గా వుండి స్థల సందర్శనకు, బయట తిరగడానికి అనువుగా వుంటుంది.
వేసవి (మార్చ్ నుంచి జూన్) : పాటియాలా లో మార్చ్ లో మొదలయ్యే వేసవి జూన్ దాకా నడుస్తుంది. మే చాలా వేడిగా వుండే నెల, అప్పుడు ఇక్కడ పగటి ఉష్ణోగ్రత దాదాపు 43 డిగ్రీల సెల్షియస్ దాకా వుండి, రాత్రి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు వుంటుంది. తీవ్ర ఉష్నోగ్రతల వల్ల పాటియాలా సందర్శనకు, స్థల సందర్శనకు వేసవి అనుకూలం కాదు.
వర్షాకాలం (జూలై నుంచి అక్టోబర్): వర్షాకాలం జూలై లో మొదలై అక్టోబర్ దాకా వుంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా వుండడం వల్ల ప్రజలకు చాలా హాయి అనిపిస్తుంది. ఈ సమయంలో భారీగా వర్షాలు పడవచ్చు కనుక ఒక గొడుగో, రెయిన్ కోటో తీసుకువెళ్ళడం మంచిది
శీతాకాలం (అక్టోబర్ నుంచి ఫిబ్రవరి) : అక్టోబర్ లో మొదలయ్యే శీతాకాలం ఫిబ్రవరి దాకా వుంటుంది. ఈ సమయంలో ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు వుండగా, కనిష్టంగా 5 డిగ్రీలు వుంటుంది. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుండి, పర్యాటకుల రద్దీని పెంచుతుంది.