Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పట్నితోప్ » వాతావరణం

పట్నితోప్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలంపట్నితోప్ ఏడాది పొడవునా సందర్శించగలిగే ఒక ఆదర్శ పర్యాటక ప్రదేశం. అయితే, పర్యాటకులు వేసవి లో మే, జూన్ నెలలలో లేదా వర్షాకాలం ఆస్వాదించడానికి జూలై, సెప్టెంబరు మధ్య కాలంలో సందర్శించవచ్చు. సాహస క్రీడల పట్ల ఆసక్తి గల పర్యాటకులు శీతాకాలంలో, డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్య, పట్నితోప్ సందర్శించవచ్చు.

వేసవి

పర్వత పట్టణం పట్నితోప్, ప్రధానంగా తేలికపాటి వేసవి మరియు చల్లని శీతాకాలంతో సమశీతోష్ణ వాతావరణం కలిగి ఉంటుంది.వేసవి కాలం (మార్చి నుండి జూన్): సంవత్సరంలోని ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు నమోదు అయినప్పటికీ, సగటు ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య ఉంటుంది. వేసవిలో పట్నితోప్ సందర్శించడానికి ఉత్తమ నెలలు మే మరియు జూన్.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి అక్టోబరు): పట్నితోప్ లో వర్షాకాలాలు కఠినంగా కాక, మధ్యస్తంగా ఉంటాయి. పర్యాటకులు ఈ కాలంలో, జూలై, ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలల్లో పట్నితోప్ పర్యటించవచ్చు.

చలికాలం

శీతాకాలం (నవంబరు నుంచి ఫిబ్రవరి): పట్నితోప్ 0 డిగ్రీల 10 డిగ్రీల మధ్య సగటు ఉష్ణోగ్రతతో, చాలా చల్లని మరియు మంచుతో కూడిన శీతాకాలాలు అనుభవిస్తుంది. పర్యాటకులు స్కీయింగ్ కోసం డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెలల మధ్య కాలంలో సందర్శించవచ్చు.