పట్టడకాల్ వాతావరణం పట్టడకాల్ సందర్శనకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది.
వేసవి (మార్చి నుండి మే) - పట్టడకాల్ ప్రాంతంలో వేసవి అతి తక్కువ కాలంగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు గరిష్టం 40 మరియు కనిష్టం 22 డిగ్రీలుగా ఉంటాయి.
వర్షాకాలం (మే నుండి అక్టోబర్) - వర్షాకాలంలో పట్టడక్కాల్ అత్యధిక వర్షాలు పొందుతుంది. రాత్రులందు అతి చల్లగా ఉంటుంది.
శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో పట్టడకాల్ వాతావరణం ఆనందించదగినదిగా, చల్లగా ఉంటుంది. ఈ సమయంలో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగాను పగటిలో గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగాను ఉండి పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.