Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పోచంపల్లి » వాతావరణం

పోచంపల్లి వాతావరణం

అత్యుత్తమ కాలం:పోచంపల్లిని సందర్శించడానికి అక్టోబర్ ఫిబ్రవరిల మధ్య కాలం అత్యుత్తమం. ఉష్ణోగ్రతలు తగ్గటం చేత ఎండ వల్ల మీరు అలసి పోయే పరిస్థితి ఉండదు. శీతాకాలపు సాయంత్రాలు కొంచెం చల్లగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి జాకెట్ లేదా శాలువ ధరించటం మంచిది.

వేసవి

వేసవి కాలం:పోచంపల్లి లోని వేసవులు చాలా వేడిగా ఉంటాయి. విపరీతమైన పొడిగా, తేమగా ఉంటాయి. మార్చి నెలలో మొదలయ్యే వేసవి జూన్ చివరి దాకా కొనసాగుతుంది. వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాకా చేరుకుంటాయి. ఈ పట్టణాన్ని వేసవిలో సందర్శించక పోవటమే మంచిది.

వర్షాకాలం

వర్షా కాలం:జూలై లో మొదలయ్యి వర్షా కాలం ఆగష్టు, సెప్టెంబర్ ల దాకా కొనసాగుతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నా, వర్షాలు సూర్యుని విపరీత వేడిమి నుంచి ఆశించిన ఉపశమనం మాత్రం కలిగించలేవు. ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుంది. వర్షా కాలం లో తేమ స్థాయి పెరుగుతుంది.

చలికాలం

శీతాకాలం:ఉత్తర భారత దేశంలో ఉన్నంత చల్లగా ఇక్కడ శీతాకాలం ఉండదు. సాధారణంగా చలికాలం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఉంటుంది. జనవరి అత్యంత చల్లని మాసం. అయితే ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ కు తగ్గవు. శీతాకాలం చల్లగా ఉండదు గానీ, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయాలు, మధ్యాహ్నాలు యాత్రికులు ఎండకు బెదరకుండా బయట తిరగడానికి అనువుగా ఉంటాయి.