Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పాండిచేరి

పాండిచేరి – వలస వైభవ౦ గల నగరం !

42

2006 నుండి అధికారికంగా పుదుచెర్రిగా పిలుస్తున్న పాండిచేరి, అదే పేరుతో ఉన్నకేంద్ర పాలిత ప్రాంత రాజధాని. ఈ నగరం, కేంద్ర పాలిత ప్రాంతం రెండు కూడా  ఫ్రెంచి వలస సామ్రాజ్యం ఎంతో దోహద పడడం వలన వారసత్వంగా పొందిన ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వ సంపదను కల్గి ఉన్నాయి. పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతం భారత దేశంలోని మూడు రాష్ట్రాలలో వ్యాపించిన తీరప్రాంత రాష్ట్రాలతో ఏర్పడింది: యానాం (ఆంధ్రప్రదేశ్ లో), పాండిచేరి నగరం, కరైకల్ ( రెండూ తమిళనాడు తూర్పు తీర ప్రాంతంలోనివి), మహే (కేరళలోని పశ్చిమ కనుమలలో ఉంది).

బంగాళాఖాతంలోని కోరమాండల్ తీరప్రాంతంలో ఉన్న పాండిచేరి నగరం చెన్నై నుండి 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఫ్రెంచి పాలన లో ఉండటమే కాక 1674 నుండి 1954 వరకు ఫ్రెంచి వలసల ప్రధాన రాజ్యమైంది.  ఫ్రెంచి వారు పాండిచేరిలో మూడు శతాబ్దాల కాలం వరకు ఆటంకంలేని పాలనను అందించి, ఉత్తమ సంస్కృతి, నిర్మాణశైలులు ప్రతిబింబించే ఒక గొప్ప వారసత్వాన్ని ఈ నగరానికి మిగిల్చారు.పరిమళాలు, సుగంధద్రవ్యాలతో వంటి దర్శనీయ స్థలాల కలగూరగంప –

పాండిచేరిలోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణీకునికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఈ నగరంలో విరామ సమయ౦ నష్టం కాని అనుభూతిని కల్గించి సందర్శకులలో శక్తిని నింపే ప్రోమనేడ్ బీచ్, పారడైస్ బీచ్, సేరెనిటి బీచ్, ఆరొవిల్లె బీచ్ వంటి నాలుగు చక్కటి తీరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని మరొక ముఖ్య ఆకర్షణ శ్రీ అరబిందో ఆశ్రమం, భారతదేశంలోని ఉత్తమ ఆశ్రమమే కాక , ధ్యాన కేంద్రాలలో ఒకటి.సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం, తన ప్రత్యేక సంస్కృతి, వారసత్వ కట్టడాలు, నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం,  మాతృమందిర్, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం, గౌబెర్ట్ అవెన్యూలో ఉన్న జోన్ ఆఫ్ ఆర్క్ పాలరాయి విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు, విగ్రహాలకు పాండిచేరి నివాస స్థలం. పాండిచేరి మ్యూజియం, జవహర్ టాయ్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఒస్టేరి మాగాణులు, భారతిదాసన్ మ్యూజియం, నేషనల్ పార్కు, అరికమేడు, డుప్లెక్స్ విగ్రహం, రాయ్ నివాస్

ఈ నగరంలోని ఒకసారి సందర్శించదగిన ఇతర ఆకర్షణలు.  ఈ నగరం చర్చీలు, హిందూ ఆలయాల వంటి  ధార్మిక ప్రదేశాలతో కూడిన ఆసక్తికరమైన ఒక సమ్మేళనం. ది ఎగ్లిసే డి నోత్రే డామే డెస్ అంజేస్ ( ది చర్చ్ ఆఫ్ అవర్ లేడి ఆఫ్ అంజేల్స్ అని కూడా అంటారు), ది చర్చ్ ఆఫ్ సాక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్, ది కథేడ్రల్ ఆఫ్ అవర్ లేడి ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, శ్రీ మనకుల వినయగర్ ఆలయం, వరదరాజ పెరుమాళ్ ఆలయం, కన్నిగా పరమేశ్వరి ఆలయం పాండిచేరిలో తరచూ సందర్శించే ధార్మిక ప్రాంతాలు

ప్రత్యేక నిర్మాణ శైలులు ఉన్న నగరం సముద్రంతో, ప్రత్యేక నిర్మాణ శైలితో దీవించబడిన పాండిచేరి నగరం కాలి నడకన తిరిగినప్పుడు మనసుకు ఒక అద్భుతమైన అనుభవాన్ని కల్గిస్తుంది. ఒక చట్ర౦ నమూనాలో నిర్మించబడిన ఈ నగరం దానిపై గణనీయస్థాయిలో గల ఫ్రెంచి ప్రభావానికి ఎంతగానో పేరొందింది. ఈ నగరంలోని అనేక వీధులకు ఫ్రెంచి పేర్లు ఉన్నాయి, వలస నిర్మాణశైలిలో నిర్మించబడిన వైభవమైన ఇళ్ళు అలాగే భవంతులు కూడా సందర్శకులకు అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంటాయి.

ఈ నగరం ఫ్రెంచి క్వార్టర్, (వైట్ టౌన్ లేదా విల్లె బ్లాంచి అని కూడా అంటారు), ది ఇండియన్ క్వార్టర్ (బ్లాక్ టౌన్ లేదా విల్లె నోయిర్) అనే  రెండు భాగాలుగా విడదీయబడింది. వలస నిర్మాణ శైలితో నిర్మించిన కట్టడాలు మొదటి భాగ లక్షణం కాగా, రెండవది పురాతన తమిళ శైలి, నమూనాలతో నిండి ఉంది. ఈ రెండు ప్రత్యేక శైలుల సమ్మేళనం పాండిచేరి నగరానికి ఒక చక్కదనాన్ని, విలక్షణతను ఇస్తున్నాయి.అద్భుతమైన వంటకాలు

ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. పర్యాటకులు  ఫ్రెంచి బగేట్స్, బ్రియోచేస్, పేస్ట్రీలు వంటి అసలైన ఫ్రెంచి వంటకాలతో బాటుగా సంప్రదాయ తమిళ, కేరళ వంటకాలను కూడా రుచి చూడవచ్చు. లి క్లబ్, బ్లూ డ్రాగన్, స్టాట్ సంగ, రెండేజ్వాస్, సీ గల్స్, లే కెఫే, లా కోరోమండలే, లా టేరస్సె శ్రేష్ఠమైన భోజన అనుభవం కోసం సిఫార్సు చేసిన కొన్ని స్థలాలు.

ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి. హస్తకళలు, వస్త్రాలు, రాళ్ళు, చెక్క శిల్పాలు, చాపలు, కుండలు, పరిమళాలు, అగరులు, అద్దపు పనులు, దీపాలు, కొవ్వతులు నగరంలో షికారు చేసే వారికి ఒక అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని ఇస్తాయి. డిసెంబర్ లో జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవం, ఆగష్టు లో జరిగే ఫ్రెంచి ఆహార ఉత్సవం, జనవరిలో జరిగే షాపింగ్ ఉత్సవం ఇక్కడ తరుచుగా జరిగే ఉత్సవాలలో కొన్ని.

పాండిచేరి చేరడం ఎలా పాండిచేరి నగరానికి చక్కటి రైలు, రోడ్డు సదుపాయం ఉంది. ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్గి ఉండి ఏడాది పొడవునా విశ్వ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

పాండిచేరి సందర్శనకు ఉత్తమ సమయం ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణాలతో, అద్భుతమైన వివిధ రుచులతో, విస్తారమైన పరిధిలో ఉన్న చూడచక్కని ప్రదేశాలతో పాండిచేరి పర్యాటకులకు ఒక వాస్తవమైన విభిన్న ప్రయాణ అనుభూతిని కల్గిస్తుంది.

 

పాండిచేరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పాండిచేరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పాండిచేరి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పాండిచేరి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా పాండిచేరికు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి చక్కటి రోడ్డుమార్గం ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరు, చెన్నై, మదురై వంటి వివిధ ప్రాంతాల నుండి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. పాండిచేరికి బెంగుళూరు నుండి కూడా బస్సులు ఉంటాయి. బస్సు ధరలు 50 నుండి 500 వరకు ఉంటాయి. స్థానికి బస్సులలో కిలోమీటర్ కు 3 లేదా 4 రూపాయలు ధర ఉంటుంది. పాండిచేరి రావడానికి, ఇక్కడ పరిసరాలలో తిరగడానికి బస్సులు మేలైన ఎంపిక.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా ఒక ప్రముఖ కేంద్ర పాలిత ప్రాంతమైనందున పాండిచేరిలో రైలు స్టేషన్ ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్ళు పాండిచేరి లో ఆగుతాయి. పాండిచేరి వరకు రైలులో రావడం కూడా ఒక ఆచరణయోగ్య విషయమే.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా పాండిచేరికు అతి దగ్గరి విమానాశ్రయం చెన్నై. ఇక్కడి నుండి రోజువారీ దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఉండటమే కాక పాండిచేరి నుండి కేవలం 147 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైకు విమానాలలో వెళ్ళడం సులువుగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat