Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పొన్నాని » వాతావరణం

పొన్నాని వాతావరణం

ఉత్తమ సీజన్ పొన్నాని ప్రాంత పర్యటనకు వేసవి లేదా వర్షాకాలం సూచించ దగినది కాదు. ఓనం పండుగ సీజన్లో అయిన ఆగష్టు నుండి సెప్టెంబర్ వరకు సరైనది. ఈ సమయం లో బోటు రేస్ లు కూడా చూడవచ్చు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకూ కూడా పర్యటించవచ్చు.

వేసవి

వేసవి ఇతర సౌత్ ఇండియన్ పట్టనాలవలేనే పొన్నాని కూడా ఉష్ణమండల వాతావరణం కలిగి తేమ అధికంగా ఉండే ప్రదేశం. వేసి మార్చ్ లో మొదలై, మే నెల వరకు కొనసాగుతుంది. వేసవి లో ఉష్నోగ్రతలు 32 డిగ్రీల నుండి 38 డిగ్రీల వరకు మారుతూంటాయి. పర్యాటకులు కాటన్ దుస్తులు ధరించటం మంచింది.

వర్షాకాలం

వర్షాకాలం కేరళ లోని తీర ప్రాంతాల లో వలెనె పొన్నాని లో కూడా వర్షాలు అధికం. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ చివరి వరకూ ఉంటుంది. ఈ సమయంలో పర్యటన కష్ట్రమవుతుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం లో పొన్నాని పట్టాన పర్యటన ఆహ్లాదకరంగా ఉంటుంది. చలి కాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి నెల చివరి వరకూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 24 డిగ్రీల నుండి 32 డిగ్రీల వరకూ కొనసాగుతాయి.