రాస్ ద్వీపం, పోర్ట్ బ్లెయిర్

పోర్ట్ బ్లెయిర్ కు 2 కి.మీ.ల దూరంలో బహుశ కొందరు కొన్ని శిధిలాలు చూసే వుంటారు. రాస్ ఐలండ్ దీవి ఎన్నో యుగాలనుండి శిధిలాలకు నిలయంగా ఉంది. బ్రిటీష్ వారు ఇండియాకు వచ్చినప్పటినుండి భారత స్వాతంత్ర పోరాటం వరకు రాస్ ఐలండ్ లో అనేక చారిత్రక భవనాలు కలవు. రాస్ ఐలండ్ ప్రతి చరిత్ర కారుడికి అవసరమైన సమాచారం ఇచ్చే భవనాలు కలిగి ఉంది.

 

రాస్ ఐలండ్ ను పోర్ట్ బ్లెయిర్ నుండి బోటు ప్రయాణంలో లేదా దీవిలో కల ఫొయనిక్స్ జెట్టీ ద్వారా కూడా చేరవచ్చు. ఈ ఐలండ్ పూర్తిగా భారత నౌకాదళంచే నియంత్రించబడుతోంది.. పర్యాటకులందరూ ప్రవేశంలో లేదా బయటకు వచ్చేటపుడు వారి రికార్డులలో సంతకాలు చేయాల్సి ఉంటుంది.

1857 సంవత్సరంలో మొట్ట మొదటి స్వాతంత్ర సమరం వచ్చినపుడు బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్ర సమర పోరాట యోధులకు కఠినమైన శిక్షలను అమలు చేసే ఏర్పాట్లు ఇక్కడ చేసింది. ఈ విధానం సుమారు 80 సంవత్సరాలపాటు సాగింది. తర్వాతి రోజులలో ఈ దీవిలో ఒక హాస్పిటల్, బేకరీ, దుకాణాలు, టెన్నిస్ కోర్టులు, నివాస వసతులు మరియు ఇతర సౌకర్యాలవంటివి ఏర్పడ్డాయి.

అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో దీనిపై జపాన్ దేశం దాడి చేయటం వలన ఈ భవనాలన్నీ శిధిలాలుగా మారిపోయాయి. రాస్ ఐలండ్ పక్కనే కల జంట దీవి అయిన స్మిత్ దీవి కూడా పర్యాటకులు తప్పక చూడదగినదే.

 

 

 

Please Wait while comments are loading...