వైపర్ దీవి, పోర్ట్ బ్లెయిర్

వైపర్ దీవి జైలుకు ప్రసిద్ధి గాంచినది. ఈ దీవి పోర్ట్ బ్లెయిర్ కు వాయువ్యంగా 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బోటు లేదా ఫెర్రీలో ఈ దీవి చేరాలి. ఈ దీవి పేరు గురించి రెండు కధలు చెపుతారు. ఒక కధనం మేరకు ఈ ద్వీపం పేరు ఒక ఓడ పేరు మీదుగా పెట్టారని చెపుతారు. 1789 సంవత్సరంలో ఈ ఓడ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ ను ఈ దీవికి తీసుకు వచ్చింది కనుక దాని పేరు పెట్టారని చెపుతారు. రెండవ కధనం మేరకు , ఈ ప్రాంతంలో ఒళ్ళు గగుర్పొడిచే సంఖ్యలో వైపర్ పాములు ఉండటంచే వైపర్ దీవి అని పేరు వచ్చిందంటారు.

భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులలోని ప్రముఖులు వారి చివరి దినాలను ఇక్కడి వైపర్ జైలులో గడిపారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పడగొట్టటానికి ప్రయత్నించిన వారిని ఈ జైలు గదులలో, మహారాజులు మరియు సామాన్యులు ఎవరైనా సరే ఒకే రకంగా హింసించేవారట. నేటికి ఈ జైలు అవశేషాలు పర్యాటకులు చూడవచ్చు. ఇంతేకాక, వైపర్ దీవి అద్భుత విహార ప్రదేశం.

ఈ ద్వీపాన్ని ఫొయనిక్స్ బే జెట్టీ ద్వారా 20 నిమిషాలలో చేరవచ్చు. కొన్ని ట్రావెల్ సంస్ధలు దీవి చుట్టూ టూరిస్టులను తిప్పటం బోటు నుండే జైలును ఇతర ప్రదేశాలను చూపటం కూడా చేస్తున్నాయి.

 

 

 

 

 

 

 

Please Wait while comments are loading...