Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూణే » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా : పెద్ద నగరం కావడం వల్ల పూణే కి మహారాష్ట్ర లోను, ఇతర రాష్ట్రాల లోను వున్న ప్రధాన నగరాల నుంచి బస్సు సర్వీసులు వున్నాయి. ముంబై – పూణే రహదారి ప్రయాణించడానికి చాల సౌకర్యం గా వుంటుంది, రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని ఈ రహదారి రెండు గంటలు తగ్గిస్తుంది. రాష్ట్రం లో నుంచి బయటి నుంచి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు అన్ని ప్రధాన నగరాలకు వున్నాయి. పూణే వెళ్ళే దారిలో వుండే పశ్చిమాద్రి కనుమలు వర్షాకాలం లో ఓ అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తాయి.