Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాజగిర్

రాజగిర్ – సంస్కృతి, చరిత్రల కాలాతీత ప్రణయం !!  

29

భారత దేశంలోని బీహార్ లో మగధ వంశీయుల రాజధాని రాజగిర్ రాచరికానికి పుట్టిల్లు. రాజగిర్ ను పాట్నాకు భక్తిపూర్ వివిధ రవాణా మార్గాల ద్వారా కలుపుతుంది.

ఒక లోయలో నెలకొన్న రాజగిర్ అందాలు పర్యాటకులను సూదంటురాయిలా ఆకర్షిస్తాయి. ఈ లోయ పైన మంత్రముగ్ధుల్ని చేసే కొండలు వున్నాయి. బుద్ధుడికి, బౌద్ధానికి సంబంధించిన అసంఖ్యాకమైన కథలులు రాజగిర్ నగరంతో పెనవేసుకున్నాయి.

రాజగిర్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు

రాజగిర్ లో పర్యాటకుల జ్ఞానాన్ని పెంపొందించి, ఆశ్చర్య పరిచే చాలా నిర్మాణాలు, ప్రదేశాలు వున్నాయి. అజాత శత్రు కోట, జీవకమేవన్ తోటలు, స్వర్ణ భండారం లాంటివి ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

రాజగిర్ పర్యాటకంలో ప్రధాన ఆకర్షణ బ్రహ్మకుండ్. అద్భుతమైన ఔషధ విలువలున్న వేడి నీటి బుగ్గలను బ్రహ్మకుండ్ గా పిలుస్తారు – ఇవి అసంఖ్యాకమైన పర్యాటకులను ఆకర్షిస్తాయి. జైన్లు, బౌద్ధులు తమ మత స్థాపకులైన మహావీరుడు, గౌతమ బుద్ధుడు తమ జీవితాలలోని ప్రధాన భాగాలను ఇక్కడ గడిపారు కనుక ఈ నగరాన్ని చాలా ప్రేమిస్తారు.

రాజగిర్ అంటే ‘రాజ గృహం’, అంటే రాజు గారిల్లు అని అర్ధం. ఇది జరాసంధ చక్రవర్తి గురించి, అతడు పాండవులతో చేసిన యుద్ధం గురించి తెలియచేస్తుంది. రాజగిర్ గౌతమ బుద్ధుడు, మహావీరుడి ప్రయాణాలకు సాక్షిగా కూడా వుంది.

బౌద్ధ, జైన మతాల అభివృద్దిలో ప్రధాన అన్కాలకు రాజగిర్ పర్యాటకం ఒక పట్టిక లాంటిది. మొదటి సారిగా జరిగిన బౌద్ధ మండలి సమావేశానికి రాజగిర్ లోని సప్తపర్ణి గుహలు వేదికగా నిలిచాయి. బౌద్ధం వ్యాప్తి, ప్రఖ్యాతి రాజగిర్ బౌద్ధుల కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. రాజగిరి పర్యాటకం మొత్తం బౌద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒక ప్రధాన అంతర్భాగం కావడంతో ఇతర బౌద్ద కేంద్రాలకు కూడా బాగా అనుసంధానం చేయబడి వుంది. మరో ప్రముఖ బౌద్ధ క్షేత్రం నలంద కు రాజగిర్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వుంది.

రాజగిర్ లో పండుగలు, ఉత్సవాలు

రాజగిర్ నృత్య మహోత్సవం రాజగిర్ లో ప్రధానంగా జరుపుకునే ఉత్సవం – ఇందులో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని భక్తీ గీతాలు, వాద్య సంగీతం, జానపద నృత్యాలు, నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు చేస్తారు. పుష్య మాసం చివరిలో, జనవరి 14 న జరిగే మకర సంక్రాంతి ఉత్సవం నాడు ప్రజలు పవిత్ర నదిలో స్నానం చేసి మిఠాయిలు పంచుకుంటారు. మూడేళ్ళ కొకసారి ఉత్సాహంగా జరుపుకునే మరో పండుగ మలమాస మేకా.

రాజగిర్ వాతావరణం

వేసవులు వెచ్చగా వుండి, శీతాకాలాలు ఓ మాదిరి చల్లగా వుంటాయి, కనుక రాజగిర్ సందర్శనకు అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో అనువైన కాలం.

రాజగిర్ ఎలా చేరుకోవాలి

రాజగిర్ కు ఒక రైల్వే స్టేషన్ వుంది గానీ, స్వంత విమానాశ్రయం లేదు కనుక ఇక్కడికి వెళ్ళాలంటే ముందే సిద్ధం కావాలి. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా ఆధార పడ దగ్గదే.

రాజగిర్ పర్యాటకం గొప్ప విశ్రా౦తినిచ్చే పర్యాటక కేంద్రం. రాజగిర్ నగరం ఒక ప్రత్యేకమైన అలౌకికమైన ఆకర్షణ కలిగి ఆధునిక పోకడల వల్ల ఇంకా చెడిపోలేదు. ధ్యానం చేసి ఆత్మాన్వేషణ చేయడానికి ఇది చక్కటి ప్రాంతం. రాజగిర్ లోని వేడి నీటి బుగ్గలు బ్రహ్మ కుండ్ వల్ల ఇక్కడి పర్యాటకం ఆరోగ్య, శీతాకాల విడిదిగా రూపొందుతోంది.

రాజగిర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాజగిర్ వాతావరణం

రాజగిర్
37oC / 99oF
 • Haze
 • Wind: WSW 15 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాజగిర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? రాజగిర్

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు : బస్సులు, టాక్సీలు, టాంగాలు సౌకర్యంగా వుండే రోడ్డు రవాణా సాధనాలు. రాజగిరి నుంచి పాట్నా 93 కిలోమీటర్లు, నలందా 12, గయ 71 కిలోమీటర్ల దూరంలో వుంటాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు : రాజగిరి నగరానికి రైల్వే స్టేషన్ వుంది గానీ, పెద్దగా రైళ్ళు నడవవు – ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో వున్న గయ పెద్ద రైల్వే స్టేషన్. రాజగిర్ కు స్వంత విమానాశ్రయం లేదు, 101 కిలోమీటర్ల దూరంలో వున్న పాట్నా నుంచి అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  రాజ్ గిర్ కు ౧౦౧ కి. మీ. ల దూరంలో కల పాట్న ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Mon
Return On
20 Aug,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Aug,Mon
Check Out
20 Aug,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Mon
Return On
20 Aug,Tue
 • Today
  Rajgir
  37 OC
  99 OF
  UV Index: 9
  Haze
 • Tomorrow
  Rajgir
  32 OC
  90 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Rajgir
  33 OC
  92 OF
  UV Index: 10
  Sunny