రామనగరం - సిల్కు బట్టలు మరియు షోలే సినిమా

రామానగరాన్ని సిల్కు సిటీ అని అంటారు. ఇది బెంగుళూరుకు నైరుతి దిశగా 58 కి.మీ.ల దూరంలో ఉంది. రామానగరం జిల్లాకు ప్రధాన నగరం. కర్నాటకలోని ఇతర ప్రాంతాలవలెనే, ఈ నగరం కూడా గంగాలు, చోళులు, హొయసలులు మరియు మైసూరు పాలకులచే  పాలించబడింది. 1970 లలో ఈ ప్రాంతంలో షోలే సినిమా షూటింగ్ జరగటంతో రామానగరం బాగా ఖ్యాతి కెక్కింది.  

రామానగరం కొండ ప్రాంతం - రామానగరంలో ఏడు పెద్ద కొండలున్నాయి. అవి శివరామగిరి, సోమగిరి, క్రిష్ణగిరి, యతిరాజగిరి, రేవణ్ణ సిద్ధేశ్వర, సిడిలకల్లు మరియు జల సిద్ధేశ్వర అని చెపుతారు. ఈ నగరంలో పట్టు పరిశ్రమ అధికంగా ఉండటంతో దీనిని సిల్క్ సిటీ అని కూడా అంటారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మైసూరు సిల్కు చీరలు రామానగరంనుండి తయారైన పట్టుతోనే తయారు చేయబడతాయి.

ఈ  కొండ ప్రాంతం పసుపు పచ్చని కంఠం గల పక్షులకు, గద్దల వంటి అరుదైన పక్షులకు నివాసం అవటం వలన  ప్రకృతి ప్రియులు ఇక్కడ పరవసిస్తారు. ఈ ప్రదేశం జానపదుల నిలయం కనుక కర్నాటకలోని జానపద కళలు, సంస్కృతి ఇక్కడ ప్రతి బింబిస్తాయి.

చుట్టూతా కొండలుండటం వలన, పర్వతారోహకులకు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ టూరిజం బాగా వ్యాప్తి చెందింది. రోడ్డు ద్వారా రామానగర పట్టణం చేరటం తేలిక. బెంగుళూరు - మైసూరు జాతీయ రహదారిపై ఉంది. ఈ రెండు నగరాలనుండి పర్యాటకులు రామానగరం చేరవచ్చు.

Please Wait while comments are loading...