Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రనధంబోర్ » వాతావరణం

రనధంబోర్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం రణధంబోర్ సందర్శనకు అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో వివిధ రకాల జంతువులు బయట తిరగడం గమనించవచ్చు. నేషనల్ పార్క్ పర్యాటకులకు అక్టోబర్ నుండి జూన్ వరకు మాత్రమే అనుమతినిస్తుంది.

వేసవి

వాతావరణం రణధంబోర్ లో సంవత్సరం పొడవునా ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది. వేసవి (మార్చి నుండి జూలై) రణధంబోర్ లో వేసవి తీవ్రత అధికం. మార్చి నుండి జూలై వరకు వేసవి కనిష్టం 23 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగాను ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ( జూలై నుండి సెప్టెంబర్) వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికి రాత్రులందు చాలావరకు చల్లబడుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) శీతాకాలం బాగా అధికమైన చలి, ప్రత్యేకించి రాత్రులందు అతి తక్కువ ఉష్ణోగ్రతలుంటాయి. సుమారు 9 డిగ్రీలవరకు కూడా పడిపోతాయి. పగలు గరిష్టం 29 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి. ఈ సమయంలో పర్యాటకులు రణధంబోర్ లోని సఫారీలు బాగా ఆనందించవచ్చు.