Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రెడి » వాతావరణం

రెడి వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం రెడి సాధారణంగా ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. సంవత్సరంలో చాలా భాగం వాతావరణం వేడి మరియు తేమగా ఉంటుంది. రెడిలో పర్యాటకులు ఆహ్లాదకరంగా విహరించాలంటే శీతాకాలం  సరైన సమయంగా ఉంటుంది.

వేసవి

రెడి వాతావరణంవేసవిఈ ప్రదేశంలో వేసవి మార్చి నెల నుండి మే నెల వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత కనిష్టం 32 డిగ్రీ సెంటీ గ్రేడ్ గరిష్టం 38 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా మార్పు చెందుతుంది. మే నెల సంవత్సరం మొత్తంలో అధిక ఉష్ణోగ్రత గల నెలగా ఉంటుంది.

వర్షాకాలం

 వర్షాకాలంరెడిలో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నాలుగు నెలలపాటు అధిక వర్షాలు పడతాయి. సాధారణంగా మేఘాలు కమ్మి ఉంటుంది. ఈ సమయంలో రెడి సందర్శన సూచించదగినది కాదు. మీ సందర్శనలో అధిక వర్షాలు ఎపుడైనా పడవచ్చు. మీకు ఆటంకం కలుగవచ్చు. వర్షాకాలం అయిన తర్వాత అక్టోబర్ మరియు నవంబర్ నెలలు సందర్శనకు అనుకూలమే.

చలికాలం

చలికాలం డిసెంబర్ నెలనుండి రెడిలో సాధారణంగా చల్లని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టం 12 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను గరిష్టం 33 డిగ్రీ సెంటీ గ్రేడ్ గాను ఉంటాయి. ఈ సీజన్ షుమారుగా ఫిబ్రవరి నెలలో అంతమవుతుంది. ఈ సమయం రెడి పర్యటనకు ఎంతో అనుకూలమైనది.