Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోహ్రు » వాతావరణం

రోహ్రు వాతావరణం

సందర్శనకు మంచి సమయం రోహ్రు సందర్శనకు మార్చ్ నుండి నవంబర్ వరకు గల సమయాన్ని సూచించవచ్చు. ఈ సమయంలో ప్రదేశం వెచ్చగా వుంటుంది. టూరిస్టులు వివిధ సాహస క్రీడలను కూడా ఆచరించవచ్చు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు గల కాలం ట్రెక్కింగ్, హైకింగ్ వంటి బయటి కార్యక్రమాలకు మాత్రం అనుకూలం కాదు.

వేసవి

రోహ్రు వాతావరణం సంవత్సరం పొడవునా అంటే ఒక్క వింటర్ తప్ప అన్ని సమయాలలో సందర్శనకు అనుమతి ఇస్తుంది. వింటర్ లో మాత్రం అధిక మంచు కురిసి ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీల కంటే తక్కువకు పడిపోతాయి వేసవి ఈ ప్రాంతం లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకు వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 14 నుండి 20 డిగ్రీల వరకు మారుతూంటాయి. ఇంతవరకు ఇక్కడ గరిష్టంగా 25 డిగ్రీలు నమోదైంది. ఈ కాలం సందర్శనకు సరైనది

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలైలో మొదలై అక్టోబర్ వరకూ వుంటుంది. వర్షాలు ఒక మోస్తరుగా పడతాయి. పర్యాటకులు వర్షాల దుస్తులు తప్పక తెచ్చుకోవాలి. ఈ కాలంలో రోహ్రి వచ్చ్చే వారు ఇక్కడి ప్రాంత పచ్చదనాన్ని తప్పక ఆనందిస్తారు.

చలికాలం

శీతాకాలం రోహ్రి లో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో కనిష్ట్ర ఉష్ణోగ్రత మైనస్ 7 డిగ్రీ ల వరకూ కూడా పడిపోయి అసౌకర్యం కలిగిస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రత ఈ సమయం లో 10 డిగ్రీలకు మించదు. చల్లని వాతావరణం ఇష్టపడేవారికి ఈ సమయ పర్యటన ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే వీరు తప్పక ఉన్ని దుస్తులు కలిగి వుండాలి