Search
  • Follow NativePlanet
Share

సేలం - సిల్కు మరియు వెండి కల భూమి

32

సేలం పట్టణం దక్షిణ భారత దేశం లోని తమిళ్ నాడులో ఉత్తర మధ్య భాగంలో కలదు. రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి ఈ పట్టణం 340కి.మీ. దూరం లో కలదు. సేలం ను మామిడి పండ్ల నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలో ఇది ఐదవ పెద్ద పట్టణం. పురపాలక సంఘం కలిగి వుంది. చేరం భూ భాగం లోనిది అవటం వలన దీనికి ఈ పేరు చేరం అనే పదం నుండి వచ్చింది. పూర్వకాలం లో ఇక్కడి ప్రజలు మహిళల చీరలను నేత చేసేవారు. సేలం నేత చీరలకు ప్రసిద్ధి.

సేలం లో ఏమి చేయాలి ?సేలం చుట్టుపట్ల ఆకర్షణలు ఏమిటి? సేలం ఒక ప్రసిద్ధ పర్యాటక మరియు యాత్రా స్థలం. పట్టణంలో అనేక మతపర ప్రదేశాలు కలవు. కొట్టాయి మరియంమన్ టెంపుల్, తారమంగళం టెంపుల్, సేలం సుగావనేశ్వరార్, అరుల్మిగా అలగిర్ నాతార్ టెంపుల్, ఎల్లి పెదరి అమ్మన్ టెంపుల్ మరియు జమ మసీద్ వంటివి వీటిలో కొన్ని. ఎర్కాడ్ హిల్స్, కిలియూర్ ఫాల్స్, తారమంగళం మరియు మెట్టూర్ డాం వంటి పర్యాటక ప్రదేశాలు సేలం పట్టణం తప్పక చూసేలా చేస్తాయి. సేలం లో షాపింగ్ ప్రసిద్ధి. ఇక్కడ కాలి వెండి పట్టాలు వివిధ డిజైన్ల లో తయారు చేస్తారు. ఇవి దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి. సేలంలో తయారు అయ్యే చీరలు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి.

సేలం చరిత్ర సేలం ను గతంలో చేరాలం అనేవారు. దీనిని చేర వంశ రాజు చేరార్నాన్ పెరుమాన్ స్థాపించారు. చేరాలం అంటే పర్వత శ్రేణి అని అర్ధం. సేలం అతి పురాతన రాతి యుగం నాటిదిగా చరిత్రకు ఆధారాలు లభించాయి. సేలంలో అనేక రాజ వంశాలు పాలించాయి. పాండ్యులు, పల్లవులు, చోజ, హోయసల, చాలుక్యలు వంటి వంశాలు వాటిలో కొన్ని. మొట్ట మొదటి వారు గంగా వంశానికి చెందిన వారు. వీరు గంగాకులం నుండి వచ్చారు. తర్వాత ఈ ప్రాంతం పశ్చిమ గంగ వంశం కిందకు వచ్చింది. తర్వాతి కాలం లో ఈ ప్రాంతం విజయనగర్ సామ్రాజ్యం దండెత్త డంతో మదురై నాయకుల కిందకు వచ్చింది. మదురై నాయకుల తర్వాత ఈ ప్రాంతం గట్టి ముదలి పోలిగార్లు పాలించారు. మైసూరు - మదురై యుద్ధం తర్వాత 18 వ శతాబ్దం లో ఈ ప్రాంతాన్ని హైదర్ ఆలి వశం చేసుకున్నాడు. 1768 లో దీనిని హైదర్ నుండి కల్నల్ వుడ్ స్వాధీనం చేసుకోగా మరో మారు దండెత్తి హైదర్ ఆలి స్వాధీనం చేసుకున్నాడు.

1799 లో దీనిని లార్డ్ క్లైవ్ ఒక మిలిటరీ కేంద్రం గా చేసి 1861 వరకూ నిర్వహించాడు. సేలం మరియు సంకగిరి ప్రాంతాలలో కొంగు రాజులు, బ్రిటిష్ వారు యుద్ధాలు చేసారు.

సేలం ఎలా చేరాలి ?

సేలంకు ఎయిర్, రోడ్, ట్రైన్ మార్గాలలో తేలికగా చేరవచ్చు. సేలంలో ఒక స్థానిక విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి చెన్నై కు విమానాలు నడుస్తాయి. చెన్నై నుండి దేశ విదేశాలకు ప్రయాణించవచ్చు. సేలం లో రైలు స్టేషన్ కలదు. సేలం నుండి చెన్నై కి రెగ్యులర్ బస్సు సర్వీస్ కలదు.

సేలం వాతావరణం

సేలంలో ఉష్ణ మండల వాతావరణం వుంటుంది. ఈ పట్టణాన్ని సందర్శించేందుకు శీతాకాలం అనువైనది. శీతాకాలం నవంబర్ నుండి మార్చ్ వరకూ వుంటుంది.

సేలం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సేలం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సేలం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సేలం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం సేలం పట్టణం నుండి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీస్ లు కలవు. బెంగుళూరు మరియు హైదరాబాద్ లకు కూడా నేరు బస్సులు కలవు. సేలం లో రెండు పెద్ద బస్సు స్టాండ్ లు అంటే ఎం జి ఆర్ ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినస్ కొత్తది కాగా, మరొకటి పాత బస్సు స్టాండ్.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ మార్గం సేలం ఒక ప్రధాన రైల్వే జంక్షన్. ఇది దేశం లోని వివిధ భాగాలకు రైళ్ళు కలిగి వుంది. సమీపంలోని తిరుచిరాపల్లి మరియు కోయంబత్తూర్ లు కూడా రైలు స్టేషన్ లు కలిగి వున్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం సేలం ఎయిర్ పోర్ట్ సేలం - బెంగుళూరు రహదారి లో కమలాపురం వద్ద సేలం కు 20 కి.మీ.ల దూరంలో కలదు. అయినప్పటికీ ప్రస్తుతం ఇది నిర్వహణ లో లేదు. సేలం ఎయిర్ లో చేరాలంటే 135 కి. మీ.ల దూరంలో కల తిరుచిరాపల్లి లేదా 15 కి.మీ.ల దూరంలో కల కోయంబత్తూర్ ల నుండి చేరాలి. సమీప ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లు చెన్నై లేదా బెంగుళూరు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri