Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సంబల్పూర్

సంబల్పూర్  – కరిగిన అనుభవాల కుండ !

35

సంబల్పూర్ చరిత్ర, ఆధునికతల మేళవింపు. ప్రస్తుతం సంబల్పూర్ గా పిలిచే భూమి అనేక మంది పాలకులు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎన్నో విభాగాలు, విలీనాలను చవిచూసింది. విభిన్న ప్రభుత్వాలు వదిలి వెళ్ళిన సాంస్కృతిక ఆనవాళ్ళ చారిత్రక అనుభవాల ఒక మిశ్రమంలా కలిసి ప్రస్తుతం ఉన్న సంబల్పూర్ స్థితికి దారితీసింది. ఓడిషా లోని పశ్చిమ అర్ధగోళ౦లో ఉన్న ఈ జిల్లా సాంస్కృతిక సంపదతో, పచ్చటి భూభాగాలతో వెచ్చని ఆతిద్యమిచ్చే ప్రజలతో స్వాగతం పలుకుతుంది.

సంబల్పూర్ – వజ్రాల వాణిజ్యం, తాజ్-ఏ- మహ్ ఉన్న భూమి,

సంబల్పూర్ లో పర్యాటకరంగ౦ ఒక కొత్త దృగ్విషయమేమి కాదు. శతాబ్దాల క్రితం సంబల్పూర్ అక్కడి వజ్రాలకు ప్రసిద్ది చెందింది. వజ్రాల వాణిజ్య మార్గంలో అది ఒక ముఖ్య కేంద్రం. మహానది లోనూ, చుట్టుపక్కల పొందిన వజ్రాలను అనేకమంది సేకరణ దారులు, ఔత్సాహికులచే ఎంతగానో ఆపేక్షించారు, ఎందుకంటే ఇవి ప్రపంచంలోని వజ్రాలలో ఉత్తమమైనవిగా (స్వచ్చత పరంగా) పరిగణిస్తారు. సంబల్పూర్ లో దొరికిన రంగులేని 146 క్యారెట్ల “తాజ్-ఏ-మహ్” (సాహిత్యపరంగా చంద్రుని కిరీటం అని అర్ధం) వజ్రం ఈ ప్రాంతంలో దొరికే వజ్రాల స్వచ్ఛతకు నిదర్శనంగా నిలిచింది.

సంబల్పూర్ – చేనేత నగరం

స్త్రీల సాంప్రదాయ వస్త్రాలు, సంబల్పూర్ చీర, ఈ ప్రాంతంలోని ప్రత్యేకత ఉన్న అందమైన సృష్టి. వస్త్రంలో టై అండ్ డై ప్రక్రియ ద్వారా క్లిష్టమైన నమూనా తయారైన తర్వాత నూలుతో కలిపి వస్త్రం తయారౌతుంది. క్లిష్టమైన ఆకృతులు, ప్రామాణికమైన సంబల్ చీరలు దాచిపెట్టుకోదగిన సంపద వంటి నిజమైన విలువును కల్గి ఉన్నాయి. ఇక్కత్ లేదా బంధకల చీరలు చరిత్ర, కళ లానే ప్రసిద్ధి చెందాయి. చీరలతో బాటుగా బంధకల వస్త్రం సల్వార్లు, డ్రస్సులు, తువ్వాలు తయారుచేయడానికి ముడి సరుకుగా లభ్యమౌతుంది. అయితే, కొనుగోలు సమయంలో నకిలీ ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించండి.

సంబల్పూర్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

సంబల్పూర్ లో పర్యటక రంగం అనేక కారణాల వలన కొనసాగుతుంది. హీరాకుడ్ ఆనకట్ట, సమలేశ్వరి ఆలయం, హుమా వాలు ఆలయం, చిపిలిమ జలవిద్యుత్ కేంద్రం, ఘంటేశ్వరి ఆలయం, మరీ ముఖ్యంగా మహానది సంబల్పూర్ పర్యాటక రంగానికి ఊతం ఇస్తున్నాయి. దేబిఘర్ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంతం లోని ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థాన౦. వైవిధ్యభరితమైన వృక్ష, జంతు జాలలతో ఇది పొడి ఆకురాల్చు అడవులకు ప్రసిద్ధి. క్యాటిల్ ద్వీపం, ఉషాకోటి, కంధర, హతిబరి, విక్రంఖోల్ సంబల్పూర్ లోని ఇతర ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ స్థలాలు.

సంబల్పూర్ చేరడం ఎలా

ప్రత్యేకమైన ప్రాంతాలు, ధ్వనులు, రుచులు, అనుభూతులు అందిస్తున్న సంబల్పూర్ ఒక పర్యాటక స్వర్గం అంటే ఆశ్చర్యం కలగదు. సంబల్పూర్ సందర్శనకు సెప్టెంబర్, మార్చి మధ్య కాలం ఉత్తమమైనది. సంబల్పూర్ కు చక్కటి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి.

సంబల్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సంబల్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సంబల్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సంబల్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా సంబల్పూర్ ప్రధాన నగరాలు బాగా చదును చేయబడిన రహదారులను కలిగిఉన్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ మెచ్చుకోతగింది. రూర్కెల-సంబల్పూర్ రహదారి పెరిగిన ట్రాఫిక్ కి వీలు కల్పించేందుకు ప్రస్తుతం నలుగు రోడ్ల నుండి ఆరు రోడ్ల రహదారికి నవీకరించబడింది. హీరాకుడ్ డాం కు దారితీసే రోడ్లు సంబల్పూర్ చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలకు దారితీసే రోడ్లవలె కొన్ని ప్రత్యేకించి అందంగా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా సంబల్పూర్ జిల్లా, ఖేత్రజ్పూర్, ఫటక్, హీరాకుడ్, సంబల్పూర్ నగరాలలో నలుగు స్తేశాన్లతో రైల్వే స్టేషన్లకు కేంద్రంగా ఉంది. సంబల్పూర్ నగర స్టేషన్ భువనేశ్వర్ – ఝార్సుగూడ లైన్ కి జక్షన్, అయితే ఇతర స్టేషన్లు ఝార్సుగూడ – బర్గర్హ రైల్ లైన్ కి జ౦క్షన్లు. అనేక నగరాలూ ఈ రైల్ లైన్ కు అనుసంధానించబడి ఉంటే, గౌహతి, లక్నో, డెహ్రాడున్, ఇండోర్ అనుసంధానించబడి లేవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా సంబల్పూర్ ఉత్తర భారతదేశంలోనే కాక, దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా బాగా అనుసంధానించబడి ఉంది. 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజు-పట్నాయక్, 262 కిలోమీటర్ల దూరంలో ఉన్న వివేకానంద సమీప విమానాశ్రయాలు. ఝార్సుగూడ లోని విమానాశ్రయం నిర్మాణంలో ఉంది, ఒడిష కూడా సంబల్పూర్ శివార్లలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri