Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » షోజా » వాతావరణం

షోజా వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం : సౌకర్యంగా వుండే వాతావరణం వల్ల వేసవి లో షోజాను సందర్శిస్తే ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

వేసవి

షోజాలో వాతావరణం ఏడాది పొడవునా సాధారణంగా వుంటుంది. వేసవిలో వాతావరణం ఇంకా బాగుంటుంది, అయితే శీతాకాలాలు విపరీతమైన చల్లగా వుంటాయి.వేసవి (ఏప్రిల్ నుంచి జూన్) : షోజా లో వేసవి కాలం ఏప్రిల్ లో మొదలై జూన్ నెల వరకు వుంటుంది. ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు,5 డిగ్రీలుగా నమోదయ్యాయి. వేసవి లో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. అందువల్ల పర్యాటకులు ఎక్కువగా వేసవిలోనే ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుంచి సెప్టెంబర్) : షోజాలో వర్షాకాలంలో ఓ మోస్తరు వానలు పడతాయి. వర్షాకాలంలో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఈ కాలంలో సైట్ సీయింగ్ కి అనుకూలంగా వుంటుంది.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుంచి ఫిబ్రవరి) : డిసెంబర్ లో మొదలయ్యే చలికాలం ఫిబ్రవరి దాకా వుంటుంది. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు కూడా పడిపోతుంది, బాగా మంచు కురుస్తుంది. శీతాకాలం లో షోజా సందర్శనకు అనుకూలంగా వుండదు.