Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» షోలాపూర్

షోలాపూర్ ఒక అవలోకనం

31

14,850 చదరపు కిలోమీటర్ల లలో వ్యాపించిన మహారాష్ట్ర లోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన షోలాపూర్ ఉత్తరాన ఉస్మానాబాద్, అహ్మద్ నగర్ జిల్లాలను, పశ్చిమాన సతారా, పూనేలను, దక్షిణాన బీజాపూర్, సాంగ్లీ లను, తూర్పున గుల్బర్గా జిల్లాను కలిగి ఉంది.

షోలాపూర్ చాళుక్యులు, యాదవులు, ఆంధ్ర భ్రుత్యులు, రాష్ట్రకూటులు, బహమనీలు పాలించిన చరిత్రను కలిగిఉంది. బహమనీ రాజుల వద్ద నుండి షోలాపూర్ ను బీజాపూర్ రాజులు వశం చేసుకున్నారు. తరువాతి కాలంలో అది మరాఠా పాలకుల వశమైనది. 1818 లో పేష్వాలు పతనమై, బ్రిటీష్ ప్రభుత్వ౦ ఆక్రమించిన తరువాత ఆహ్మద్నగర్ జిల్లాలోని ఒక సబ్ డివిజన్ గా షోలాపూర్ మారింది. 1960 లో మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక జిల్లాగా షోలాపూర్ పేరుగాంచింది.

సైనా నది ఒడ్డున గల షోలాపూర్ మహారాష్ట్ర లో ఒక ప్రధాన జైన మతకేంద్రంగా గుర్తింపు పొందింది. హిందీలో సోలా అ౦టే పదహారు, పూర్ అనగా గ్రామం – అనే దాన్నిబట్టి జిల్లాకు ఈ పేరువచ్చిందని చరిత్రకారుల నమ్మకం. కాగా,ముస్లిం పాలకుల కాలంలో షోలాపూర్ సందల్పూర్ గా పిలవబడి౦దని కొందరు అంటారు. అయితే, బ్రిటీష్ పాలకుల వశం అయిన తరువాత నా తీసివేయబడి షోలాపూర్ గా పిలువబడింది.

షోలాపూర్ ముంబై మహానగరం నుండి 400 కిలోమీటర్లు, పూనే నుండి 245 కిలోమీటర్ల దూరంలో ఉంది.

షోలాపూర్ లోని ఆకర్షణల సముదాయం

భారత దేశం లో దక్షిణ కాశీగా పిలువబడే పంధర్పూర్ గల ప్రాంతంగా షోలాపూర్ ప్రసిద్ది చెందింది.  పంధర్పూర్ దేశ వ్యాప్తంగా విఠోబా దేవుని ప్రధాన మతకేంద్రానికి ప్రతీక. కార్తీక, ఆషాద ఏకాదశి పర్వ దినాల్లో షుమారు నాలుగు నుండి ఐదు లక్షల మంది తీర్థ యాత్రీకులు ఇక్కడికి వస్తారు.

షోలాపూర్ దగ్గరలో ప్రాధాన్య౦ పొందిన తీర్థయాత్రా స్థలం అక్కల్కోట. దత్తత్రేయుడి అవతారమైన శ్రీ స్వామి సమర్థ మహారాజ్ ఆలయం ఇది. ఇక్కడి వటవృక్ష దేవాలయం, స్వామి మఠ౦ చూడదగినవి. తుల్జాభవానీ దేవాలయం గల తుల్జాపూర్ ఇక్కడికి దగ్గరిలోని చూడదగిన వేరొక తీర్థ యాత్రా స్థలం.

ఇక్కడ సరస్సు మధ్యలో అందమైన సిద్దేశ్వర ఆలయం ఉంది. చరిత్రను ఆరాధించే వారికీ ఆసక్తిని కలిగించే అద్భుతమైన కట్టడం భుజ్కోటకోట ఇక్కడ ఉంది.

పక్షులను తిలకించడానికి మోతీబాగ్ చెరువు ఒక అద్భుతమైన ప్రదేశం. శీతాకాలం లో వేలాది వలస పక్షులు ఇక్కడికి వస్తాయి. ఈ చెరువు దగ్గరలో రేవనిసిద్దేశ్వర్ ఆలయం ఉంది. ఈ పరిసరాలలో గల నన్నాజ్ అనే ఒక గొప్ప భారతీయ బట్టమేక పిట్ట సంరక్షణ కేంద్రం, వన్యప్రాణ ఔత్సాహికులను అలరించే మరొక ప్రదేశం.

ఇక్కడ గల అనేక ఆకర్షణలలో గ్రౌండ్ ఫోర్ట్, మల్లికార్జున దేవాలయం, ఆదినాథ దేవాలయం, అనేక మసీదులు, చర్చ్ లు ఉన్నాయి.

షోలాపూర్ – సంస్కృతి, ప్రజలు

షోలాపూర్ తిలకి౦చడానికే కాక, ఇక్కడ ఉండి పని చేయడానికి కూడా అద్భుతమైన గొప్ప నగరం. ఇది మరాఠీ, కన్నడ, తెలుగు మొదలైన వివిధ సంస్కృతులు చెప్పుకోలేనంతగా కలగలిసిన గొప్ప ప్రాంతం.

షోలాపూర్ శివ యోగి శాఖకు చెందిన పురాతన ప్రాంతం. తరువాతి కాలంలో ఈ జిల్లాలో అనేక తీర్థ యాత్ర కేంద్రాలు వ్యాప్తి చెందాయి.

షోలాపూర్ ప్రజలు సర్దుకుని పోయే కలుపుగోలు మనస్తత్వం కలిగినవారు. ఈ కారణం వల్లే షోలాపూర్ ఒక చిన్న అనామక పట్టణం నుండి విజయవంతమైన పూర్తీ స్థాయి వాణిజ్య, యాత్రా ప్రాంతంగా మార్పు చెందింది. ఈ నగరం అనేక భాషల, అనేక పరిశ్రమల, అనేక రకాల ప్రజల కలయిక.

ఈ ప్రాంతంలో నిర్వహించబడే అనేక సంతలు, పండుగలు ఈ దేవాలయ ప్రాంతానికి చెందిన మతపరమైన ప్రజల తమ ప్రాంత గొప్పతనం గా భావించే వాస్తవ కధను తెలుపుతాయి. రెండు రోజులు జరిగే ప్రతీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఇక్కడ గల అనేక సినిమా థియేటర్లు, జానపద కళా కేంద్రాలు ఇక్కడి ప్రజలకు వినోదంపై గల మక్కువను తెలుపుతాయి. ఈ ప్రాంతాన్ని దర్శించి, ఇక్కడి  ఉత్సవాలలో పాల్గొనడం, వారితో కలవడం వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

మరికొన్ని ఇతర వాస్తవాలు

షోలాపూర్ లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 నుండి 42 డిగ్రీలకు చేరుతుంది. మే నెల తీవ్ర వేడిని కలిగి ఉండి, ఎక్కువ భాగం సూర్యుని ప్రతాపం భరించలేన౦త తీవ్రంగా ఉండటం వల్ల యాత్రికులకు ఈ కాలంలో సందర్శన అనువుగా ఉండదు. అప్పటి వరకూ ఉన్న వేడిని తగ్గించి, కొత్తదనంతో వచ్చే వర్షాకాలం ఇక్కడ ఉండడానికి అనువైనది. శీతాకాలంలో జనవరి లో అత్యల్ప ఉష్ణోగ్రత -9 డిగ్రీలకు చేరుతుంది. ఇక్కడ గల అనేక మత కేంద్రాలను దర్శించుటకు, మనోహర దృశ్యాలను తిలకించుటకు శీతాకాలం అనువైనది.

షోలాపూర్ కు ముంబై నుండి హైదరాబాద్ కు రోడ్డు, రైలు మార్గాల ద్వారా కలపబడి వుంది. రాష్ట్ర౦ లోని వివిధ ప్రాంతాలు, దేశంలోని అనేక ప్రదేశాల నుండి షోలాపూర్ రైల్వే స్టేషన్ కు అనేక రైళ్ళు వస్తూ పోతూ ఉంటాయి. వాయు మార్గంలో షోలాపూర్ విమానాశ్రయం వరకు సౌకర్యవంతంగా ప్రయాణించ వచ్చు. రోడ్డు మర్గాన, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రైవేట్ వాహనాల ద్వారా సౌకర్యవంతంగా, మితమైన ఖర్చుతో షోలాపూర్ చేరవచ్చు.

పరుపులు, మరమగ్గాలు, చేతి మగ్గాలు, బీడీ పరిశ్రమకు షోలాపూర్ జిల్లా ప్రసిద్ది చెందింది. దీనితో పాటు ప్రతీ సంవత్సరం ఈ మతకేంద్రం తగు రీతిలో కొత్త పు౦తలలో అభివృద్ది చెందుతుంది. షోలాపూర్ ఆధ్యాత్మికంగా, మతపరంగా, చారిత్రికంగా, ప్రకృతిపరంగా, వాణిజ్యపరంగా, వినోదపరంగా అన్నీ కలిసిన గొప్ప నగరంగా పరిగణించబడుతుంది. ఈ దివ్యమైన నగరాన్ని ఇప్పటి వరకు మీరు సందర్సించక పొతే, సమయం వృధా చేయక త్వరగా ఇక్కడికి చేరితే ఇప్పటివరకు కోల్పోయినది ఏమిటో తెలుస్తుంది.

షోలాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

షోలాపూర్ వాతావరణం

షోలాపూర్
21oC / 69oF
 • Sunny
 • Wind: SE 14 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం షోలాపూర్

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? షోలాపూర్

 • రోడ్డు ప్రయాణం
  Solapur is well connected by road to all the main cities in Maharashtra. Mumbai is about400 km away and has regular state owned and private tour buses that offer shuttle services between the two cities. Same applies for the cities of Pune, Aurangabad, Nagpur and many others. Pune is about 250 km away from Solapur. Solapur is well linked by road to other metro cities like Bangalore and Delhi as well.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  Solapur is easily accessible by rail thanks to the Solapur Railway station. This station is connected to all the cities and towns within and outside Maharashtra with the help of local and out-station trains.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  The Solapur Airport is the best option for air travel if travellers plan to fly in to Solapur. It is situated towards the south of the city. However, tourists from abroad can settle for the Chattrapati Shivaji Airport, an international airport in Mumbai that has connecting flights to Solapur. Both the airports are well linked to all major towns and cities within India.
  మార్గాలను శోధించండి

షోలాపూర్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jan,Mon
Return On
22 Jan,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Jan,Mon
Check Out
22 Jan,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Jan,Mon
Return On
22 Jan,Tue
 • Today
  Solapur
  21 OC
  69 OF
  UV Index: 9
  Sunny
 • Tomorrow
  Solapur
  20 OC
  69 OF
  UV Index: 9
  Partly cloudy
 • Day After
  Solapur
  21 OC
  71 OF
  UV Index: 9
  Partly cloudy

Near by City