Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీరంగం » వాతావరణం

శ్రీరంగం వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం శ్రీరంగం సందర్శనకు అనుకూల సమయం. అప్పుడైతే ఉష్ణోగ్రత తక్కువగానూ వుంటుంది, అలాగని బాగా చలిగా కూడా వుండదు. నిజానికి ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ దేవాలయాల పట్టణంలో అనేక ఉత్సవాలు ఆ సమయంలోనే జరుగుతాయి. ఆ కాలంలోనే భారీ సంఖ్యలో పర్యాటకులు, భక్తులు ఇక్కడికి చేరుకుంటారు కూడా.

వేసవి

వేసవిఉష్ణమండల వాతావరణం వుండడం వల్ల శ్రీరంగం లో వేసవి చాలా వేడి గాను, తేమ గాను వుంటుంది. వేసవి లో ఇక్కడి ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకుంటుంది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ వేసవి వుంటుంది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రంగా వుండడం వల్ల బయటకు వెళ్ళడం సాధ్యం కాదు. ఐతే సాయంకాలాలు ఆహ్లాదకరంగానే వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం శ్రీరంగంలో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరిదాకా వుంటుంది. ఈ ప్రాంతం లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఇప్పటిదాకా నమోదైన గరిష్ట వర్షపాతం 835 మిల్లీమీటర్లు. వర్షాకాలం లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పడిపోతుంది కానీ తేమ స్థాయి మాత్రం బాగా పెరుగుతుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం నవంబర్ చివరిలో మొదలై ఫిబ్రవరి మధ్య వరకు వుంటుంది. అయితే ఇక్కడి శీతాకాలం ఉత్తర భారతంలోని నగరాల్లాగా బాగా చలిగా ఉండదు. ఆ కాలంలో ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలకు తగ్గదు – కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా వుంటుంది.