తుగ్-ల్హ-ఖంగ్ గా పిలువబడే జ్ఞాన దేవతలా దేవాలయంలో పెద్ద సమావేశ మందిరం, ఓ గర్భాలయం ఒక నడవా వున్నాయి. టాబో మఠం సముదాయం లోని అనేక గుళ్ళలో ఇది ఒకటి. ఈ సమావేశ మందిరం మధ్యలో ఆదిబుద్దుడి ఐదుగురు పుత్రులలో ఒకడైన వైరోచనుడి నాలుగు అంచెల విగ్రహం ఉంచారు. రెండు మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం ధర్మ చక్రాన్ని తిప్పుతూ కనపడుతుంది. వజ్రదాతు మండలం గా పిలువబడే నిలువెత్తు స్టక్కో విగ్రహాలకు తీర్చిదిద్దిన జ్వాలా వృత్తాలు గోడల వెంట పెట్టబడి వున్నాయి.
సమావేశ మందిరం వెనుక వున్న గర్భాలయం లో ఐదుగురు బోధిసత్వులు లేక జ్ఞానుల విగ్రహాలు వున్నాయి. గోడలన్నీ బుద్ధుడి జీవిత ఘట్టాల చిత్రాలతో అలంకరించారు. ఈ చిత్రాలు గీయడానికి కాశ్మీర్ నుంచి కళాకారులను తెచ్చారని చెప్తారు.



Click it and Unblock the Notifications