Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తమెంగ్‌లాంగ్ » వాతావరణం

తమెంగ్‌లాంగ్ వాతావరణం

ఉత్తమ సీజన్తమెంగ్‌లాంగ్ సందర్శించడానికి ఉత్తమ సీజన్ అక్టోబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. అప్పుడు తగినంత వెచ్చని బట్టలు తెచ్చుకోవాలి. పర్యాటకులు వేసవి ముగింపు సమయంలో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. కానీ వర్షాకాలం ఒక సమస్యగా ఉండుట వల్ల ప్రయాణించటానికి అనువుగా ఉండదు.

వేసవి

వేసవి కాలం జిల్లాలో కొండ మార్గం కారణంగా వేసవి నెలల్లో అప్పుడప్పుడు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నా ఎక్కువగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవి మార్చిలో ప్రారంభమై మే మరియు జూన్ వరకు ఉంటాయి. ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని అంచనా చేయవచ్చు. సంవత్సరంలో మే మరియు జూన్ నెలలలో ఎక్కువ వేడి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంతమెంగ్‌లాంగ్ లో నిరంతరం వర్షపాతం కలిగి ఉంటుంది. జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు ఎక్కువ వర్షపాతం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు వలన ఈ నెలలలో ఈ ప్రాంతంలో అధిక వర్షపాతం ఉంటుంది. వర్ష కాలం తర్వాత పర్యాటకులు ఈ ప్రదేశంను సందర్శించవచ్చు.

చలికాలం

శీతాకాలంశీతాకాలాలు చాలా చాలా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. పర్యాటకులు శీతాకాలంలో తమెంగ్‌లాంగ్ సందర్శించినప్పుడు ఊలు బట్టలు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. శీతాకాలం చాల చల్లగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.