Search
  • Follow NativePlanet
Share

తవాంగ్  – అనూహ్యమైన నిరాడంబర అందం!

23

తత్వవేత్తలు, మంత్రముగ్ధుల్ని చేసే అందంతో సముద్రమట్టానికి షుమారు 10,000 అడుగుల ఎత్తు దిమ్మ వద్ద ఉన్న తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ జిల్లాలో ఉంది, దీనికి ఉత్తరాన టిబెట్, నైరుతి లో భూటాన్, తూర్పున సెలా శ్రేణిలో పశ్చిమ కమెంగ్ సరిహద్దులుగా ఉన్నాయి.

తవాంగ్ పట్టణప్రాంత పశ్చిమ భాగం నుండి నడుస్తున్న శిఖరం అంచుమీదకెక్కి తవాంగ్ ఆశ్రమం నుండి దానిపేరు తీసుకోబడిందని నమ్ముతారు. “త” అంటే గుర్రం అని, “వాంగ్” అంటే ఎంపిక అని అర్ధం.

ప్రస్తుత ఆశ్రమ స్థలం మేరగ్ లామా లోడ్రే గ్యంత్సో పెంచుకున్న గుర్రం ద్వారా ఈ స్థలం kక్రి.శ.1680-81 లలో ఎంపిక చేయబడిందని పురాణాల కధనం. ఈ ఆశ్రమ స్థాపనకు మేర లామా లోడ్రే గ్యంత్సో సరైన ప్రదేశం కోసం ఎంత వెతికినా గుర్తించడం సాధ్యంకాలేదు, చివరకు దైవశక్తి మార్గదర్శకత్వం కోసం ప్రార్ధన చేద్దామని నిర్ణయించుకున్నాడు. పరధన చేసిన తరువాత కళ్ళు తెరిచి చూస్తే తన గుర్రం కనిపించలేదు.

అందువల్ల, అలసటతో అతను తన గుర్రాన్ని వెతకడానికి వెళ్ళగా, కొండపైన దానికి గుర్తించాడు. అది అక్కడ మంచి శకునంగా కనిపించించి, ఆ ప్రదేశానికి తవాంగ్ గా వాడుకలోకి వచ్చింది. తవాంగ్ చెక్కుచెదరని అద్భుతమైన అందంతో కూడిన వర్ణించలేని ప్రదేశం. సూర్యుని ఎర్రబారిన మొదటి కిరణాలు మంచు శిఖరాన్ని తాకేచోట, చివరలో లెక్కపెట్టలేని ప్రారంభంతో అసంకల్పిత రీతిలో వణుకుతున్న ఆకాశం పళ్ళాన్ని నింపుతుంది.

తవాంగ్ లోను, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు

తవాంగ్ ఆశ్రమాలు, శిఖరాలు, జలపాతాలు వంటి ఆరామాలు మొదలుకొని తరచూవచ్చే సందర్సకులతో అద్భుతమైన ఆకర్షణలకు నిలయంగా ఉంది. తవాంగ్ మానేస్త్రీ, సెలా పాస్, బాలీవుడ్ చిత్రాలకు సరైన ప్రదేశాలుగా ఉన్న అనేక ఇతర జలపాతాలు వంటివి కొన్ని తవాంగ్ లోని ప్రధాన ఆకర్షణలు.

ప్రశాంతమైన నీటి సరస్సులు, నదులు, ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింప చేసే అనేక ఎత్తైన జలపాతాలు, కొన్నిసార్లు మేఘాలు భార౦గా తేలుతున్నట్లు సందర్శకులకు మంత్రముగ్ధుల్ని చేసే అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతిని ఆనందించాలి అనుకునే నిజమైన ప్రేమికులను ఈ రహస్య స్వర్గం స్వాగతిస్తుంది. ఇక్కడ 27 అడుగుల ఎత్తు కల బంగారు బుద్ధ విగ్రహం కలదు.

వేడుకలు, పండుగలు

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లో మోన్పా తెగ గిరిజన ప్రజలకు ఎల్లప్పుడూ వేడుకలు, పండుగలు ఒక అంతర్భాగంగా ఉండేవి. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇతర గిరిజనుల లాగా, మొన్పాల పండుగలు కూడా ఎక్కువగా వ్యవసాయ౦, మత౦తో సంబంధాన్ని కలిగిఉంటాయి.

తవాంగ్ లోని మొన్పాలు ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకుంటారు. ఫిబ్రవరి చివరలో జరుపుకునే కొత్తసంవత్సర పండుగ లోసార్, ఉత్సాహంతో, ఉల్లాసంతో మార్చ్ నెల ప్రారంభంలో జరుపుకునేవి కొన్ని.

సాధారణంగా ప్రతి ఏటా జనవరి నెలలో వచ్చే తోర్గ్య అనే మరో పండుగను, లునర్ కాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం పదకొండవ నేల 28 వ రోజు జరుపుకుంటారు.

అసాధారణ ప్రకృతి వైపరీత్యాలు, మానవులు, పంటలు రెంటిలో దురదృష్టాలు, దుష్ట ఆత్మల వచ్చే రోగాలను పోగొట్టుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారని నమ్మకం. సాధారణంగా ప్రతి ఏటా జనవరి మాసంలో వచ్చే సాకా దావా పండుగను లునర్ కాలెండర్ ప్రకారం ప్రతి ఏటా పదకొండవ నెల 28 వ రోజు జరుపుకుంటారు.

పంటలకు అతీంద్రియ శక్తులనుండి రక్షణను అందించే ఒక లక్ష్యంతో, పంట అభివృద్ది కోసం, గ్రామ సమాజానికి హానిచేసే చెడు ఆత్మను దూరం చేయడానికి కూడా మొత్తం గ్రామ సమాజం నిర్వహించే ఒక మతపరమైన ఊరేగింపు ఈ చోయికోర్.

చోయికోర్ పండుగను చివరి వ్యవాసాయ కార్యకలాపాలు నిర్వహించే లునర్ కాలెండర్ ప్రకారం ఏడవ నెలలో నిర్వహిస్తారు.

కళలు, చేతిపనులు

వినియొగదారుల కొనుగోలు కోసం స్థానిక మార్కెట్లో అందుబాటులో అందంగా రూపొందించిన సాంప్రదాయ, కళాత్మక చేతిపనుల గొప్ప నైపుణ్యం కలిగిన మొన్పాలను తవాంగ్ ప్రజలు అనికూడా పిలుస్తారు. ఈ హస్తకళా వస్తువులు ప్రభుత్వ హస్తకళా కేంద్రంలో కూడా అందుబాటులో ఉంటాయి. చెక్కతో చేయబడిన బొమ్మలు, కార్పెట్ అల్లిక, వెదురుతో చేసిన సామగ్రి మొదలైన అద్భుతమైన అందంతో ఉన్నాయి.

వారు చిత్రలేఖనంలో, చేతితో పేపరు తయారుచేయడంలో సముచిత స్థానాన్ని సంపాదించారు. తవాంగ్ ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించే తోర్గ్య పండుగ సమయంలో మత మాస్క్ నృత్యంలో ఉపయోగించే చెక్కతో చేసిన చెక్క మాస్క్ వంటి కొన్ని కళా వాస్తవాలు కూడా ఉన్నాయి.

డోలోమ్ అనేది చెక్కతో కళాత్మకంగా రూపొందించిన మూత ఉన్న తినే గిన్నె. షెంగ్-ఖ్లెం అనేది చెక్కతో చేసిన చెంచా. గ్రక్ అనేది టీ అందించడానికి ఉపయోగించే చెక్కతో చేయబడిన కప్పు.

తవాంగ్ సందర్శనకు సరైన సమయం

తవాంగ్ పట్టణంలో సంవత్సరంలో ఎక్కువ భాగం ఒకమోస్తరి వాతావరణం ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణం ఉండే మార్చ్, అక్టోబర్ మధ్య మాసాలు ఈ స్థల సందర్శనకు ఉత్తమం.

తవాంగ్ చేరుకోవడం ఎలా

అస్సాం లోని తేజ్పూర్, గౌహతి గుండా దేశంలోని ఇతర భాగాల నుండి తవాంగ్ చేరుకోవచ్చు. ఢిల్లీ నుండి గౌహతి వరకు ఇండియన్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్, సహారా ఎయిర్ లైన్స్ వంటి రోజువారీ విమానాలు ఉన్నాయి. ఇక్కడ కోల్కత్త నుండి, దేశంలోని ఇతర భాగాల నుండి కూడా విమానాలు ఉన్నాయి. ఇవ్వికాకుండా, గౌహతి వరకు రాజధాని ఎక్స్ప్రెస్ తోపాటు రైలు సర్వీసులు ఉన్నాయి.

తవాంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తవాంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తవాంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తవాంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా తవాంగ్ గౌహతి, తేజ్పూర్ వంటి సమీప పట్టణాలకు బాగా అనుసంధానించబడి ఉంది, ఈ ప్రాంతంలో ఇతర ప్రదేశాలు, తేజ్పూర్ నుండి తవాంగ్ కు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *తవాంగ్ లో రైల్వే స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ రంగ పార తవాంగ్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగ పార సమీప విమానాశ్రయం, కానీ ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి చాలా తక్కువ రైళ్ళు మాత్రమే ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా విమానంలో వచ్చేవారికి సమీపంలోని తేజ్పూర్ విమానాశ్రయం ఉత్తమ ఎంపిక. ఈ ప్రదేశానికి కోల్కతా, ఢిల్లీ, గౌహతి వంటి నగరాల నుండి విమానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి కిలోమీటర్ కి షుమారు 7 రూపాయల ఖర్చుతో టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri