తెహ్రిలో సంవత్సరం అంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉన్నప్పటికీ సందర్శించటానికి ఉత్తమ సమయం ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య ఉంటుంది.
వేసవి మార్చ్ లో మొదలై మే నెల చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 30 కనిష్టం 9 డిగ్రీలు గా వుంటాయి.
తెహ్రి లో వర్షపాతం ఒక మోస్తరు నుండి అధికంగా వుంటుంది. ఈ సమయంలో కొండ చరియలు విరిగి పడుతూ పర్యటన అసౌకర్యంగా వుంటుంది.
ఈ ప్రాంతంలో వింటర్ డిసెంబర్ లో మొదలై, ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల నుండి 15 డిగ్రీల వరకూ మారుతూంటాయి.