Search
  • Follow NativePlanet
Share

థానే – సరస్సుల నగరం

41

సరస్సుల నగరంగా పిలువబడే థానే మహారాష్ట్ర లో వుంది. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వున్న ఈ నగర జనాభా  2.4 మిలియన్లు దాటింది. శ్రీ స్థానక్ గా కూడా పిలువబడే థానే ముంబై కి ఈశాన్యంలో వుంది.

సాల్సెట్ ద్వీపం మీద వున్న థానే సముద్రమట్టానికి ఏడు మీటర్ల ఎత్తున వుండి, అన్నివైపులా కొండలతో చుట్టబడి వుంది – ప్రధానంగా పార్సిక్, ఎయూర్ కొండలు.

చరిత్ర లోకి ప్రయాణం

థానే గడిచిన కొన్ని శతాబ్దాలు గా భారత దేశ చరిత్ర మీద తనదైన ముద్ర కలిగి వుంది. ప్రముఖ గ్రీక్ భౌగొళికవేత్త టోలెమీ క్రీ.శ 135 నుంచి 150 మధ్య తొలుతగా థానేను తాన రచనల్లో చేర్సోనేసస్ అనే పేరుతొ ప్రస్తావించాడు.

క్రీ.శ. 1321 నుంచి 1324 మధ్య ఫ్రియర్ జోర్దానస్ అనే యాత్రికుడు థానే ముస్లిం రాజుల పాలనలో ఉండడాన్ని ప్రస్తావించాడు. ఐన్ బతూతా, అబుల్ ఫీడా థానే ను కుకిన్ తానా గా ప్రస్తావించి అది అప్పట్లో ఎంత గొప్ప రేవో వర్ణించాడు.

చివరిగా,  1530 లో పోర్చుగీస్ వారు వచ్చి థానే ను కకబే డి తాన అని పిలిచారు. తర్వాతా మరాఠా రాజులు చేజిక్కించుకుని పాలించాక చివరికి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లి తానా అయింది. 1863 లో థానే లో మొదటి పురపాలక సంఘ౦ ఏర్పడింది.

ఇక్కడ వున్నప్పుడు ఏమి చూడాలి?

ఇక్కడ వుండే అసంఖ్యాక చెరువుల కారణంగా థానే ను సరస్సుల నగరంగా పిలుస్తారు. ఈ జిల్లా అంతటా విస్తరించిన దాదాపు 30 సరస్సులు వున్నాయి. వాటిలో మసుండా తలావ్ అన్నిటికన్నా అందంగా వుంటుంది. తలావ్ పల్లి గా కూడా పిలువబడే ఈ సరస్సు బోటింగ్, వాటర్ స్కూటర్లు లాంటి జలక్రీడ అవకాశాలు కూడా కల్పిస్తుంది. కాగా, ఒక వైపు ఎయూర్ కొండలకి మరో వైపు నీలకంఠ కొండలకి మధ్య వున్న ఉపవన్ సరస్సు కూడా ఇంకో అందమైన ప్రదేశం. ఎయూర్ కొండలలో వన్య ప్రాణి, ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరిచే సంజయ్ గాంధి జాతీయ ఉద్యానవనం ఇంకో ప్రధాన ఆకర్షణ. దగ్గరలోనే వున్న కాశీ మీరా ఇంకో అందమైన ప్రదేశం. థానే లోని హర హర గంగే జలపాతం దేశంలోనే పెద్దది, ఎత్తైనది అయిన జలపాతంగా చెప్తారు.

అంబర్నాద్ దేవాలయం గా ప్రసిద్ది చెందిన అమ్బ్రేశ్వర దేవాలయం హేమాండ్పతి శైలి లో నిర్మించిన ప్రముఖ ధార్మిక క్షేత్రం.

చరిత్ర, వాస్తు ప్రేమికులు బస్సేయిన్ కోట (వసాయి కోట), జవహర్ పేలస్ చూసి ఆనందిస్తారు. సాహసికులు నానేఘాట్ కొండల మీద పర్వతారోహణ చేయవచ్చు. కుటుంబంతో సముద్రతీరాన కాలక్షేపం చేయదలుచుకుంటే కేల్వా సముద్రతీరానికి వెళ్ళిపొండి.

ప్రధానంగా మరాఠీ సంస్కృతి కనపడే థానే లో గణేష్ చతుర్ధి, గోకులాష్టమి, దుర్గా పూజ లాంటి పండుగలు నిర్వహిస్తారు. స్థానికులు పాల్గొనే సంబరాలు చూసి తీరాల్సిందే.

కొన్ని అదనపు వాస్తవాలు

థానే లో వాతావరణం ముంబై లో లాగానే వుంటుంది. ఉష్ణమండల వాతావరణం తో ఏడాదిలో ఎక్కువ భాగం తేమగా వుండి, అది యాత్రికులను దాదాపు ఏడాది పొడవునా ఆకర్షిస్తూనే వుంటుంది. గరిష్టంగా 40 డిగ్రీలకు చేరుకునే ఉష్ణోగ్రత తో ఇక్కడి వేసవి తీవ్రంగా వుంటుంది. అయితే ఇక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల వాతావరణం మరింత వేడిగా అవకుండా వుంటుంది. తర్వాత వర్షాకాలంలో పడే వర్షాల వల్ల ఇక్కడి సరస్సులలో నీరు నిండుగా ఉండడంతో చూడ్డానికి చాలా బాగుంటుంది. చివరిగా వచ్చే శీతాకాలం ఈ ప్రాంతాన్ని చూడ్డానికి అనువైన సమయంగా నిలుస్తుంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు చేరుకొని వాతావరణం చల్లగా మారిపోవడంతో ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ముంబై కి దగ్గరగా వుండడం వల్ల థానే కు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తేలిగ్గా చేరుకోవచ్చు. వాయుమార్గం ద్వారా ముంబై లోని అంతర్జాతీయ విమానాశ్రయం థానే కు వరం లాంటిదే. ఇక్కడి నుంచి మొదలయ్యే రైళ్ళు, ఇక్కడికి చేరుకునే రైళ్లతో థానే పెద్ద కూడలిగా మారడం వల్ల రైలు మార్గంలో కూడా వెళ్ళవచ్చు. ఒకవేళ వాహనంలో వెళ్ళాలనుకుంటే, థానే గుండా వెళ్ళే మూడు జాతీయ రహదారుల్లో ఒకదాన్ని ఎంచుకునే సౌకర్యం కూడా వుంది.

థానే కు ప్రస్తుతం వున్న నగర వాతావరణం పక్కనే వున్న ముంబై నుంచి అబ్బింది. చారిత్రికంగా థానే ముస్లింలు, మరాఠాలు, పోర్చుగీస్, బ్రిటిష్ ఇలా చాలా సంస్కృతులకు ఆలవాలంగా వుండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రతి వారు తమదైన ముద్ర థానే పై వదలి వెళ్ళారు. వివిధ సంస్కృతుల మేళవింపు ఇలా ఇంకెక్కడా కనపడదు. ఈ గత చరిత్ర ఘన వైభవం చూడాలంటే థానే చూడాల్సిందే.

థానే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

థానే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం థానే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? థానే

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం థానే అన్ని నగరాల నుంచి రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ముంబై – అహ్మదాబాద్, ముంబై-బెంగుళూర్ రహదారులు థానే గుండా నడుస్తాయి. థానే నుంచి మహారాష్ట్ర లోపల, వెలుపల ప్రధాన నగరాలకు నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడుస్తూ ఉంటాయి
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా మధ్య తీర రైల్వే లైన్లో ఉండే థానే రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే కూడలి. దాదర్, పాన్వెల్ నించి ఇక్కడికి చేరుకోవడానికి స్థానిక రైళ్ళు ఉన్నాయి. సహ్యాద్రి ఎక్స్ప్రెస్, కోయన ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, సేవాగ్రం ఎక్స్ప్రెస్, కామాయని ఎక్స్ప్రెస్, కుషీనగర్ ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్- కోయంబత్తూర్, సిదేశ్వర్ ఎక్స్ప్రెస్, నేత్రావతి ఎక్స్ప్రెస్, మహానగరి ఎక్స్ప్రెస్ వంటి కొన్ని రైళ్ళు ఈ స్టేషన్ గుండా నడుస్తాయి. భారత దేశంలో 1854 లో మొదటి ట్రైను ఆగిన గమ్య స్థానంగా థానే పేరుగాంచినది అన్నది తెలిసిన విషయమే.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం థానే కి సమీప విమానాశ్రయం. ఇది షుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉండి, కాబ్ లేదా బస్సులో చేరుకోవచ్చు. ఆ రోజు సమయం, రద్దీ పై ఆధారపడి ప్రయాణం దగ్గరగా ఒక గంట ఉంటుంది. ముంబై నుంచి భారత దేశానికే కాకుండా, ప్రపంచం మొత్తానికి అనేక దేశీయ, అంతర్జాతీయ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat