తేన్మల ప్రసిద్ధిగాంచిన ఒక పర్యావరణ పర్యాటక ప్రదేశం. ఇది కొల్లం జిల్లాలో కలదు. దీనిని హిల్ అఫ్ హనీ అని అంటారు. ఈ ప్రదేశం తేనె కు ప్రసిద్ధి. ఈ తేనెలో చాల ఔషద గుణాలు ఉన్నాయని చెపుతారు . ఈ ప్రదేశం కేరళ రాజధాని నగరం నుండి సుమారు 70 కి మీ. దూరంలో కలదు. తేన్మల లోఇండియా లోని మొట్టమొదటి పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ ప్రణాళిక చేసారు. పర్యావరణ పర్యాటక ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ప్రాంతం 5 ప్రధాన జోన్స్ గా విభజించారు.అవి కల్చరల్ జోన్, అడ్వెంచర్ జోన్, విశ్రాంతి జోన్, డీర్ సంరక్షణ శాఖ మరియు బోటింగ్ జోన్ లుగా కలవు. పచ్చటి అడవులలో అనేక ఎకరాలలో వ్యాపించిన తేన్మల లక్షలాది పర్యాటకులను దేశంలోనూ మరియు విదేశాలనుండి ఆకర్షిస్తోంది. ఈ పర్యావరణ పర్యాటక ప్రదేశం వివిధ రకాల మొక్కలకు మరియు వన్య జీవులకు నిలయంగా వుంది. ఈ పర్వత ప్రాంతం అనేక సాహస క్రీడలకు వినోదాలకు అంటే బోటింగ్, రోప్ బ్రిడ్జి, ట్రెక్కింగ్, పర్వతారోహణ ,బైకింగ్ , మరియు ఒక మ్యూజికల్ ఫౌంటెన్ వంటివి కూడా అందించి పర్యాటకులను ఆనందింప చేస్తుంది.
సైట్ సీఇంగ్
సైట్ సీఇంగ్ ప్రియులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం గా వుంటుంది.
కల్లాడ నదిపై నిర్మించిన డాం తేన్మలై ప్రాంతం లో ఒక ప్రధానాకర్షణ. పాలరువి జలపాతాలు తేన్మలై ప్రాంతాన్ని ఒక మంచి వినోద మరియు హనీమూన్ ప్రదేశంగా తయారు చేసాయి. ఇక్కడ కల లేళ్ళ పార్కు మరొక ఆకర్షణ. అనేక రకాల లేళ్లు చూడవచ్చు. పార్కులో నిర్మించిన చెట్టు నివాసాలు మీకు ఒక మంచి విశ్రాంతి నివాసంగా అనిపిస్తాయి.
నక్షత్ర వనం, అర్యనకావు శాస్త దేవాలయం, కులతు పూజ శాస్త దేవాలయం మరియు సస్పెన్షన్ బ్రిజ్ వంటివి పర్యాటకులు చూచి ఆనందించవచ్చు. రోడ్డు మార్గంలో ఈ ప్రదేశానికి తిరువనంతపురం మరియు పునలూర్ ల నుండి తేలికగా చేరవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం సంవత్సరం పొడవున పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎడ్వెంచర్ లేదా విశ్రాంతి ఏదైనప్పటికీ తేన్మలై మీకు ఆనందాన్ని అందిస్తుంది.