Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తెన్జాల్ » వాతావరణం

తెన్జాల్ వాతావరణం

వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలం, వేసవి లో తెన్జాల్ ను సందర్శించడం ఉత్తమం. వర్షాకాలం తరువాత సమయం పచ్చగా, సెలవ దినాలకు ఖచ్చితమైన విరామంగా ఉంటే, శీతాకాలం పర్వతారోహణకు, తెన్జాల్ సమీపంలో ఉన్న తెలియని ప్రదేశాలను సందర్శించడానికి అనువుగా ఉంటుంది. కొద్ది వేడి ఉండే వేసవి, స్థల సందర్శనకు అనువైనది.

వేసవి

వేసవి తెన్జాల్ లో వేసవి మార్చ్ నెలలో ఆలస్యంగా ప్రారంభమై, మే చివరి వరకు లేదా జూన్ ప్రారంభం వరకు ఉంటుంది. కర్కాటక రేఖ ఈ గ్రామం గుండా వెళ్తుంది కాబట్టి, వేసవి సమయంలో ఇక్కడ మధ్యస్థ వేడి ఉంటుంది. ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్య ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం తెన్జాల్ లో వర్షాకాలం చాలా విస్తృతంగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ చివరి వరకు వర్షాలు పడతాయి. ఈ సమయంలో, తెన్జాల్ సమీపంలోని వివిధ ఆకర్షణలు చూడడానికి కష్టంగా ఉంటుంది. జులై నెలలో భారీ వర్షాలు పడతాయి. ఈ సమయంలో తెన్జాల్ పర్యటన సరైనది కాదు.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో పగలంతా దాదాపు సూర్యుని వెలుగుతో తెన్జాల్ లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది, రాత్రులు ఆహ్లాదకరమైన చల్లదనం ఉంటుంది. శీతాకాలం నవంబర్ చివరి నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఈ పొడి వాతావరణం ట్రెక్కింగ్ కి అనువుగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తెన్జాల్ పర్యటన సరైన సమయం.