Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తింగలూర్ » వాతావరణం

తింగలూర్ వాతావరణం

ఉత్తమ సమయం సరైన వాతావరణం ఉండే అక్టోబర్ నుండి జనవరి మాసాలలో తింగలూర్ సందర్శన సరైన సమయం. నిజానికి, ఎవరూ శీతాకాలంలో సూర్యుడి వెచ్చదనాన్ని పోగొట్టుకోవాలి అనుకోరు, రాత్రి ఆహ్లాదకరమైన చల్లదనాన్ని విడిచిపెట్టాలి అనుకోరు కాబట్టి ఆ సమయంలో ఈ ప్రదేశం పర్యాటకులతో సందడిగా ఉంటుంది.

వేసవి

వేసవి భౌగోళిక ప్రదేశమైన తింగలూర్ లో ఏప్రిల్, మే, జూన్ సమయంలో చాలా వేడి వాతావరణం ఉంటుంది. నిజానికి, వేసవి వేడి మార్చ్ చివరి వరకు ఉంటుంది, అధిక స్థాయిలో చెమట, పెరుగుతున్న ఉష్నోగ్రతల వల్ల ప్రయాణం అసౌకర్యంగా ఉంటుంది. 38 డిగ్రీల ఆకాశాన్నంటే ఉష్ణోగ్రతతో మే,జూన్ నెలలో తింగలూర్ లో వేడి నెలలు.

వర్షాకాలం

వర్షాకాలం తింగలూర్ లో వర్షాకాలం జూన్ చివరలో ప్రారంభమై జులై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయి, కానీ జులై, ఆగస్ట్ నెలలలో తుఫాను తీవ్రత వల్ల వానలు కూడా పడతాయి. అక్టోబర్, నవంబర్ లో తేలికపాటి వర్షాలు కూడా ఉంటాయి.

చలికాలం

శీతాకాలం తింగలూర్ లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలు విలక్షణమైన శీతాకాలం. అయితే, ఈ ప్రాంతంలో చలి ఉత్తర భారతదేశంతో పోలిస్తే ఏమీ చలి ఉండదు. నిజానికి, శీతాకాలంలో తింగలూర్ లో వాతావరణం తేలికగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కావున ఉత్తమ సమయంగా భావిస్తారు. ఇది సాయంత్రం, రాత్రి పూట చాలా చల్లగా మారుతుంది, కానీ ఈ చల్లదనానికి తేలికపాటి ఊలు దుస్తులతో తేలికగా రక్షణ పొందవచ్చు.