Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరుచెందూర్

తిరుచెందూర్ –సముద్ర తీరం లోని ఆలయ పట్టణం !

20

తిరుచెందూర్ ను తిరుచెందూర్ అని కూడా అంటారు. ఇది ఒక చిన్న అందమైన కోస్తా తీర పట్టణం, ఇది దక్షిణ ఇండియాలోని తమిల్ నాడు లో తూతుకుడి జిల్లాలో కలదు. ఇక్కడ శ్రీసుబ్రహ్మన్యేశ్వర దేవాలయం ప్రసిద్ధి.

ఒక ఆలయ పట్టణం తిరుచెందూర్ చుట్టుపట్ల కల ఆకర్షణలు

తిరుచెందూర్ ప్రధానంగా ఒక ఆలయ పట్టణం. దీనిలో అందమైన దేవాలయాలు , తిరుచెందూర్ మురుగన్ టెంపుల్, వల్లి గుహ లేదా దత్తాత్రేయ గుహ కలవు. టెంపుల్స్ మాత్రమే కాక ఇతర ఆకర్షణలలో పంచాలంకురిచి కోట, మేలపుతుకూది, కుదిరి మోజితేరి, తూటికోరిన్ మరియు వనతిరుపతి, పున్నై నగర్ లు కలవు.

తిరుచెందూర్ గురించి మరింత చెప్పాలంటే, ఈ టవున్ చుట్టూ తీర ప్రాంత అడవులు వుంటాయి. ఈ అడవి ప్రదేశాలు పచ్చని తాటి చెట్లు, జీడిపప్పు మొక్కలు, మరియు ఉష్ణమండల మొక్కలు కలిగి వుంటాయి. ఈ టవున్ చాలా ప్రాచీనమైనది. చరిత్ర మేరకు ఈ పట్టణం క్రిస్టియన్ గ్రందాల లో కూడా పేర్కొనబడినది. పురాణాల మేరకు శ్రీ మురుగన్ తిరుచెందూర్ లో సురపద్మన్ అనే రాక్షసుడిని వధించాడు. ఈ ప్రదేశం శ్రీ మురుగన్ కు పవిత్ర నివాసం.

తిరుచెందూర్ ను గతంలో కాపాడపురం అనే వారు. తర్వాతి కాలంలో తిరుచేన్ చెందిలూర్ అని మరియు తర్వాత తిరుచెన్ – చెందిలూర్ అని ఆతర్వాత తిరు చెందూర్ అని పిలిచారు. తిరుచెందూర్ ను అనేక రాజ వంశాలు పాలించాయి. వారిలో చెరలు, పంద్యాలు మొదలైన వారు కలరు. క్రి.శ.1649 లో ఈ పట్టణం డచ్ వారిచే దాడి చేయబడినది. వీరు తూతుకుడిని పోర్చుగీస్ నుండి జయించటానికి ప్రయత్నించారు. అయితే పోర్చుగీస్ వారు మదురై నాయకుల సహకారంతో డచ్ ను పారద్రోలారు.

తిరుచెందూర్ వాతావరణం

తిరుచెందూర్ వాతావరణం సంవత్సరం పొడవునా ఒకే మోస్తరుగా వుంటుంది. అక్టోబర్ నుండి మార్చ్ వరకు పర్యాటకుల, తీర్థ యాత్రికుల విహారాలు బాగానే సాగుతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకూ టెంపుల్స్ చూసేందుకు చిన్న పాటి సందర్శనలు అనుకూలం.

తిరుచెందూర్ ఎలా చేరాలి ?

తిరుచెందూర్ కు చక్కని రోడ్డు మార్గం కలదు. సమీప ఎయిర్ పోర్ట్ టూటికోరిన్ లో కలదు. ఇది 27 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం తిరునల్వేలి జంక్షన్ కు కూడా రైలు మార్గంలో కలుపబడి దేశం లోని ఇతరప్రాంతాలకు కలుపబడి వుంది. మీకు చరిత్రపై ఆసక్తి, యాత్ర చేసే ఆసక్తి ఉన్నట్లయితే, తిరుచెందూర్ మీ పర్యటనకు సరైన ప్రదేశం.

తిరుచెందూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరుచెందూర్ వాతావరణం

తిరుచెందూర్
30oC / 87oF
  • Patchy rain possible
  • Wind: SW 9 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరుచెందూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరుచెందూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం చెన్నై, మదురై, తిరునల్వేలి, త్రివేండ్రం మరియు కన్యాకుమారి ల నుండి తిరుచెందూర్ కు ప్రభుత్వ బస్సు లు కలవు. బస్సు ధరలు చాలా చవక. రోడ్డు మార్గం లో తిరుచెందూర్ చేరటం తేలిక.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం తిరుచెందూర్ రైలు మార్గంలో తిరునల్వేలి జంక్షన్ తో కలుపబడి వుంది. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. ఇది 60 కి.మీ.ల దూరంలో కలదు. తూటికోరిన్ రైలు స్టేషన్ నుండి కూడా వివిధ నగరాలకు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఈ ప్రదేశానికి తూటికోరిన్ ఎయిర్ పోర్ట్ సమీపం. తిరుచెందూర్ కు 27 కి. మీ.ల దూరంలో వుంటుంది. మదురై స్థానిక విమానాశ్రయం నుండి కూడా చేరవచ్చు. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం త్రివేండ్రం లో 150 కి. మీ. ల దూరం లో కలదు.
    మార్గాలను శోధించండి

తిరుచెందూర్ ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jun,Wed
Return On
27 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Jun,Wed
Check Out
27 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Jun,Wed
Return On
27 Jun,Thu
  • Today
    Thiruchendur
    30 OC
    87 OF
    UV Index: 7
    Patchy rain possible
  • Tomorrow
    Thiruchendur
    27 OC
    80 OF
    UV Index: 7
    Moderate or heavy rain shower
  • Day After
    Thiruchendur
    24 OC
    76 OF
    UV Index: 7
    Moderate or heavy rain shower