Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరునగేశ్వరం » వాతావరణం

తిరునగేశ్వరం వాతావరణం

ఉత్తమ కాలం యాత్రికులు తిరునగేశ్వరం సందర్శించడానికి అక్టోబర్, మార్చి మధ్య కాలం ఉత్తమమైంది. ఈ కాలంలో వాతావరణం పెద్దగా ఎండగా లేదా పెద్దగా చల్లగా ఉండక పోవడం వలన ఆలయాల సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాక ఈ కాలంలో వర్షాల భయం కూడా ఉండదు. జూన్- సెప్టెంబర్ మధ్య కాలం ఈ పట్టణం లో కొన్ని రోజులు బస చేయాలనుకొనే పర్యాటకులకు ఉత్తమంగా ఉంటుంది. తేమతో కూడిన వాతావరణమైనప్పటికి ఈ సమయంలో ఆనందించడానికి, దృశ్యాలను చూడటానికి అనువుగా ఉంటుంది.

వేసవి

వేసవికాలం ఇతర నవగ్రహ స్థలాల వలె తిరునగేశ్వారంలో కూడా మర్చి, మే నెలలలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 28-44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. పర్యాటకులు వేడి వాతావరణం కారణంగా ఈ కాలంలో ఈ స్థలాన్ని సందర్శించడం మంచిది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఇతర నవగ్రహ స్థలాల వలే కాక తిరునగేశ్వరం లో ప్రతి ఏటా భారీ వర్షపాతం (సుమారు 220 సెంటిమీటర్లు)కురుస్తుంది. చెమటలు పుట్టే వేడి నుండి పర్యాటకులకు ఈ భారీ వర్షాలు కొంత ఉపశమనాన్ని కల్గిస్తాయి.

చలికాలం

శీతాకాలం తిరునగేశ్వరంలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 20-30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండే ఈ కాలంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకర౦గా ఉంటుంది.