Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువానై కావాల్ » వాతావరణం

తిరువానై కావాల్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుండే చలి కాలం అనువైనది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు సమ స్థిత లో వుంటాయి. పర్యటనకు అనుకూలం గా వుంటుంది. సాయంకాలాలు చల్లని గాలులు వీచి హాయి గా వుంటుంది.  

వేసవి

వేసవి వేసవి ఈ ప్రదేశం లో మార్చ్ లో మొదలై మే మధ్య భాగం వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 37 డిగ్రీలు గా వుంటుంది. తేమ అధికం. సాయంకాలాలు చల్లబడి ఒక మోస్తరు గా వుంటుంది. వేసవి తిరువనై కావాల్ పర్యటనకు సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం మే మధ్య భాగం లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకు పది ఆహ్లాదకరంగా వుంటుంది. అయితే గాలిలో తేమ అధికం అవుతుంది. ఈ ప్రదేశం ఒక మోస్తరు వర్షం పొందుతుంది. గాలులను బట్టి వర్షం అధికంగా కూడా పడవచ్చు. కనుక వర్షాకాలం పర్యటనకు తగిన సమయం కాదు.

చలికాలం

శీతాకాలం తిరువనై కావాల్ లో చలికాలం ఒక మోస్తరు గా వుంటుంది. ఈ కాలం నవంబర్ లో మొదలై, ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు సగటున 22 డిగ్రీలుగా వుంది ఆహ్లాదంగా ఉంటుంది. సాయంకాలాలు , రాత్రులు చలి అధికం.