Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరువనంతపురం

తిరువనంతపురం: ది వండర్ ల్యాండ్ అఫ్ కేరళ.

28

"గాడ్స్ ఓన్ కంట్రీ" గా పేర్కొనే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. బ్రిటిష్ వారు ఈ నగరాన్ని త్రివేండ్రం అని పిలిచేవారు. ఇలా త్రివేండ్రం పేరుతో చలామణి అవుతున్న ఈ నగరాన్ని, 1991 సంవత్సరం లో ఇక నుండి తిరువనంతపురం గా పేర్కొనాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. దక్షిణ భారతదేశం లో, పశ్చిమ కోస్తా తీరం దక్షిణ భాగం అంచున భారతమాత పాదాల చెంతన ఉంటుందీ నగరం. నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ అనే సంస్థ ఈ మధ్యనే 'తప్పక సందర్శించవలసిన' ప్రాచీన ప్రదేశాల జాబితాలో ఈ నగరాన్ని కూడా జేర్చింది. '10 గ్రీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా' లిస్టు లో ఉన్న ఈ నగరాన్ని, మహాత్మా గాంధీ 'ఎవర్ గ్రీన్ సిటీ అఫ్ ఇండియా' గా పేర్కొన్నారు.

తిరువనంతపురం, పరశురాముడు, మరియు మధ్యయుగం నాటి అన్వేషకులైన ఫా హీన్, మార్కో పోలో, కొలంబస్, వాస్కో డి గామా వంటి విశేష వ్యక్తులకే గాక, చరిత్రలో పేర్కొనని మరికొంతమందికి కూడా ఈ నగరం అతిధ్యమిచ్చింది.

తిరువనంతపురమనే ఈ నగరం పేరుకు కారణమైన వేయి తలల అనంత శేషునిపై పవళించిన పద్మనాభస్వామి, ఈ నగర నడిబొడ్డున పద్మనాభస్వామి ఆలయం లో కొలువై ఉన్నాడు. పశ్చిమ కోస్తా తీరం లో ఏడు కొండలపై ఉండే ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందింది, అయినప్పటికీ తన ప్రాచీన గత వైభవాన్ని కోల్పోలేదు. పురాణ గాధల ఆధారం గా పరశురాముడు, ఈ ప్రదేశం కోసం సముద్రునితో మరియు వరుణుడితో పోరాడాడు అని, అలాగే, వామనుని చే పాతాళ లోకానికి అణచదొక్కబడ్డ బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని విశ్వసిస్తారు.

తిరువనంతపురం అనేక సంస్థలకు, కార్యాలయాలకు, కళాశాలలు మరియు విద్యాసంస్థలకు నిలయమై ఉంది. ఇక్కడ ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(IIST), విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్(VSSC), ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజెమెంట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్, ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్(ICFOSS), ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(IISER), రీజెనల్ రీసెర్చ్ లేబరేటరీ, శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, మరియు సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ అండ్ ది టెక్నోపార్క్ ఉన్నాయి.

ఇక్కడ ప్రఖ్యాతి గాంచిన పద్మనాభస్వామి ఆలయాన్ని ప్రతిరోజూ అనేకమంది భక్తులు సందర్శిస్తారు. నవరాత్రి మండపం వద్ద ప్రతి సంవత్సరం ఒక సంగీత ఉత్సవం నిర్వహిస్తారు, ఈ ఉత్సవం సరస్వతీ దేవికి అంకితమిస్తారు. సంప్రదాయ నిర్మాణశైలి ఉట్టిపడే కుటీర మాలిక సందర్శనీయమైనది. ఈ నగరం లో మహాత్మా గాంధీ రోడ్ లో సాంప్రదాయ నిర్మాణశైలి కలిగిన అందమైన భవనాలు వరుస కనువిందు చేస్తుంది. ఈ మహాత్మా గాంధీ రోడ్ రెండు పార్శ్వాలు గా కనిపిస్తుంది. ఒకటి పురాతన, రెండు ఇప్పటి భవనాలు. పురాతన భవనాలు ఎర్ర రంగు టైల్స్ మరియు కలప కలిగి ఉంటే, ఇప్పటివి సిమెంట్, గ్లాస్ ఉపయోగించిన ఆకాశహర్మ్యాలు. ఇక్కడ పాలయం మసీదు, పాత గణపతి టెంపుల్, కేథడ్రాల్ చర్చ్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి.

కన్నక్కున్ను ప్యాలెస్ సందర్శకులను ట్రావెన్కూర్ రాజుల కాలానికి తిరిగి తీసుకువెళుతుంది. ఆ ప్యాలెస్ భారీ నిర్మాణశైలి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నేపియర్ మ్యూజియం, శ్రీ చిత్ర ఆర్ట్ గేలరీ సందర్శిస్తే కళాకారుల కళాకౌశలం సందర్శకులను అబ్బురపరుస్తుంది.

కరమణ నదీ తీరం, అక్కులం సరస్సు సుందర నేపధ్య దృశ్యాలు సందర్శకులను కదలనీయవు. తిరువనంతపురం వెళ్ళినపుడు సందర్శకులు నాయర్ డ్యాం, జూలాజికల్ పార్క్, వన్యప్రాణుల అభయారణ్యం మరచిపోకుండా చూడదగ్గ ప్రదేశాలు. కృత్రిమ జీవనం నుండి విరామం తీసుకుని ప్రకృతి ఆరాధన కోసం వచ్చిన సందర్శకులకు ఇక్కడ సంతోషం లభిస్తుంది. అలాగే, తిరువనంతపురం లోని 'హ్యాపీ ల్యాండ్ వాటర్ థీమ్ పార్క్' వయోబేధం లేకుండా సందర్శకులందరినీ అలరిస్తుంది. షాపింగ్ ఇష్టపడే వారికోసం చాలై బజార్ ఉంది.

తిరువనంతపురం కిల్లి మరియు కరమణ నదుల ఒడ్డున ఉంది. ఈ నగరానికి తూర్పున తమిళనాడు, పడమర అరేబియా సముద్రం హద్దులుగా ఉంటాయి. పశ్చిమ కనుమలలో విస్తృత అటవీ పచ్చదనం కలిగి ఉన్న తిరువనంతపురం సందర్శనీయ స్థలాలకు ముఖద్వారం వంటిది.

గోల్డెన్ బీచ్ లు, కొబ్బరి చెట్లతో అలరారే సముద్ర తీరాలు, మంత్రముగ్ధులను చేసే బ్యాక్ వాటర్స్, ఘనమైన వారసత్వ సంపద, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ఇంకా కొన్ని సమీప స్థలాలు సందర్శించడానికి సుదూర ప్రదేశాలనుండి టూరిస్టులు ఇక్కడకు వస్తూంటారు. అగస్త్యకూడం సముద్ర మట్టానికి 1869 మీటర్ల ఎత్తులో తిరువనంతపురం జిల్లాలో ఎత్తైన ప్రదేశం గా ఉంది. పొన్ముడి మరియు ముక్కునిమల హిల్ రిసార్ట్స్ ఈ నగరానికి దగ్గరలో ఉన్నాయి. అందమైన సూర్యోదయాన్ని వీక్షించడానికి తిరువనంతపురానికి తూర్పున ఉన్న పరై కోవిల్ సందర్శించవచ్చు.

వర్షాకాలం లో ఓనం పండుగ సమయం లో తిరువనంతపురం అందంగా అలంకరణ తో కనబడుతుంది. ఆ సమయం లో పండుగ వల్లనైతేనేమి, లేదా ఉత్సాహభారితమైన స్నేక్ బోట్ రేస్ వల్లనైతేనేమి, లేదా ఘనంగా జరిగే ఏనుగుల ఊరేగింపు వల్లనైతేనేమి, జనులంతా ఉత్సాహం గా పండుగ సంబరాలు లో ఉండడం వల్ల ఈ నగరం మునుపటికన్నా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. మొహినీయాట్టం, కధకళి, కూడియాట్టం వంటి కేరళ కళారూపాల ప్రదర్శనలు వీక్షకులను మరో లోకానికి తీసుకువెళ్తాయి.

కేరళ లోని కొన్ని ఇతర ప్రాంతాలలోవలె తిరువనంతపురం కూడా ఏడాది పొడుగునా ఒకేరకమైన ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉండవు. రోడ్డు, రైలు లేదా విమాన మార్గాలతో తిరువనంతపురం చేరుకోవచ్చు. సెలవు దినాలలో తిరువనంతపురం పర్యటనకు ప్లాన్ చేసుకోవచ్చు.

తిరువనంతపురం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరువనంతపురం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరువనంతపురం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరువనంతపురం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం తిరువనంతపురం నుండి అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ,ప్రైవేట్ బస్సులు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం త్రివేండ్రం రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే జంక్షన్. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి రైలు ప్రయాణ సౌకర్యం ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం తిరువంతపురంలో త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది.. ఇది నగరం నుండి 10 కిమీ దూరంలో ఉంది. విమానాశ్రయం భారతదేశం మరియు విదేశాలలో అన్ని ప్రధాన నగరాలకు కలపబడింది. విమానాలు ఎన్నో భారతీయ నగరాలకు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat