సందర్శనకు ఉత్తమ సమయంతోరన్మల్ ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి వుంటుంది. ఐతే, కొండ పైన ఉండడంవల్ల వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ కొండ ప్రాంతాన్ని సందర్శించడానికి వర్షాకాలం తర్వాత సమయం అనుకూలం – అప్పుడు ఇక్కడి జలపాతాలు ఈ దృశ్యం మొత్తాన్ని మరింత రమణీయంగా మార్చి వేస్తాయి.
వేసవిఏప్రిల్ నుంచి జూన్ వరకు వుండే వేసవి కాలం తోరన్మల్ లో చాలా వేడిగా వుంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు, రాత్రి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలకు చేరుకుంటాయి. వేడిని తగ్గించక పోయినా ఈ కాలం అంతా చల్లటి గాలులు వీస్తాయి, ఈ కాలం లో ఇక్కడికి రాకపోవడం మంచిది.
వర్షాకాలంవేసవి తర్వాత తోరన్మల్ వర్షాకాలానికి చేతులు చాచి స్వాగతం పలుకుతుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు వుండే వర్షాకాలంలో ఈ ప్రాంతంలో తగినంత వర్షం కురుస్తుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు భరించగలిగేలా వుంటాయి.
శీతాకాలంఅక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఫిబ్రవరి నెలల్లో శీతాకాలం వుంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలకు మించదు, కనిష్టంగా 12 డిగ్రీల వరకు వుంటుంది. ఈ కాలంలో తేలికపాటి ఉన్ని దుస్తులు లేకుండా తోరన్మల్ వెళ్ళకండి.