సందర్శనకు ఉత్తమ సమయం సంవత్సరంలో అక్టోబర్ నుండి మార్చ్ మధ్య ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ట్రాన్క్యేబార్ సందర్శించడం ఉత్తమం. సంవత్సరంలో ఏ సమయంలో నైనా, ట్రాన్క్యేబార్ వెళ్ళేటపుడు కాటన్ దుస్తులు తీసుకువెళ్లవలసినదిగా సూచన.
వేసవి ట్రాన్క్విబార్ లో వేడి, ఆర్ద్ర ఉష్ణోగ్రతతో ప్రబలమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ వేసవి మార్చ్ నుండి జూన్ సమయాలలో ఉంటుంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత 29 డిగ్రీల నుండి 36 వరకు ఉండి, పగలు భరించలేనిదిగా ఉంటుంది. ఈ సమయంలో ట్రాన్క్విబార్ సందర్శన సరైనది కాదని సూచన.
వర్షాకాలం ట్రాన్క్యేబార్ లో వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ట్రాన్క్యేబార్ కి వర్షాకాలం జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఉంటుంది. అడపా దడపా పడే వర్షాల వల్ల ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలో ఉంటుంది.
శీతాకాలం ఇక్కడ శీతాకాలం అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత సాధారణంగా 25 నుండి 31 డిగ్రీల మధ్య నిలచిఉంతుంది. నిజానికి, ఈ ప్రాంత సందర్శనకు శీతాకాలం సరైనది. చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణంలో సముద్రపు ఒడ్డున పాటలు వినడం కన్నా పర్యాటకులకు అనుభూతి ఏముంటుంది.