Search
  • Follow NativePlanet
Share
» »బాహుబలి షూటింగ్ ప్రదేశాలు !!

బాహుబలి షూటింగ్ ప్రదేశాలు !!

By Staff

బాహుబలి సినిమా జూలై 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి జక్కన్న (రాజమౌళి) తెరకెక్కించినాడు. ఈ చిత్రానికి అయిన ఖర్చు 250 -260 కోట్లు. మొదటి పార్ట్ బాహుబలి - ద బిగినింగ్ గా మనముందు రానే వచ్చింది. రెండవ భాగం బాహుబలి ద కంక్లూషన్ గా ఉండవచ్చని నేననుకుంటున్న. బహుబలి రెండవభాగం 2016 వ సంవత్సరంలో విడుదలకావచ్చు. ఏదేమైతేనేం బాహుబలి మొదటి భాగమే 215 కోట్ల మార్క్ ని దాటి పరుగెడుతుంది.

బాహుబలి మొదటి భాగం షూటింగ్ మన రాష్ట్రం తో పాటుగా భారత దేశంలోని కొన్ని చెప్పుకోదగ్గ ప్రదేశాలలో బ్రహ్మాండంగా జరిగింది. బాహుబలి సినిమాలో జలపాతం సీన్ మనల్ని కట్టిపడేసింది. మరి ఈ జలపాతం గ్రాఫిక్సా లేక నిజంగానే ఉన్నదా అంటే ...

ఓర్వకల్ రాక్ గార్డెన్ - కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

ఓర్వకల్ రాక్ గార్డెన్ - కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు జిల్లా లో ఓర్వకల్ మండలానికి బయట ఉన్న ఓర్వకల్ రాక్ గార్డెన్ భారత దేశంలో ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం ఎందుకంటే ఇది జాతీయ రహదారి నెంబర్ 18 కి ఆనుకొని ఉన్నది. ఇక్కడికి వెళ్ళాలంటే ఓర్వకల్ వరికి బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళవచ్చు లేకుంటే పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, నంద్యాల కు వెళ్లే పల్లె వెలుగు (తెలుగు వెలుగు) బస్సుల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. బహుబలి పార్ట్ 1 ని జూలై 6 2013 వ సంవత్సరంలో కొన్ని రోజులపాటు ఇక్కడ ఉండి చిత్రీకరించారు. ఇక్కడే ఎన్నో సినిమా షూటింగ్ చిత్రీకరిస్తుంటారు. ఉదాహరణకి శుభాస్ చంద్రబోస్ , శంభో శివ శంభో చిత్రాలు ఇక్కడ షూట్ చేసినవే.

Photo Courtesy: Balamurugan Natarajan

పశ్చిమ కనుమల పంక్తి, మహాబలేశ్వర్ - మహారాష్ట్ర

పశ్చిమ కనుమల పంక్తి, మహాబలేశ్వర్ - మహారాష్ట్ర

మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల మహాబలేశ్వర్ ఆకుపచ్చని అడవులతో, పశ్చిమ కనుమల పంక్తులతో, సాహ్యాద్రి పర్వతాల సమూహంతో నిండిన ప్రదేశం. మహాబలేశ్వర్ ప్రదేశంలో బహుబలి సినిమా లోని కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు. వాటిలో తమన్నా స్టార్టింగ్ సీన్ లో పరిగెత్తే సన్నివేశం, అడవిలో ఫైట్ సీన్స్ ఇలా సన్నివేశాలని షూట్ చేశారు.

Photo Courtesy: Aditya Kumar / Bhushan Mate

అతిరాప్పిల్లి జలపాతం , త్రిస్సూర్ - కేరళ

అతిరాప్పిల్లి జలపాతం , త్రిస్సూర్ - కేరళ

అతిరాప్పిల్లి జలపాతం పశ్చిమ కనుమల్లో మొదలవుతున్న చలకుడి నది నుంచి ఆవిర్భవించి కేరళ రాష్ట్రం లో కెల్లా పెద్ద జలపాతంగా పేరుగాంచింది. ఈ బ్రహ్మాండమైన జలపాతానికి భారతదేశపు నయాగరా గా పేరు. ఈ జలపాతం త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకా లో ఉంది. 24 మీటర్ల ఎత్తు నించి జల జల మంటూ పారుతూ కిందన ఉన్న నదిలో కలుస్తుంది. చాలా చోట్లనించి ఈ జలపాతాన్ని చూడవచ్చు. జలపాతం కింద నించి పైకి చూస్తే కిందికి దూకుతున్న నీళ్ళు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి. బహుబలి పార్ట్ 1 ముఖ్య సన్నివేశాలన్ని ఇక్కడే చిత్రీకరించారు. సార్టింగ్ సీన్ లో రమ్యకృష పిల్లాడినీ పట్టుకొని నుంచుంటుందే ఆ సీన్ ... ప్రభాస్ జలపాతం ఎక్కే సీన్ .. అబ్బో ఎన్నో కీలక సన్నివేశాలని ఇక్కడ చిత్రీకరించారు.

Photo Courtesy: Muhammed Riyas

రామోజీఫిల్మ్ సిటీ , హైదరాబాద్ - తెలంగాణ

రామోజీఫిల్మ్ సిటీ , హైదరాబాద్ - తెలంగాణ

రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ ఫిల్మ్ సిటీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నది. ఇక్కడ రొటీన్ గానే ఎన్నో సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. ఇక బాహుబలి విషయానికి వస్తే ఎన్నో సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. బహుబలి రెండవ భాగం సన్నివేశాలని కూడా చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు సెకండ్ ఆఫ్ లో జరిగే యుద్ధం సీన్ రామోజీ ఫిల్మ్ సిటీ వెనకాల ఉన్న మైదానంలో సెట్స్ వేసి మరీ ఇక్కడ చిత్రీకరించారంటే అతిశయోక్తికాదు !!

Photo Courtesy: Himanshu Sarpotdar

మీన బజార్

మీన బజార్

సైన్యం ప్రజలను పన్నుకోసం పీక్కుతినే సన్నివేశాలని కానీ, ఒకవేళ పన్ను కట్టకపోతే అక్కడే విధించే శిక్షలు కానీ అన్ని రామోజీ ఫిల్మ్ సిటీ లోని మీన బజార్ లో చిత్రీకరించారు. భారీ సెట్టింగ్ తో కనిపించే కోట ఈ బజార్ కి కాస్త దూరంలో ప్రస్తుతం ఉన్నది.

Photo Courtesy: DAC 007 / andhra films

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X