Search
  • Follow NativePlanet
Share
» »ధైర్యం టన్నులు టన్నులు ఉంటేనే ఇక్కడికి వెళ్లండి

ధైర్యం టన్నులు టన్నులు ఉంటేనే ఇక్కడికి వెళ్లండి

దండేలి పర్యాటకానికి సంబంధించిన కథనం.

దండేలి. కర్నాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం. సాధారణ పర్యాటక కేంద్రం అనేదానికంటే సాహస క్రీడలంటే ఇష్టమున్నవారికి స్వర్గధామం అంటే సమంజసంగా ఉంటుందేమో? ఎందుకంటే భారత దేశంలో దొరికే దాదాపు అన్నిరకాల సాహజ జలక్రీడలకు ఈ దండేలి నిలయం. రివర్ రాఫ్టింగ్ మొదలుకొని జంగిల్ క్యాంప్, వైల్డ్ లైఫ్ సఫారీ, కయాకింగ్, జంగిల్ క్యాంపెయిన్, కేవింగ్, తెప్పలో ప్రయాణం, రివర్ క్రాసింగ్, మౌంటైన్ బైకింగ్ వంటి అన్నిరకాల సాహస క్రీడలకు ఈ దండేలి నిలయం.

అందువల్లే కేవలం కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది సాహస యాత్రికులు ఇక్కడికి వస్తంుటారు. ముఖ్యంగా యువత వీకెండ్ వచ్చిందంటే దండేలికి చలో చలో అంటూ ఉంటారు. బెంగళూరు నుంచి దండేలికి దాదాపు 460 కిలోమీటర్లు. ప్రయాణ సమయం సుమారు 8 గంటలు. ఇక దండేలి నేచర్ క్యాంప్ లో మనం ముందుగా పేర్లు నమోదు చేసుకొంటే మంచిది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన టూర్ ను ఆనందంగా గడపవచ్చు.

రివర్ రాఫ్టింగ్

రివర్ రాఫ్టింగ్

P.C: You Tube

పర్యాటకుల్లో చాలా మంది రివర్ రాఫ్టింగ్ కోసమే దండేలికి వస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే రివర్ రాఫ్టింగ్ నాలుగు గంటల పాటుసాగుతుంది. ఒక్కక్కరికి మనం ఎంచుకున్న దూరాన్ని అనుసరించి రూ.1000 నుంచి రూ.10వేలు వరకూ ఖర్చవుతుంది.

అడవిలోనే నిద్ర

అడవిలోనే నిద్ర

P.C: You Tube

అడవిలోనే ఓ రాత్రి గడపాలనుకొనేవారికి నిర్వాహకులు అన్ని జాగ్రత్తలతో కూడిన ఏర్పాట్లు చేస్తారు. రోజూ రణగొన ధ్వనుల మధ్య ఉన్న మనం ఒక్కరాత్రి అయినా ప్రక`తితో మమేకం కావడానికి దండేలికి మించిన ప్రదేశం దొరకదు. చల్లగా వీచే చెట్ల గాలులను ఆస్వాదిస్తూ, ఆకాశంలో చుక్కలను లెక్కబెడుతూ నిద్రలోకి జారుకోవడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.

వైల్డ్ లైఫ్ సఫారీ

వైల్డ్ లైఫ్ సఫారీ

P.C: You Tube

దండేలి అభయారణ్యంలో అంతరించే స్థితికి చేరుకున్న జంతువులను ఎన్నింటినో వాటి సహజ వాతావరణంలో చూడవచ్చు. అందువల్లే ప్రక`తిప్రేమికులు ఎక్కువ మంది దండేలికి వచ్చి ఇక్కడి వైల్డ్ లైఫ్ సాంచురీలో సఫారీని ఎంచుకొంటారు. ఉదయం 6 గంటలకు సాయంత్రం 4 గంటలకు సఫారీ అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు గంటల పాటు అడవిలో తిరగడానికి వీలవుతుంది.

కయాకింగ్

కయాకింగ్

P.C: You Tube

జలజల పారే కాళీ నదిలో పడవ ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందని చెప్పడం అతిశయోక్తికాదు. వారంలో ఏడు రోజులూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కయాకింగ్ అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్క ట్రిప్ కు రూ.300 నుంచి రూ.350 ఖర్చువుతుంది.

జంగిల్ క్యాంపెయిన్

జంగిల్ క్యాంపెయిన్

P.C: You Tube

ఒక రాత్రితో పాటు రెండు పగలు అడవిలోనే గడపడమే క్లుప్తంగా జంగిల్ క్యాంపెయిన్. ఉదయం ఫలహారం నుంచి రాత్రి భోజనం వరకూ నిర్వాహకులే చూసుకొంటారు. ఒక్కొక్కరికి రూ.3 వేలు వరకూ ఖర్చవుతుంది. వీటితో పాటు ట్రెక్కింగ్, రివర్ ర్యాఫ్టింగ్ వంటి సాహసక్రీడలకు అవసరమైన ఏర్పాట్లు నిర్వహకులే చూస్తారు. ఇందుకు అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

మౌంటైన్ బైకింగ్

మౌంటైన్ బైకింగ్

P.C: You Tube

దండేలిలో కొత్తగా మౌంటైన్ బైకింగ్ అందుబాటులోకి వచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకొంటూ అడవిలో సైకిల్ పై ప్రయాణమే మౌంటైన్ బైకింగ్. ఒక్కొక్కరికి రూ.400 నుంచి రూ.1000 ఖర్చవుతుంది. ఎంచుకొన్న దూరాన్ని అనుసరించి ఈ ఖర్చు మారుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో గైడ్ మనతో పాటు ప్రయాణం చేస్తాడు.

తెప్పలో ప్రయాణం

తెప్పలో ప్రయాణం

P.C: You Tube

దండేలి వెళ్లినవారు చాలా మంది తెప్పలో ప్రయాణం చేయకుండా తిరిగిరారు. నదిలో గుండ్రంగా తిరిగే తెప్పలో ప్రయాణం చేస్తూ మన వయస్సును కూడా మరిచిపోయి అల్లరి చేస్తాం. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ తెప్పప్రయాణం అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయం గంట నుంచి రెండు గంటలు. ఖర్చు ఒక్కొక్కరికి రూ.100

కేవింగ్

కేవింగ్

P.C: You Tube

దండేలి బేస్ క్యాంప్ కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో కావల గుహలు ఉన్నాయి. ఇక్కడి ప్రక`తి అందాలను చూడాల్సిందే కాని వర్ణించడానికి వీలుకాదు. లైమ్ స్టోన్ తో సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలోపల ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఈ గుహలోపలకు వెళ్లాలంటే దాదాపు 375 మెట్లను ఎక్కిదిగాల్సి ఉంటుంది. వారంలో ఏడు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ గుహలోపలికి అనుమతిస్తారు.

రివర్ క్రాసింగ్

రివర్ క్రాసింగ్

P.C: You Tube

సాహసప్రియులు ఎంతగానో ఇష్టపడే రివర్ క్రాసింగ్ దండేలిలో అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన తాళ్లసహాయంతో కింద జలజలాపారే నదిని దాటడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ఇందుకు శారీరకంగానే కాక మానసిక ద`డత్వం కూడా అవసరం. ఇందుకు దాదాపు గంటల సమయం పడుతుంది.

కుల్గీ నేచర్ క్యాంప్

కుల్గీ నేచర్ క్యాంప్

P.C: You Tube

దండేలికి 12 కిలోమీటర్ల దూరంలో కుల్గీ నేచర్ క్యాంప్ ఉంది. కర్నాటక అటవీశాఖ దీనిని నిర్వహిస్తోంది. ఇక్కడ ఉండటానికి డార్మెట్రీలతో పాటు తినడానికి రుచికరమైన ఆహారం కూడా అందుబాటులో ఉంటుంది. అందువల్ల దండేలికి వచ్చినవారు చాలా వరకూ ఇక్కడ వసతి ఏర్పాట్లను చేసుకొంటారు. వసతిని ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X