Search
  • Follow NativePlanet
Share
» »బ్రిటీష్ వైభవాన్ని అద్భుతంగా చాటి చెప్పే విక్టోరియా మెమోరియల్లో అడుగడుగునా ఓ అద్భుతం..!

బ్రిటీష్ వైభవాన్ని అద్భుతంగా చాటి చెప్పే విక్టోరియా మెమోరియల్లో అడుగడుగునా ఓ అద్భుతం..!

బ్రిటీష్ వైభవాన్ని అద్భుతంగా చాటి చెప్పే విక్టోరియా మెమోరియల్లో అడుగడుగనా ఓ అద్భుతం

కొలకొత్తా రాజకీయంగా, చారిత్రాత్మకంగా ఎంతో పేరుగాంచిన నగరం. భారత దేశాన్ని కొన్ని వందల ఏళ్ల పాటు తమ గుపెట్లో పెట్టుకొన్న బ్రిటీష్ వారు ఒక రకంగా ఈ నగరం నుంచే తమ పరిపాలనసాగించేవారు. ఇందుకు అవసరమైన ఎన్నో భవంతులను నిర్మింపజేసుకొన్నారు. అయితే భారత దేశానికి గణతంత్ర హోదా ఇచ్చి తమ దేశానికి వెళ్లి పోయే సమయంలో ఆ భవంతులను అలాగే వదిలి వెళ్లిపోయారు. వందల ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా గ్రానైట్ నిర్మితమైన ఈ భవనాలు ప్రస్తుతం పర్యాటక కేంద్రాలుగా మారిపోయాయి. అదే విధంగా గంగానదితో పాటు మరొకొన్ని నదులు ఈ నగరం గుండా ప్రవహిస్తూ ప్రకృతి రమణీయతను ఇముడింపజేస్తున్నాయి. కలకత్తాల్లో చెప్పుకోదగ్గ ఎన్న ప్రదేశాలున్నా వాటిలో విక్టోరియా మహాల్ ఒక అద్భుత కట్టడం.

విక్టోరియా మెమోరియల్ (విక్టోరియా మెమోరియల్ హాల్). ఇది 1906 మరియు 1921 మధ్య పశ్చిమ బెంగాల్ లోని కోలకత్తాలో నిర్మించబడిన ఒక పెద్ద పాలరాతి భవనం. ఇది విక్టోరియా రాణి (1819-1901) జ్ఞాపకార్థం నిర్మించి రాణికి అంకితం చేయబడింది.పూర్తిగా తెల్లటి మార్బుల్ తో నిర్మితమైన ఈ భవనం విస్తీర్ణం 57 ఎకరాలు.

ప్రస్తుతం ఇది సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ఒక మ్యూజియం మరియు పర్యాటక ప్రదేశం. ఈ మెమోరియల్ జవహర్ లాల్ నెహ్రూ రోడ్డు సమీపంలో హుగ్లీ నది ఒడ్డు మైదానం(గ్రౌండ్స్)లో ఉంది. ఈ విక్టోరియ మెమోరియల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం...

పునాది రాయి:

పునాది రాయి:

అప్పటి భారత వైశ్రాయ్ లార్డ్ కర్జన్ విక్టోరియా రాణి మరణానికి స్మారకంగా నిర్మించిన ఈ కట్టడం 1901లో ప్రారంభించారు. విక్టోరియా మెమోరియల్ యొక్క పునాది రాయిని 1906 లో వేల్స్ యువరాజు వేశాడు. ఈ మహాల్ నిర్మాణం బ్రిటిష్ వాళ్ళ వైభవాన్ని అద్భుతంగా చాటుతుంటే..మహాల్ లోపల ఉన్న చిత్రాలు..చిహ్నాలు..వస్త్రాలు..ఫిరంగలు..కత్తులు...చూస్తే ఒక్కొక్కటి దేశానికి సంబంధించిన ఒక్కో చారిత్రక సన్నివేశాన్ని గుర్తిచేస్తాయి.

ఏంజెల్ ఆఫ్ విక్టరీ

ఏంజెల్ ఆఫ్ విక్టరీ

విక్టోరియా మెమోరియల్ యొక్క కేంద్ర గోపురంపై 'ఏంజెల్ ఆఫ్ విక్టరీ' బొమ్మను ఏర్పాటు చేశారు. పెద్ద బాల్ బేరింగ్లపై అమర్చబడిన ఈ బొమ్మ గాలిలో తిరుగుతుంటుంది.

PC: Samitkumarsinha

డోమ్ చుట్టూ ఉన్న శిల్పాలు

డోమ్ చుట్టూ ఉన్న శిల్పాలు

గోపురంపై సెంట్రల్ డోమ్ చుట్టూ వాస్తుశిల్పం, కళ, దాతృత్వం, న్యాయం, మాతృత్వం, అభ్యాసం మరియు వివేకం వంటి అనేక ఉపమాన శిల్పాలు ఉన్నాయి. దాదాపు ఆరు శతాబ్దాల అఖండ భారత చరిత్రను విక్టోరియా మహాల్ తన గోడలపై లించుకున్నట్లు కనబడుతుంది. ఈ మహాల్ ను సందర్శించడం అంత సులువైన పని కాదు, ఒక్క రోజూలో చూడలేం. ఇక్కడ ప్రతి అంశాన్ని మనస్సుతో చూడాలి. అప్పుడే ప్రతి చిత్రం మనతో మాట్లాడుతుంది.

PC: Ketanmehta4u

తాజ్ మహాల్ ను పోలి ఉండటం :

తాజ్ మహాల్ ను పోలి ఉండటం :

ప్రముఖ ఆర్కిటెక్ట్ సర్ విలియం ఎమర్సన్ బ్రిటీష్ మరియు మొగల్ ఆర్కిటెక్ట్ స్టైల్లో నిర్మించారు. ఇది చూడటానికి ఇండో సెరసినిక్ రూపంలో ఒక రకంగా తాజ్ మహాల్ ను పోలినట్టుగా తెల్లని రాతితో నిర్మించారు. చూడటానికి తాజ్ మహాల్ వలె ఉండే ఈ విక్టోరియా మహాల్ ను కూడా మాకరానా తెల్లని పాలరాయిని ఉపయోగించి నిర్మించడం జరిగింది. నిర్మాణం యొక్క గోపురం మరియు ఇతర నిర్మాణ అంశాలు కూడా తాజ్ మహల్ రూపకల్పనను ప్రతిధ్వనిస్తాయి. 1906 జనవరి 4న శంకుస్థాపన జరిగిన ఈ భవన నిర్మాణం మొత్తం కోటీ ఐదు లక్షల రూపాయలతో 1921 వరకు సాగింది. 1921లో ప్రజల కోసం దీన్ని తెరిచారు. దీని నిర్మాణం మధ్యలో ఉండగానే కింగ్ జార్జ్ 5 భారత రాజధానినిని కలకత్తా నుండి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించాడు.

PC: CHINMOY BISWAS

విక్టోరియా మెమోరియల్ వద్ద గ్యాలరీలు విక్టోరియా

విక్టోరియా మెమోరియల్ వద్ద గ్యాలరీలు విక్టోరియా

మెమోరియల్‌లో 25 గ్యాలరీలు ఉన్నాయి. ఇందులో దాదాపు 20 వేల వరకూ వివిధ రకాల పెయింటింగ్స్ ఉంటాయి. గ్యాలరీలలో శిల్పకళా గ్యాలరీ, రాయల్ గ్యాలరీ, సెంట్రల్ హాల్, పోర్ట్రెయిట్ గ్యాలరీ, ఆయుధాలు మరియు ఆయుధాల గ్యాలరీ మరియు కలకత్తా గ్యాలరీ ఉన్నాయి. మ్యూజియం యొక్క ఇతర ప్రదర్శనలలో నాణేలు, స్టాంపులు మరియు ఆ కాలపు పటాలు ఉన్నాయి.

ప్రెసిడెన్సీ జైలు మొదటి స్థానం

ప్రెసిడెన్సీ జైలు మొదటి స్థానం

విక్టోరియా మెమోరియల్ నిర్మించటానికి ముందు, ఈ ప్రదేశంలో ప్రెసిడెన్సీ జైలు ఉండేది, తరువాత అక్కడ విక్టోరియ రాణి స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ప్రెసిడెన్సీ జైలుని కూల్చివేసి అలిపూర్‌కు మార్చారు.

PC: Shirish Mulmuley

భారత ప్రజల నిధులు

భారత ప్రజల నిధులు

ఈ భారీ నిర్మాణానికి భారతీయుల వద్ద నుండి నిధులు సమకూర్చారు. దేశం నలుమూలల నుండి విరాళాలు ఇవ్వబడ్డాయి మరియు సేకరించిన మొత్తాన్ని ఈ అద్భుతమైన స్మారక నిర్మాణానికి ఉపయోగించారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ నిర్మాణానికి కొంత నిధులు సమకూర్చింది.

PC: Bernard Gagnon

డీకోలనైజేషన్‌

డీకోలనైజేషన్‌

1947 తరువాత డీకోలనైజేషన్‌లో భాగంగా, భారతదేశం అంతటా బ్రిటిష్ వారు నిర్మించిన అనేక విగ్రహాలను తొలగించారు, వాటి స్థానంలో భారతీయ వాటిని ఉంచారు లేదా విక్టోరియా మెమోరియల్ తోటకి తరలించారు. ఇక్కడ ఉద్యానవనాల్లో వివిధ ఆకారాల్లోని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందమైన తోటలతో.. విశాలమైన మైదానాలతో.. సరస్సులతో ఉంటుంది. విక్టోరియా మ్యూజియం ఎన్నో చారిత్రక అవశేషాలు, అరుదైన చిత్రాలు, పెయింటింగ్స్, పుస్తకాలు, ఆయుధాలు ఉన్నాయి.

గేట్ దగ్గర

గేట్ దగ్గర

గేట్ దగ్గర, మీరు "విఆర్ఐ" వ్రాసినట్లు చూడవచ్చు, ఇది బహుశా విక్టోరియా రెజీనా ఇంపెట్రిక్స్, 'విక్టోరియా క్వీన్ అండ్ ఎంప్రెస్' అని అర్థం తెలుపుతుంది.

Photo Courtesy : en.wikipedia.org

గేట్ దగ్గర

గేట్ దగ్గర

ఇంగ్లాండ్ రాణి అయిన విక్టోరియా భారత సామ్రాజ్ఞి అని దీని అర్థం. స్మారక ప్రవేశద్వారం పైన వ్రాసిన 'డైయు ఎట్ మోన్ డ్రాయిట్' మరొక చమత్కారమైన రచన. ఇది 'దేవుడు మరియు నా హక్కు' అనే అర్థాన్నిస్తుంది. ఇది రాజుకు పాలించే హక్కుకు సూచన కావచ్చు.

PC:wikimedia.org

సందర్శనా సమయం.... ఆ

సందర్శనా సమయం.... ఆ

ప్యాలెస్ ను సందర్శించాలనుకునేవారికి విడివిడిగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

గార్డెన్ ప్రవేశ టికెట్ ధర పది రూపాయలు ఉంటే మ్యూజియం సందర్శనకు ప్రవేశ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. గార్డెన్ ప్రవేశ టికెట్ ధర పది రూపాయలు ఉంటే మ్యూజియం సందర్శనకు ప్రవేశటికెట్ రూ.30. ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మ్యూజియం మూసి ఉంటుంది. విక్టోరియా మెమోరియల్ ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు తెరిచి ఉంటుంది.

రవీంద్రసదన్ మెట్రో స్టేషన్ కు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ అద్భుత కట్టడాన్ని ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X