Search
  • Follow NativePlanet
Share
» »"కోటి" దేవతల కొండ అద్భుత రహస్యం మీకు తెలుసా?

"కోటి" దేవతల కొండ అద్భుత రహస్యం మీకు తెలుసా?

ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థమట. పురాణకధ ప్రకారమే ఈ పేరొచ్చింది.అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండకే చెక్కిన వేలాది విగ్రహాలు భలే కనువిందు చేస్తాయి.

By Venkata Karunasri Nalluru

అమ్మో కోటిమంది దేవతలున్నారా? అసలీకొండకు ఆపేరేలా వచ్చింది? ఒకసారి తెలుసుకుందాం.

ఒక సారి శివుడు కోటిదేవతలను వెంటబెట్టుకుని కాశీకి ప్రయాణమయ్యాడు.మధ్యలో చీకటి పడగానే దేవతలంతా ఒకచోట పడుకున్నారు.మర్నాడు సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేవాలని శివుడు ఆజ్ఞాపించాడు.కానీ ఉదయాన్నే చూసేసరికి తనొక్కడూ తప్ప ఎవరూ నిద్రలేవకపోవడంతో శంకరుడికి కోపం వచ్చి వెంటనే మీరంతా శిలలుగా మారిపోండి అని శపించాడు.అలా ఒకరు తక్కువ కోటిమంది విగ్రహాలుగా మారిపోయారు.ఈ దేవతల విగ్రహాల్ని మీకు చూడాలనుంటే త్రిపురలోని అగర్తలా దగ్గరున్న ఉనకోటి పర్వతాల దగ్గరకెళ్ళాల్సిందే.

కోటి దేవతల కొండ

ప్రతీసంవత్సరం ఏప్రెల్ నెలలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.వేలాదిమంది భక్తులు ఈ కొండల పైకొచ్చి దేవతలని దర్శించుకుంటారు.ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్థమట.
పురాణకధ ప్రకారమే ఈ పేరొచ్చింది.అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండకే చెక్కిన వేలాది విగ్రహాలు భలే కనువిందు చేస్తాయి.వీటిల్లో పదడుగుల రూపాల్నుంచి 50 అడుగుల ఎత్తైన ఆకారాల వరకు వున్నాయి.మనం పూజించే దుర్గ, పార్వతి, భైరవుడు,దేవతల వాహనాలైన సింహం, నంది,పులి ఇలా ఇక్కడున్న ప్రతీ కొండ విగ్రహాలతో నిండి అబ్బురపరుస్తుంది.ఈ విగ్రహాలపై పరిశోధనలు చేస్తే ఇవి 7 నుంచి 12 వ శతాబ్దంలో చెక్కినవని తెలుస్తుంది.ఆశ్చర్యపోతున్నారు కదూ!

కోటి దేవతలు కొలువుతీరిన కొండ

1. ఉనా కోటి

1. ఉనా కోటి

చూస్తున్నారుగా ఈ ప్రాంతంలో మీరెటువైపు చూసినా ఏ కొండపైన చూసినా మీకు శిల్పాలే దర్శనమిస్తాయి.చిన్నరాయిని, రాప్పని కూడా వదలలేదు. ప్రతీదాని పైన శిల్పాలు చెక్కబడే వుంటాయి.
ఈ శిల్పాలపై రీసెర్చ్ జరిగిన తర్వాత అవి మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే ఒకటి తక్కువ కోటివరకు వున్నాయంట.అందుకే ఈ ప్రాంతానికి ఉనాకోటి అంటారు. ఉనాకోటి అంటే అక్కడి భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం.

pc:Atudu

2. అంచనా

2. అంచనా

ఈ శిల్పాలన్నీ సుమారుగా అక్కడ 8 లేదా 7 వ శతాబ్దంలో చేక్కివుంటారని ఒక అంచనాగా చెపుతున్నారు. అవి ఎందుకక్కడ చెక్కారో? ఏ సందర్భంలో చెక్కారో?ఎవరు చెక్కించారో?అనే దాని గురించి స్పష్టంగా అక్కడ ఏ వివరణా తెలీటం లేదు.ఈ ప్రాంతం మన భారతదేశంలోని త్రిపురలోని అగర్తకు 170కి.మీ ల దూరంలో అటవీప్రాంతంలో వుంది.

pc:Bodhisattwa

3. పూజలు

3. పూజలు

ఈ కొండపైన వున్న విగ్రహాలకి, అక్కడ వుండే శివుని విగ్రహానికి చాలామంది వచ్చి పూజలు చేస్తూవుంటారు.అక్కడ మీరు ఏ కాలంలో వెళ్ళినా ఆ శివుని విగ్రహం దగ్గర పూజారులు పూజచేయటానికి కనిపిస్తూనే వుంటారు.

pc:Sinjinirx

4. కొండలపైనుంచి వచ్చే నీరు

4. కొండలపైనుంచి వచ్చే నీరు

ఆ ప్రాంతంలో వినాయకుని విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా వుంటుంది.వర్షాకాలంలో కొండలపైనుంచి వచ్చే నీరు ఆ విగ్రహాలపై నుంచి కిందకు పడుతూవుంటాయి.అలాగే ఒక కొండరాతిపైనయితే పెద్ద దేవి విగ్రహం చేసివుంటుంది.ఇది ఎంత దూరం నుంచి చూసినా మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

pc:Bodhisattwa

5.విగ్రహాలు

5.విగ్రహాలు

ఈ కొండలపైన జంతువుల యొక్క విగ్రహాలు ఇలా చాలా మీకు దర్శనమిస్తూవుంటాయి.అంత పెద్దగా వుండే ఆ విగ్రహాలన్నింటినీ చూసి మీరు ఎంతో ఆశ్చర్యానికి గురౌతారు.వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఈ ప్రదేశానికొచ్చి ఇక్కడ విగ్రహాలన్నీ చూసి తరించి పూజలు చేసి వెళ్తుంటారు.

pc:Atudu

6.పురాణగాథలు

6.పురాణగాథలు

చాలా ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి కొన్ని కథలు, పురాణగాథలు ఉన్నట్లే ఈ ప్రాంతానికి కూడా వున్నాయి. పూర్వకాలంలో ఇక్కడ కల్లుకుమార్ అనే ఒక ప్రఖ్యాత శిల్పకారుడుండేవాడంట.అతడు ఎంతో శివభక్తుడంట.కైలాసానికి వెళ్లి శివుడిని,పార్వతిని కళ్ళారా చూసి తరించాలని ఎంతో ఆశపడ్డాడంట.

pc:Shubham2712

7. కల్లుకుమార్

7. కల్లుకుమార్

ఒకరోజు తనకి శివపార్వతులు తన కలలో కన్పించగా తన కోరికను ఆ దేవతలకి కల్లుకుమార్ తెలియచేసాడంట.దానితో పార్వతీదేవి అతనికి ఒక షరతు విధించిందంట.రేపుదయం తెల్లారేటప్పటికంతా వూరి చివర కొండపైన నువ్వు కోటి శిల్పాలని గానీ చెక్కినట్లయితే తమతోపాటు తనని కూడా కైలాసానికి తీసుకువెళ్తానని ఆ పార్వతీ దేవి కల్లుకుమార్ అనే శివునికి షరతు విధించిందంట.

pc:GK Dutta

8.సూర్యోదయం

8.సూర్యోదయం

దానికి వెంటనే ఒప్పుకుని కల్లుకుమార్ ఆ కొండపైన వున్న ప్రతీ రాతి పైన ఆ రోజంతా చేక్కుతునే ఉన్నాడంట.తీరా సూర్యోదయమవుతున్నప్పటి కల్లా ఒకటి తక్కువ కోటి శిల్పాలను చెక్కాడంట కానీ ఆఖరి శిల్పం చెక్కుతున్నప్పుడు అతనికి నేనిన్ని శిల్పాలను చెక్కాను కదా!

pc:Atudu

9.పార్వతీపరమేశ్వరులు

9.పార్వతీపరమేశ్వరులు

నీనెంతో గొప్ప అనే అహంకారమొచ్చి అక్కడ దేవతా శిల్పాలకు బదులుగా తన ఆకృతిని పోలివుండే శిల్పాన్ని చెక్కుతుండగా,పార్వతీదేవి విధించిన షరతును మితిమీరడంతో అతని నిబంధన కాస్త పోయి పార్వతీపరమేశ్వరులు అతనికి కనిపించకుండా కైలాసానికి వెళ్ళిపోయారంట.

pc:Scorpian ad

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X