Search
  • Follow NativePlanet
Share
» »ఒరిస్సా లో తప్పక సందర్శించవలసిన 10 బీచ్ లు !

ఒరిస్సా లో తప్పక సందర్శించవలసిన 10 బీచ్ లు !

By Mohammad

బీచ్ .. ఎండాకాలంలో వీటికున్న క్రేజ్ ఓ పట్టానపోదు. సాయంత్రం తీరం వెంబడి వీచే పిల్ల గాలులు, అటు - పొట్ల తో శబ్దం చేస్తూ మీదకు దూసుకొచ్చే సముద్ర ప్రవాహాలు, గచ్చికాయలు, వేయించిన పల్లీలు, ఉడుకుడుకు శనగలు అబ్బా ..!! నోరూరుతుంది కదా ! అసలు ఆ చిరుతిండ్లు ఎత్తడమే తప్పు.

పర్యాటకులు చాలా వరకు వైజాగ్, చెన్నై, గోవా, మంగళూరు, కొచ్చి, త్రివేండ్రం, కన్యాకుమారి ఇలా ప్రసిద్ధమైన బీచ్ లను సందర్శించి ఉంటారు కానీ భారత దేశానికి తూర్పున ఉన్న ఒరిస్సా సంగతి మీరెప్పుడైనా ఆలోచించారా ? అసలు అటువైపు ఎప్పుడైనా వెళ్ళారా ? ఒరిస్సా లోని బీచ్ లను చాలా కొద్ది మంది మాత్రమే తరచూ సందర్శిస్తుంటారు. అది కూడా ఆ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వాళ్లకి మనకంటే కొద్దో గిప్పో ఐడియా ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఒరిస్సా రాష్ట్రం - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

ఇక్కడ చెప్పుకోదగ్గ బీచ్ పూరీ బీచ్. తరచూ పేపర్లో, అడపా దడపా సోషల్ మీడియాలో దీని గురించి చదువుతుంటారు. కేవలం ఇదొక్క బీచే కాదు ఒరిస్సా లో ఉండేది, చాలానే బీచ్ లు ఒరిస్సా సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. అవేంటో .. అక్కడికి చేరుకోవటం ఎలాగో ఒక లుక్ వేద్దాం పదండి.

రుషికుల్య బీచ్

రుషికుల్య బీచ్

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

సమీప విమానాశ్రయం - భువనేశ్వర్ విమానాశ్రయం (140 కి. మీ)

రైలు మార్గం

సమీప రైల్వే స్టేషన్ - గంజాం రైల్వే స్టేషన్

బస్సు మార్గం

గంజాం, భువనేశ్వర్ మరియు రాష్ట్రంలోని తదితర పట్టణాల నుండి రుషికుల్య కు బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : Swagat Rath

రుషికుల్య బీచ్

రుషికుల్య బీచ్

రుషికుల్య బీచ్ పర్యాటకులకు సూచించదగ్గ ఒక ఫేమస్ టూరిస్ట్ ప్రదేశం. ఇది గంజాం జిల్లా చిల్కా సరస్సుకు అతి చేరువలో ఉంటుంది. బీచ్ వద్ద నీలి రంగులో కనిపించే సముద్ర నీళ్ళు, మట్టి వాసన, ఆహ్లాదకరమైన వాతావరణం, తాబేళ్లు గమనించవచ్చు. రుషికుల్య బీచ్ కు పర్యాటకులు తక్కవగా వస్తుంటారు కనుక మీ ప్రైవసీ కి ఎటువంటి ఢోకా ఉండదు.

చిత్ర కృప : Ar.Shakti Nanda

అస్తరంగ బీచ్

అస్తరంగ బీచ్

ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - భువనేశ్వర్ విమానాశ్రయం

సమీప రైల్వే స్టేషన్ - పూరీ, భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లు

బస్సు / రోడ్డు మార్గం - భువనేశ్వర్, పూరీ, కోణార్క్ ల నుండి బీచ్ కు బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : An!rudhTM♀ Photography

అస్తరంగ బీచ్

అస్తరంగ బీచ్

అస్తరంగ బీచ్ కోణార్క్ ప్రధాన ఆలయానికి సమీపాన ఉన్నది(19 కి. మీ). అద్భుతమైన దృశ్యాలకు ఈ బీచ్ ప్రసిద్ధి చెందినది. సూర్యోదయం, సూర్యాస్తమం పర్యాటకులను అమిత ఆనందాన్ని కలిగిస్తాయి. చేపలు పట్టడం, ఉప్పు ఉత్పత్తి వంటి రోజువారి కార్యక్రమాలు బీచ్ వద్ద సందడి చేస్తుంటాయి.

చిత్ర కృప : Ar.Shakti Nanda

చాందీపూర్ బీచ్

చాందీపూర్ బీచ్

చాందీపూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

సమీప విమానాశ్రయం - భువనేశ్వర్ విమానాశ్రయం ( 230 కి. మీ)

రైలు మార్గం

సమీప రైల్వే స్టేషన్ - బలేశ్వర్ రైల్వే జంక్షన్ ( 16 కి. మీ)

రోడ్డు / బస్సు మార్గం

పశ్చిమ బెంగాల్, ఒరిస్సా లోని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చాందీపూర్ కు ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : sumita sarkar

చాందీపూర్ బీచ్

చాందీపూర్ బీచ్

చాందీపూర్ ఒరిస్సా లోని ఒక బీచ్ రిసార్ట్. నిమిషంలో నీరు తగ్గుముఖం పట్టటం, మరో నిమిషంలో ఆ నీరు పెద్ద మొత్తంలో నిండిపోవటం బీచ్ ప్రకృతి అద్భుతాలలో ఒకటి. ఈ బీచ్ లో కనిపించే ఇసుక దిబ్బలు, కాసువరినా చెట్లు ఈ బీచ్ ను మరింత ఆకర్షనీయంగా మార్చేశాయి.

చిత్ర కృప : Ar.Shakti Nanda

గోపాల్పూర్ బీచ్

గోపాల్పూర్ బీచ్

విమాన మార్గం

సమీప విమానాశ్రయం - భువనేశ్వర్ విమానాశ్రయం ( 165 కి. మీ)

రైలు మార్గం

సమీప రైల్వే స్టేషన్ - బెర్హంపూర్ రైల్వే స్టేషన్ ( 16 కి. మీ)

రోడ్డు / బస్సు మార్గం

పశ్చిమ బెంగాల్, ఒరిస్సా లోని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి గోపాల్పూర్ కు ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Nayansatya

గోపాల్పూర్ బీచ్

గోపాల్పూర్ బీచ్

సెలవుల్లో కుటుంబంతో, స్నేహితులతో చూడదగ్గ ప్రదేశం గోపాల్పూర్ బీచ్. బీచ్ లో సముద్ర స్నానాలు చేయటం, వినోద క్రీడలు ఆడటం సందర్శకులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. సాయంత్రం పూట కొబారి నీళ్ళు తాగుతూ సూర్యాస్తమ దృశ్యాలను తిలకించవచ్చు. ఇప్పటికీ నావికులకు దారిచూపే లైట్ హౌస్ కలదు. సమీపాన సోనెపూర్ బీచ్ కూడా తప్పక సందర్శించదగినది.

చిత్ర కృప : Siddhartha Sen

సోనెపూర్ బీచ్

సోనెపూర్ బీచ్

సోనెపూర్ బీచ్ మాన నాగరికతతో సంబంధం లేని ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఒరిస్సా లోని గంజాం జిల్లాకి మరియు మన రాష్ట్రానికి ఈ బీచ్ సరిహద్దుగా ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం పర్యాటకులు కూడా ఈ బీచ్ ను సందర్శిస్తుంటారు. బీచ్ ఒడ్డున గుర్రపు స్వారీ, మోటార్ బోట్ లలో విహారం సూచించదగినది.

చిత్ర కృప : Ankur Goel

పరదీప్ బీచ్

పరదీప్ బీచ్

విమాన మార్గం

సమీప విమానాశ్రయం - భువనేశ్వర్ విమానాశ్రయం (109 కి. మీ)

రైలు మార్గం

సమీప రైల్వే స్టేషన్ - కటక్ రైల్వే స్టేషన్ ( 94 కి. మీ)

రోడ్డు / బస్సు మార్గం

భువనేశ్వర్, గోపాల్పూర్, కటక్, పూరీ తదితర పట్టణాల నుండి పరదీప్ కు ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Jnanaranjan sahu

పరదీప్ బీచ్

పరదీప్ బీచ్

పరదీప్ బీచ్ వద్ద మహానది బంగాళాఖాతం లో కలుస్తుంది. స్పష్టమైన నీలిరంగు నీళ్ళు, బీచ్ పక్కన ఉన్న రాళ్ళు, చుట్టూ పచ్చదనం, అద్భుతమైన సముద్ర ప్రవాహాలు వంటి దృశ్యాలు ఖచ్చితంగా పర్యాటకుల దృష్టిని ఇట్టే కట్టిపడేస్తాయి. బీచ్ కు వచ్చే వారు 'తులసి క్షేత్ర' కుటుంబం తో కలిసి చూడవచ్చు.

చిత్ర కృప : Ar.Shakti Nanda

పూరీ బీచ్

పూరీ బీచ్

పూరీ చుట్టుపక్కల మూడు బీచ్ లు ఉన్నాయి. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

విమానశ్రయం

పూరీకి సమీపాన కేవలం 56 కి. మీ ల దూరంలో భువనేశ్వర్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి పూరీ చేరుకోవచ్చు.

రైల్వే స్టేషన్

పూరీ లో రైల్వే స్టేషన్ ఉన్నది. గౌహతీ, కలకత్తా, వైజాగ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల నుండి ఈ స్టేషన్ మీదుగా రైళ్ళు నడుస్తుంటాయి

బస్సు / రోడ్డు మర్గం

భువనేశ్వర్ నుండి గంట గంట కు ప్రభుత్వ బస్సులు నడుస్తాయి. ఆలాగే సమీప ప్రాంతాల నుండి కూడా ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.

చిత్ర కృప : Swagat Rath

పూరీ బీచ్

పూరీ బీచ్

పూరీ రైల్వే స్టేషన్ కు 2 కి. మీ ల దూరంలో పూరీ బీచ్ కలదు. ముదురు బంగారు ఇసుక బీచ్ లో సముద్రం, ఆహ్లాదకరమైన గాలి, స్పష్టమైన మెరిసే నీరు మరియు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం యొక్క వీక్షణ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. సంవత్సరానికి ఒకసారి జరిగే పూరీ బీచ్ ఫెస్టివల్ నాడు పర్యాకులు అధిక సంఖ్యలో వచ్చి, ఇసుక తో చేసే కళాఖండాలను తిలకిస్తుంటారు.

చిత్ర కృప : Ar.Shakti Nanda Follow

చంద్రభాగ్ బీచ్ / కోణార్క్ బీచ్

చంద్రభాగ్ బీచ్ / కోణార్క్ బీచ్

చంద్రభాగ్ బీచ్ కోణార్క్ సూర్య దేవాలయానికి కేవలం 3 కి మీ ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ వద్ద బోటింగ్, వాకింగ్ చేయవచ్చు మరియు ఈత(లోతు వెళ్ళకూడదు సుమీ ..!) కొట్టవచ్చు. కాంతిలోలికే లైట్ హౌస్ కూడా చూడదగినదే ..!

చిత్ర కృప : Charukesi

బలిఘి బీచ్

బలిఘి బీచ్

బలిఘి బీచ్ పూరీ కోణార్క్ వెళ్ళే మార్గంలో, పూరీ నుండి సరాసరి 8 కి. మీ ల దూరంలో ఉన్నది. ఇక్కడ బీచ్ చేసే ఘోష తప్పక వినాల్సిందే . సన్ బాతింగ్, బోటు రైడింగ్, ఈత ఇక్కడ సూచించదగినది.

చిత్ర కృప : Ar.Shakti Nanda

రాంచాందీ బీచ్

రాంచాందీ బీచ్

ఒరిస్సా లో ప్రవహించే కుషభద్ర నది బంగాళాఖాతంలో కలిసే చోట రాంచాందీ బీచ్ కలదు. పర్యాటకులకు ఇదొక చక్కటి పిక్నిక్ ప్రదేశం. సముద్ర తీర ఒడ్డున కొబ్బరి చెట్లు, అద్భుతమైన ప్రకృతి, చల్లగా వీచే గాలులు, చల్లని ఇసుక దిబ్బలు ఈ బీచ్ ను మరింత అందంగా మార్చేశాయి.

చిత్ర కృప : Supratim Das

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X