Search
  • Follow NativePlanet
Share
» » ఈ మార్గాల్లో బైక్ పై రయ్..రయ్..ర...య్యో..ర...య్..య్..ర..య్

ఈ మార్గాల్లో బైక్ పై రయ్..రయ్..ర...య్యో..ర...య్..య్..ర..య్

బైక్ పై వెలుతూ చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం.

ఒంటిరిగా లేదా స్నేహితులతో కలిసి బైక్ పై ప్రయాణం మంచి అనుభూతిని మిగిలుస్తుంది. ముఖ్యంగా వారాంతాల్లో యువత ఇటీవల బైక్ పై ప్రయాణాలను బాగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చిపట చినుకులు పడే ఈ వర్షాకాలంలో వానలో కొంత దూరం తడుస్తూ ప్రయాణం చేయడం, కనుచూపుమేర ఉన్న పచ్చదనాన్ని ఆస్వాధించడం కోసం తహతహ లాడుతున్నారు.

ఇందు కోసం ప్రయాణించే మార్గంతో మాటు ఆ మార్గంలో ఉన్న వసతులను పరిగణనలోకి తీసుకొని తమ బైక్ ట్రిప్ ను ఎంపిక చేసుకొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో బైకర్స్ కు అనుకూలమైన పర్యాటక మార్గాల్లో అత్యుత్తమమైనవి ఎంపిక చేసి మీ కోసం అందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం చదివి రానున్న వీక్ ఎండ్ లో మీ బైక్ ను వీటిలో ఏదో ఒక మార్గంలో ప్రయాణింప చేయండి.

ముంబై నుంచి పూనే మీదుగా మల్షీద్

ముంబై నుంచి పూనే మీదుగా మల్షీద్

P.C: You Tube

మల్షీద్ లో ఒక వైపున జలపాతాలు కనువిందును కలిగిస్తూ ఉంటే మరోవైపు చరిత్రకు సజీవసాక్షాలైన కోటలు రారమ్మని పిలుస్తాయి. అందువల్లే యువత వారాంతాల్లో ఇక్కడికి తమ బైకులతో క్యూ కడుతారు.

మొత్తం దూరం.....130 కిలోమీటర్లు

సమయం....3 నుంచి 4 గంటలు

నేషనల్ హైవే...ఎన్ హెచ్ 50, ఎన్ హెచ్ 3, ఎన్ హెచ్ 222

ముంబై నుంచి గోవా

ముంబై నుంచి గోవా

P.C: You Tube

బైక్ రైడర్స్ కు ముంబై నుంచి గోవా ప్రయాణం చాలా హాయిని ఇస్తుంది. ఇక్కడ కుదుపులు లేని ప్రయాణం ఇందుకు కారణం. మార్గమధ్యలో ఎన్నో అద్భుతమైన పర్యాటక కేంద్రాలను చూడవచ్చు.

మొత్తం దూరం.....587 కిలోమీటర్లు

సమయం....10 గంటలు

నేషనల్ హైవే...ఎన్ హెచ్ 47

ఈస్ట్ కోస్ట్ రోడ్

ఈస్ట్ కోస్ట్ రోడ్

P.C: You Tube

చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్లే వారు ఈ ఈస్ట్ కోస్ట్ రోడ్ నే ఎంచుకొంటారు. ముఖ్యంగా చిన్నని చినుకులు పడే సమయంలో రోడ్డు మీద ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

మొత్తం దూరం.....160 కిలోమీటర్లు

సమయం.... 3 గంటలు

నేషనల్ హైవే...ఎస్ హెచ్ 49

ఉదయ్ పూర్ నుంచి మౌంట్ అబు

ఉదయ్ పూర్ నుంచి మౌంట్ అబు

P.C: You Tube

రాజస్థాన్ లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబుకు రోడ్డు మార్గం ద్వారా బైక్ పై వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వారాంతాల్లో ఉదయ్ పూర్ నుంచి ఇక్కడికి వెళ్లడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతారు.

మొత్తం దూరం.....161 కిలోమీటర్లు

సమయం.... 4 గంటలు

నేషనల్ హైవే...ఎన్ హెచ్ 76

కార్వార్ నుంచి మంగళూర్

కార్వార్ నుంచి మంగళూర్

P.C: You Tube

నది మీద కట్టిన వంతన పై పిల్ల గాలులు వీస్తున్న సమయంలో మనకు ఇష్టమైన బైక్ పై వెలుతుంటే ఆ ఆనందమే వీరు. అదే సమయంలో చిరు జల్లులు మొహానికి తాకుతూ ఉంటే ఆ ఆహ్లాదం రెట్టింపవుతుందడంలో సందేమం ఏముంటుంది. ఇటువంటి క్షణాలను ఆస్వాధించడానికి మీ బైక్ ను కార్వార్ నుంచి మంగళూర్ వైపుకు ప్రయాణం చేయించండి
మొత్తం దూరం.....270 కిలోమీటర్లు

సమయం.... 5 గంటలు

నేషనల్ హైవే...ఎన్ హెచ్ 17

బెంగళూరు నుంచి కూర్గ్

బెంగళూరు నుంచి కూర్గ్

P.C: You Tube

వర్షాకాలం సమయంలో కూర్గ్ ప్రాంతం పచ్చటి తివాచి పరిచినట్లు ఉంటుంది. ఉద్యాన నగరి నుంచి కూర్గ్ ప్రయాణం ప్రక`తితో మమేకం కావడమే. ఇక్కడ కొండ చర్యలతో కొంత జాగ్రత్తగా ఉండాలి.

మొత్తం దూరం.....268 కిలోమీటర్లు

సమయం.... 5 గంటలు

నేషనల్ హైవే...ఎన్ హెచ్ 48, ఎన్ హెచ్ 209, ఎన్ హెచ్ 275

షిల్లాంగ్ నుంచి చిరపుంజి

షిల్లాంగ్ నుంచి చిరపుంజి

P.C: You Tube

షిల్లాంగ్ నుంచి చిరపుంజి రోడ్ ట్రిప్ అంతగా ప్రాచూర్యం పొందకపోయినా ఈ మార్గంలో ప్రయాణానికి యువత ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతంగా చిరపుంజికి పేరున్న విషయం తెలిసిందే.

మొత్తం దూరం.....54 కిలోమీటర్లు

సమయం.... 1 నుంచి గంటలు

నేషనల్ హైవే...ఎన్ హెచ్ 40, ఎస్ హెచ్ 5

హైదరాబాద్ నుంచి తిరుపతి

హైదరాబాద్ నుంచి తిరుపతి

P.C: You Tube

హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణం కొంత వరకూ నల్లమలా అడువుల గుండా సాగుతుంది. చుట్టూ పచ్చని చెట్లను చూస్తూ గమ్యం వైపు రయ్ మంటూ దూసుకొని పోవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


మొత్తం దూరం.....347 కిలోమీటర్లు

సమయం.... 5 నుంచి 6 నుంచి గంటలు

నేషనల్ హైవే... స్టేట్ హైవే

డార్జిలింగ్ నుంచి గ్యాంగ్ టక్

డార్జిలింగ్ నుంచి గ్యాంగ్ టక్

ఈ మార్గం సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తున సాగుతుంది. అంతెత్తులో సమయాన్ని మరిచిపోతూ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని ఆస్వాధిస్తూ ముందుకు సాగిపోవడం ప్రతి బైకర్ కల. ఆ కల డార్జిలింగ్ నుంచి గ్యాంగ్ టక్ వెళ్లే మార్గంలో నిజమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

P.C: You Tube
మొత్తం దూరం..... 97 కిలోమీటర్లు

సమయం.... 3 నుంచి 4 గంటలు

నేషనల్ హైవే... ఎన్ హెచ్ 31ఏ, ఎన్ హెచ్ 710

పూనే నుంచి ముంబై

పూనే నుంచి ముంబై

P.C: You Tube

వారాంతాల్లో ముంబై యువత ముంబై నుంచి పూనేకు అదే విధంగా పూనే నుంచి ముంబై కు రావడం ఎక్ువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాల సమయంలో ఈ ప్రాంతంలో ప్రయాణం యువతకు చెప్పలేనంత థ్రిల్ ను కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


మొత్తం దూరం..... 149 కిలోమీటర్లు

సమయం.... 3 నుంచి 4 గంటలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X