Search
  • Follow NativePlanet
Share
» »మనస్సు దోచే ఊటీ అందాలు - సందర్శనలో చూడాల్సిన అద్భుత స్థలాలు

మనస్సు దోచే ఊటీ అందాలు - సందర్శనలో చూడాల్సిన అద్భుత స్థలాలు

మనస్సు దోచే ఊటీ అందాలు - సందర్శనలో చూడాల్సిన అద్భుత స్థలాలు

తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేస్తాయి. సుందరమైన హిల్ స్టేషన్ కు రారాజు వంటిది ఊటి. ఊటిని ఉదక మండలం అనే పేరుతో కూడా పిలుస్తారు. సౌత్ ఇండియాలో తమిళనాడు రాష్ట్రంలో పశ్చిమ కనుమలలలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం. నీలగిరి జిల్లా కేంద్రం ఊటి. దక్షిణ భారత దేశంలో చాలా మంది ఊటి పర్యటనకు వెళుతుంటారు. ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండే ఊటీని ఎందుకు ఇష్టపడుతారంటే? ఊటి అంతా పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. టీ తోటలు, కాఫీతోటలు మరియు ఇతర రకాల చెట్లతో ప్రదేశం మొత్తం పచ్చగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.

ఇది హిల్ స్టేషన్ కావడం వల్ల పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఊటి పర్యటనకు వచ్చే పర్యాటకులు కొన్నిముఖ్యమైన ప్రదేశాలు మాత్రమే పరిమితంగా చుట్టి వస్తుంటారు. అయితే ఊటి చుట్టూ సందర్శించవల్సిన మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలేంటో తెలుసుకుందాం..

రోజ్ గార్డెన్ లేదా రోజ్ గార్డెన్:

రోజ్ గార్డెన్ లేదా రోజ్ గార్డెన్:

ఇది ఊటి స్టేషన్ కు 2కిలోమీటర్ల దూరంలో ఉంది. అద్భుతమైన పూల మొక్కలు, అరుదైన పుష్ప జాతుల మొక్కలను ఇక్కడ చూడవచ్చు. దేశంలో అత్యధిక గులాబీ ఉత్పత్తిని కలిగి ఉంది. ఇక్కడ పెరిగిన గులాబీలు మనోహరమైనవి మరియు గొప్ప మార్కెట్ విలువను కలిగి ఉంటాయి. మే నెలలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ బొటానికల్ గార్డెన్లో 20 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా దర్శించాల్సిందే.

PC: Big Eyed Sol

లేక్ పార్క్:

లేక్ పార్క్:

ఊటి మధ్యలో ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలు మిమ్మల్ని మైమరిసిస్తాయి. ఊటిలో చూడదగ్గ మరో అద్భుత ప్రదేశం లేక్ పార్క్. ఇది అపసవ్యమైన ‘L' ఆకారంలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ఇక్కడ ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు బోటింగ్ చేయవచ్చు. ఈ సరస్సులో బోటింగ్ చేయడం ఒక సరికొత్త అనుభూతి కలిగిస్తుంది.

Photo Courtesy: Aditya Banerjee

జింకల పార్క్:

జింకల పార్క్:

వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏనుగులు, జింకలు, పులులు, నీటి పక్షులు ఇలా వివిధ రకాల జంతువులను చూడవచ్చు.

టాయ్ ట్రైన్:

టాయ్ ట్రైన్:

ఊటీ పర్యాటక ప్రదేశాలలో ప్రధాన ఆకర్షణగా నీలిగిరి మౌంటెన్ రైల్వే టాయ్ ట్రైన్ అని పిలువబడే టాయ్ రైలు. 1899లో ప్రారంభమైన ఈ ట్రైన్ అడవి, సొరంగాలు, దిబ్బలు, పొగమంచు, పక్షుల మధ్యగా ప్రయాణం చేయించి, ఉత్తమ దృశ్యాలతో మనోహరమైన అనుభూతిని మిగుల్చుతుంది.

PC: Jon Connell

దొడ్డ బెట్ట:

దొడ్డ బెట్ట:

నీలగిరిలో ఉన్న ఎత్తైన శిఖరం దొడ్డబెట్ట, ఇక్కడ నెలవైన నీలగిరి అందాలను టెలిస్కోప్ తో వీక్షించడం వల్ల పర్యాటకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది.

Photo Courtesy : Manikantareddy

అప్పర్ భవానీ సరస్సు:

అప్పర్ భవానీ సరస్సు:

నీలగిరి కనుమల సౌందర్యాన్ని చూడాలంటే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. అప్పర్ భవానీ రిజర్వాయర్ లో ఉన్న సరస్సు నుండి సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు మనస్సును అట్లే కట్టిపడేస్తాయి.

Photo Courtesy: Michael varun

అవలాంచె సరస్సు:

అవలాంచె సరస్సు:

ఊటిలో అద్భుతంగా ఆకర్షణీయంగా ఒంపులు తిరిగి ఉండే సరస్సు అవలాంచె సరస్సు. పచ్చిక బయళ్లులాంటి కొండల చుట్టూ విస్తరించిన ఈ సరస్సు ప్రకృతి ప్రేమికుల మది దోచేస్తుంది. చాలా మంది ఇక్కడ నేచర్ వాక్ చేస్తారు.

Photo Courtesy: Raghavan Prabhu

కెట్టి వ్యాలి వ్వూ:

కెట్టి వ్యాలి వ్వూ:

కూనూర్ వెళ్ళే దారిలో ఉంది. కోయంబత్తూర్, మైసూర్ మైదానాలలో ఉండే చిన్న గ్రామాలన్నింటినీ చూడవచ్చు.

పైకారా సరస్సు:

పైకారా సరస్సు:

ఇక్కడ దేశంలోనే అత్యంత పురాతన పవర్ ప్లాంట్ ఉంది. ఊటికి 12కిమీ దూరంలో ఉన్న ఈ సరస్సు షోలా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నది. ఈ సరస్సులో స్పీడ్ బోటింగ్, బోటింగ్ తదితర వినోదాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Photo Courtesy: Antony Grossy

కామరాజ్ సాగర్ సరస్సు:

కామరాజ్ సాగర్ సరస్సు:

ఊటిలో సందర్శించవల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇది ఒక ఫేమస్ పిక్నిక్ స్పాట్. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. కామరాజ్ సాగర్ డ్యామ్ సినిమా షూటింగ్ లకు కేంద్రంగా పేరొందింది. ఇక్కడి సూర్యాస్తమయం భలే అందంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సంధ్యనల్లా రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు. ఇది ఊటికి10కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఎమెరాల్డ్, బెల్లికల్ సరస్సులు:

ఎమెరాల్డ్, బెల్లికల్ సరస్సులు:

టీ, కాఫీ తోటలను ఆనుకుని ఉన్న ఎమెరాల్డ్ సరస్సు..ప్రకృతి అందాలతో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న బెల్లిక్కల్ సరస్సు సైతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్, మౌంటైన్ బైకింగ్ కు ఇది ఫేమస్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X