Search
  • Follow NativePlanet
Share
» » 1,116 శివలింగాల మధ్యన పంచముఖేశ్వర శివలింగాన్ని స్పృసించి శివనామ స్మరణ చేస్తే

1,116 శివలింగాల మధ్యన పంచముఖేశ్వర శివలింగాన్ని స్పృసించి శివనామ స్మరణ చేస్తే

పరమశివుడు కొలువైన క్షేత్రాలను దర్శించినప్పుడు, కొన్ని శివలింగాలు ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఐదు ముఖాలు గల శివలింగాన్ని కలిగిన క్షేత్రంగా 'జమ్ములపాలెం' కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

సాధారణంగ శైవ క్షేత్రాల్లో ఒకటికంటే ఎక్కువగానే

సాధారణంగ శైవ క్షేత్రాల్లో ఒకటికంటే ఎక్కువగానే

సాధారణంగ శైవ క్షేత్రాల్లో ఒకటికంటే ఎక్కువగానే శివ లింగాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ క్షేత్రంలో ఒక వేయి నూట పదహారు శివలింగాలు ఒక వరుస క్రమంలో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి శివలింగానికీ పంచలోహ నాగాభరణం అలంకరించారు.

ప్రధానమైన శివ లింగం మాత్రం ఐదు ముఖాలను కలిగి ఉంటుంది.

ప్రధానమైన శివ లింగం మాత్రం ఐదు ముఖాలను కలిగి ఉంటుంది.

ప్రధానమైన శివ లింగం మాత్రం ఐదు ముఖాలను కలిగి ఉంటుంది. ఇక ఈ శివలింగం గర్భాలయంలో కాకుండా మంటపంలో ఉండటం మరో విశేషం. శివలింగాల మధ్యలో 108 శక్తిపీఠాలను ఏర్పాటు చేసి, మధ్యభాగంలో పంచముఖేశ్వర శివలింగాన్ని ప్రతిష్టించారు.

ఒక్కసారి ఓం నమశ్శివాయ

ఒక్కసారి ఓం నమశ్శివాయ

ఒక్కసారి ఓం నమశ్శివాయ అనే పంచాక్ష్రీ మంత్రాన్ని జపించినయెడల, 1,116 సార్లు జపించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

శివలింగ పూజ చేసిన వారు

శివలింగ పూజ చేసిన వారు

శివలింగ పూజ చేసిన వారు ముల్లోకాలలోని శివలింగాలకు పూజ చేసినట్లే అని తెలిపారు. శివలింగం మహాదివ్యమైంది, శక్తివంతమైంది. ఈ ఆలయాన్ని ఒక సారి దర్శించి శివలింగాలను స్పృసించి శివనామ స్మరణ చేస్తే ఏడాదంతా ప్రతి రోజు మూడు పూటలా శివార్చన చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం.

ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకాలు

ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకాలు

ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకాలు చేయించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ దోషాలు తొలగిపోవడానికి గాను, అభిషేకాలు చేయిస్తుంటారు. ఇక్కడి అనేక శివలింగాలను ఒక్కసారిగా దర్శించడం వలన, మనసే శివమందిరమైనట్టుగా అనిపిస్తుంది .. సదా సదాశివుడి ధ్యానంలో వుండిపోవాలనిపిస్తుంది.

ఆలయ విశేషాలు:

ఆలయ విశేషాలు:

పాదర్తి వెంకటశేషమాంబ 1991లో తన శిష్యగణతో తీర్థయాత్రలకు బయలుదేరారు. కాశీ వెళ్లి అక్కడ నుండి నేపాల్ లోని ఖాట్మండ్ చేరుకున్నారు. అక్కడ పశుపతి నాదాలయంలో 524 శివలింగాలు వారికి కనిపించాయి. వాటిని చూసిన ఆమె ఎంతో త్రుప్తి పొంది, తన ప్రాంతంలో ఇంత కంటే అద్భుతంగా 1116 శివలింగాల వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పించారు.

ఇందుకు కొందరు భక్తులతో

ఇందుకు కొందరు భక్తులతో

ఇందుకు కొందరు భక్తులతో ప్రత్యేకంగా పాదర్తి వెంకటేశేషమాంబ పూరిశెట్టి రెలిజియన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జమ్ములపాలెంలోనే 2 ఎకరాల విస్తీర్ణంలో 1995లో 1116 శివలింగాలను వేదికకు శంకుస్థాపన చేయగా, 1999లో పూర్తయింది. 2007లో గురుమాత వెంకట శేషమాంబ దేవాలయ ప్రాంగణంలోనే సమాధి అయ్యారు. అప్పటి నుండి ఆమె కుమారుడు బ్రహ్మయ్య దేవాలయ బాధ్యతలు చూస్తున్నారు. ప్రతి నెలా మాసశివరాత్రి నాడు సాయంత్రం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం ఈ ఆలయం ప్రత్యేకత.

పూజలు :

పూజలు :

కార్తీకమాసంలో ప్రతి సోమవారం, శివరాత్రి మరియు ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజులలో స్వామివారికి పంచామృతాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించెదరు. ఆ సమయంలో భక్తులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం పొందెదరు. అంతేగాకుండా కార్తీకమాసంలో ఈ ఆలయంలో, మహిళలు విశేషంగా దీపారాధన నిర్వహించెదరు. ప్రతి మాస శివరాత్రినాడు, రాత్రికి ఏకాదశ రుద్రాభిషేకం మరియు రజత బిల్వాలతో అష్టోత్తర శతనామావావళి నిర్వహించెదరు.

ఈ ఆలయానికి ప్రతి నిత్యం

ఈ ఆలయానికి ప్రతి నిత్యం

ఈ ఆలయానికి ప్రతి నిత్యం జిల్లా నలుమూలలనుండి భక్తులు విశేషంగా తరలి వచ్చి, ఆలయంలో కొలువుదీరిన పంచముఖేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి నిత్యం ఈ ఆలయం ఓం నమశ్శివాయ, హరహర మహాదేవ మరియు శంభోశంకర నినాదాలతో మార్మోగుతుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X