Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

By Venkatakarunasri

మన భారత దేశం సరస్సుల నిలయం. మనసు కుదటపడటానికి, కాసింత విశ్రాంతి తీసుకోవడానికి, అందమైన పక్షుల కిల కిలా రాగాలను వినటానికి సరస్సుల వద్దకి చాలా మంది పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. కొన్ని ప్రదేశాలలో పార్కులలోనే సరస్సులు మనకు కనిపిస్తాయి. సరస్సు ఒడ్డున కూర్చొని, వచ్చి పోయే పక్షులను చూస్తూ కాలం గడిపేయవచ్చు.

కొంత స్థలంలో నీటితో నింపబడి ఉంటే దానిని సరస్సు అంటారు. సరస్సుకు, సముద్రానికి, నదికి చాలా తేడా ఉంటుంది. సముద్రం, నది కంటే సరస్సు చాలా చిన్నది కానీ లోతు విషయం లో గాని, వైశాల్యం విషయంలో గాని చెరువుకంటే సరస్సు పెద్దది. సరస్సులో బోటింగ్ వంటి అనేక నీటి సంబంధిత క్రీడలు ఆడవచ్చు.

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

దాల్ సరస్సు, శ్రీ నగర్

'శ్రీనగర్ రత్నం' గా ప్రజాదరణ పొందిన దాల్ సరస్సు కాశ్మీర్ లోయ లోని రెండవ అతిపెద్ద సరస్సు. ఇది శ్రీనగర్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఈ సరస్సు పడవ-ఇళ్ళు మరియు 'షికారా' లేదా చెక్క పడవ ప్రయాణాలకు ప్రసిద్ధి చెందింది. పడవ-ఇళ్ళు మరియు 'షికారాల' లో సవారీలు చేస్తూ, యాత్రికులు ఇక్కడ అందమైన సూర్యాస్తమయాలు అనుభవిస్తుంటారు.

సందర్శించు సమయం : జులై నుండి ఆగస్ట్

Photo Courtesy: Rambonp love's all creatures of Universe.

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

మానస్బల్ సరస్సు, శ్రీనగర్

మానస్బల్ సరస్సు శ్రీనగర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో జీలం లోయలో ఉంది. ఈ సరస్సు కాశ్మీర్ లోనే అత్యంత లోతైన సరస్సు గా పరిగణించబడుతుంది. సహజ సౌందర్యాన్ని ఇనుమడింపచేసే కలువ పువ్వల కై పర్యాటకుల లో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు 'కాశ్మీర్ సరస్సులలో అత్యున్నత రత్నం' గా పేరు పొందింది. జూలై మరియు ఆగస్టు మధ్య కాలం ఇక్కడ నీటి స్కీయింగ్ కి అనుకూలమైనది. ఈ సరస్సు పక్షుల వీక్షణకు కూడా అనువైనది.

Photo Courtesy: Oww Ess Mee

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

నాగిన్ సరస్సు, శ్రీ నగర్

చుట్టూ చెట్లు ఉండటం చేత "వలయం లో రత్నం" అని పిలవబడే నాగిన్ సరస్సు శ్రీనగర్ నగరంలో ఉన్నది. ఇక్కడ పర్యాటకులు ఇష్టబడే ఎన్నెన్నో షికారాలు, పడవ-ఇళ్ళు సరస్సులలో తేలియాడుతూ కనిపిస్తాయి. ఈ ప్రాంతంలోని ఇతర సరస్సులతో పోలిస్తే, సందర్శకులు ఈ సరస్సు లో ఈత కొట్టడానికి ఇష్టపడతారు. స్కీయింగ్ మరియు ఫైబర్ గ్లాస్ సెయిలింగ్ వంటి జలక్రీడలు సాహసోపేత పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.

సందర్శించు సమయం : జూన్ నుండి ఆగస్ట్

Photo Courtesy: Rambonp love's all creatures of Universe.

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

వులార్ సరస్సు, బారాముల్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, బారాముల్లా జిల్లాలో గల హరముక్ పర్వత పాద భాగం లోగల వూలార్ సరస్సు సోపూర్, బండీపూర్ పట్టణాల మధ్యలో ఉంది. ఈ సరస్సుని ఆసియా ఖండం లో కెల్ల అతి పెద్ద మంచి నీటి సరస్సు. సూర్యాస్తమయం వీక్షించడానికి అనువైనదిగా ఇది ప్రసిద్ధి.

సందర్శించు సమయం : జూన్ నుండి ఆగస్ట్

Photo Courtesy: Mike Cork

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

మానసార్ లేక్, జమ్మూ

గొప్ప పర్యాటక ప్రాంతంగా పేరు పడ్డ జమ్మూ లో మానసార్ లేక్ పర్యాటకులలో నిత్యం రద్దీగా ఉంటుంది. అందమైన ఈ సరస్సు చుట్టూ పచ్చని దట్టమైన అడవులు వుంటాయి. స్థానిక విశ్వాసాలు ల మేరకు కొత్తగా పెళ్లి అయిన జంటలు శేష నాగు ఆశీర్వాదం కొరకు ఇక్కడకు వచ్చి మూడు ప్రదక్షిణలు ఈ సరస్సు చుట్టూ చేస్తారు. మానసార్ లేక్ లో పర్యాటకులు బోటింగ్ కూడా చేస్తారు.

సందర్శించు సమయం : ఏప్రిల్ నుండి అక్టోబర్

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

పాన్గోంగ్ సరస్సు, పాన్గోంగ్

జమ్మూ కాశ్మీర్ లోని లెహ్ జిల్లా లో ఉన్న పాన్గోంగ్ సరస్సు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నది . పక్షులను ప్రేమించేవారు ఈ సరస్సు దగ్గర వేచి వుంటే, పొడుగు తల కల పెద్ద బాతులు, సైబీరియన్ కొంగలు మరియు జలపక్షులు ఇలా అనేక రకాల విహంగ పక్షులను చూడవొచ్చు. శీతాకాలంలో ఈ సరస్సు ఉప్పగా గడ్డ కడుతుంది. లెహ్ నుండి 5 గంటలు సమయం పట్టే ఈ స్థలం చూడటానికి తప్పకుండా పర్మిట్ తీసుకోవాలి. ఇక్కడ హిందీ చిత్రం త్రీ ఇడియట్స్ సినిమా చిత్రీకరించారు.

సందర్శించు సమయం : మే నుండి ఆగస్ట్

Photo Courtesy: Rambonp love's all creatures of Universe.

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

రేణుకా లేక్ , నహాన్

రేణుకా లేక్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని నహాన్ కు 40 కి. మీ.ల దూరం లో కల ప్రసిద్ధ పర్యాటక సరస్సు. హిమాచల్ ప్రదేశ్ లో ఇదే అతి పెద్దది రుషి జమదగ్ని తన కుమారుడు అయిన పరసురాముడిని తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. పరసురాముడు తల్లి రేణుకను వధించాడు. తర్వాత తప్పును తెలుసుకొని, ఆమె జ్ఞాపకార్ధం, ఆమె ఆకారం లో ఈ సరస్సును నిర్మించారు. నవంబర్ నెల లో ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. టూరిస్టులు ఇక్కడ రేణుక టెంపుల్ చూడవచ్చు. సరస్సు లో సుదీర్ఘ దూరం బోటింగ్ చేసి ఆనందించవచ్చు.

సందర్శించు సమయం : ఏప్రిల్ - జూన్ మరియు సెప్టెంబర్ - నవంబర్

Photo Courtesy:Rambonp love's all creatures of Universe.

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

రేవల్సర్ సరస్సు , మండి

రేవల్సర్ సరస్సు మండి లో ఉన్న ప్రసిద్ద పర్యాటక మజిలీ. ఇక్కడ ఉన్న బౌద్ధ మఠాలను బౌద్ధులు త్సోపేమా గా పిలుస్తారు. మండి నుండి 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ సరస్సు ఫిబ్రవరి చివరలో లేదా మార్చ్ నెల మొదట్లో జరిగే సిసు ఫెయిర్ ఇంకా బైసఖి వేడుకలకి రేవల్సర్ ప్రసిద్ది. ఈ పండుగ రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు. సందర్శించు సమయం : మార్చి నుండి అక్టోబర్

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ప్రశార్ లేక్, మండి

మండి నుండి 62 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఒక గ్రామంలో ప్రశార్ సరస్సు ఉంది. ఈ సరస్సు ఒడ్డున మూడు అంతస్తుల ఆలయం ఉంది. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాల వల్ల ఈ సరస్సు జలం నీలం రంగులో కనిపిస్తుంది. ఈ సరస్సులో చిన్న ద్వీపాన్ని గమనించవచ్చు. ఎంతో పవిత్రం గా భావించే ఈ ప్రాంతం లో వివిధ రకాల పండుగలు జరుపుకుంటారు.

సందర్శించు సమయం : ఏప్రిల్ - జులై మరియు సెప్టెంబర్ - నవంబర్

Photo Courtesy: Prasanth Jose

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

దాల్ సరస్సు, ధర్మశాల

ధర్మశాల నుంచి 11 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు. చుట్టూ దట్టమైన పచ్చటి దేవదారు చెట్లతో వుండే ఈ సరస్సు ధర్మశాల, మెక్లియాడ్ గంజ్ లలో పర్వతారోహణ చేసే వారికి బేస్ కాంప్ గా పనిచేస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో ఈ సరస్సు ఒడ్డున ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సరస్సు లో మునక వేస్తె బాధలు అన్నీ తొలగిపోయి శివుడి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం.

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

భీమ్టాల్ లేక్, భీమ్టాల్

ఉత్తరాఖండ్ లోని భీమ్టాల్ లో ఉన్న భీమ్టాల్ లేక్ నైనిటాల్ చుట్టూ పక్కల ఉన్న సరస్సులలో అతి పెద్దదైన సరస్సులలో ఒకటి. పాండవుల లో ఒకరైన భీముని పేరుతో ఈ సరస్సు ప్రాచుర్యం పొందింది. ఔత్సాహికులకు పాడ్లింగ్ మరియు బోటింగ్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ సరస్సు మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపం పై ఉన్న అద్భుతమైన అక్వేరియం ని చూడడానికి పర్యాటకులు బోటు ద్వారా చేరుకుంటారు.

సందర్శించు సమయం : ఫిబ్రవరి - ఏప్రిల్ మరియు ఆగస్ట్ - నవంబర్

Photo Courtesy: Michael Badt

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

నైనితాల్ సరస్సు, నైనిటాల్

భారత దేశపు సరస్సుల జిల్లా గా పిలువబడే నైనిటాల్ లో నైని సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలు కలవు. పర్యాటకులు ఇక్కడ యాచింగ్, రోఇంగ్ , పడ్డ్లింగ్ వంటివి చేయవచ్చు. ఒకనాడు ఇక్కడ ముగ్గురు ఋషులు యాత్ర లో భాగంగా దాహం వేసి నైనిటాల్ వద్ద ఆగారు కానీ నీరు దొరకలేదు. వెంటనే వారు అక్కడ ఒక పెద్ద కన్నం వేసి మానస సరోవర్ సరస్సు నుండి అందులోకి నీటిని తెప్పించారు. ఫలితంగా నైని సరస్సు ఏర్పడింది.

సందర్శించు సమయం : మార్చి నుండి జూన్

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

డండమ సరస్సు, సోహ్న

సోహ్న పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పేరుగాంచిన డండమ సరస్సు సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశం ఆరావళి పర్వతాలకు దిగువ భాగాన ఉంది. ఈ సుందరమైన ప్రకృతి దృశ్యాలలో పర్యాటకులు బోటింగ్ ని కూడా ఆనందించవచ్చు. ఫిబ్రవరి నెలలో జరిగే వింటేజ్ కార్ రాలీ మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ.

Photo Courtesy: Gaurav Shukla

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఎగువ సరస్సు, భోపాల్

మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరం లో ఉన్న ఎగువ సరస్సు దేశంలో ఉన్న పురాతన మానవ నిర్మిత సరస్సు. కొలన్స్ నదిపై ఒక గట్టున ఉన్న ఈ సరస్సు భారతదేశంలో అందమైన సరస్సు గా పిలవబడ్డది. ఈ సరస్సు పర్యాటకులకు ఆకర్షణీయంగా కనిపించడానికి దీనికి సమీపంలో ఒక అందమైన తోట, కమల పార్కు నిర్మించారు దీంతో ఈ ప్రదేశం మొత్తం మరింత అందాన్ని సంతరించుకుంది.

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

ఇండియాలోని 15 అందమైన సరస్సులు !!

చిల్కా సరస్సు, చిల్కా

ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి 81 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్కా సరస్సు భారత దేశంలోని కోస్తా సరస్సులలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ సరస్సు ఉప్పు నీటి సరస్సు గా, ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సరస్సుగా పేరుగాంచినది. చిల్కా సరస్సు లోపల అనేక చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలను మీరు సందర్శిస్తే రెట్టించిన ఉత్సాహంతో ఆనందిస్తారు.

సందర్శించు సమయం : జూన్ నుండి అక్టోబర్

Photo Courtesy: Naga Srinivas

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X